యంగ్ హీరో నాగశౌర్య హీరోగా సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం `లక్ష్య`. సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీ వేంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకాలపై ప్రముఖ నిర్మాతలు నారయణదాస్ కె. నారంగ్, పుస్కూర్ రామ్‌మోహన్‌రావు, శరత్ మరార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నాగశౌర్య సరసన కేతిక శర్మ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో ఒక కీలక పాత్రలో విలక్షణ నటుడు జగపతి బాబు నటిస్తున్నారు. నాగశౌర్య 20వ చిత్రంగా ప్రాచీన విలువిద్య నేపథ్యంలో స్పోర్ట్స్ బేస్డ్ ఫిలింగా అన్ని కమర్షియల్ హంగులతో ఈ మూవీ తెరకెక్కుతోంది. కాగా సంక్రాంతి శుభాకాంక్షలతో సరికొత్త పోస్టర్ ని రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఇప్పటి వరకు పవర్‌ఫుల్ మాస్ స్టిల్స్‌ని రిలీజ్ చేసిన మేకర్స్ ఈ సారి నాగశౌర్య, కేతికశర్మలతో కూడిన రొమాంటిక్ పొస్టర్ విడుదల చేశారు. ఈ రొమాంటిక్ పోస్టర్‌కు సోషల్‌మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా ఫైనల్ షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటోంది.
యంగ్ హీరో నాగశౌర్య, కేతికశర్మ, జగపతి బాబు ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్: రామ్‌రెడ్డి, సంగీతం: కాలబైరవ, ఎడిటర్: జునైద్, నిర్మాతలు: నారయణదాస్ కె. నారంగ్, పుస్కూర్ రామ్‌మోహన్‌రావు, శరత్ మరార్, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: సంతోష్ జాగర్లపూడి.