Thapassi movie Trailar launch

ఆర్.యస్ మూవీస్ పతాకంపై అభిరామ్,ఇంతియాజ్,భవ్య,మమతశ్రీ ,చిత్రం శ్రీను,జీవ,సుమన్ శెట్టి,ఫిష్ వెంకట్,ఛత్రపతి శేఖర్,చిట్టిబాబు నటీనటులుగా రాజు శెట్టి దర్సకత్వంలో పి. శ్రీ కృష్ణ,అజయ్ లు నిర్మిస్తున్న “తపస్సి” చిత్రానికి మిత్ర సంగీతం అందించాడు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిలుగా వచ్చిన లయన్ సాయి వెంకట్,గొట్టిముక్కల పద్మారావు, మేడ్చెల్ యంపిపి జగన్,బి.వెంకటరెడ్డి,బాలాజీ,మరియు చిత్ర యూనిట్ తో కలసి ఈ సినిమా పాటలను,టీజర్,ట్రైలర్ ను విడుదలచేసారు**

*అనంతరం అతిధిగా వచ్చిన లయన్ సాయి వెంకట్ మాట్లాడుతూ* :-దర్శకుడు రాజు శెట్టి చిత్రం శీను దగ్గర పనిచేసి ఇప్పుడు ఆయన్నే తన సినిమాలో పెట్టుకొని రేమ్యూనిరేషన్ ఇవ్వడం అనేది ఒక సినిమా ఇండస్ట్రీ కు మాత్రమే సాధ్యం. ఇండస్ట్రీ లో చాలా మంది వాస్తవం చెప్పుకోరు,వాస్తవం చెప్పుకొన్నపుడే సినిమా రంగం లో ఎదుగుతారు, కానీ తను ఎలా ఎదిగాడో కల్మషం లేకుండా చెప్పడం,అభినందనీయం.దర్శకుడికి ఎంత టాలెంట్ ఉన్నా, నిర్మాత అవకాశం ఇవ్వక పోతే డైరెక్టర్ టాలెంట్ బయటకు రాదు.నిర్మాత శ్రీకృష్ణ, రాజు కు తన టాలెంట్ నిరూపించుకువడానికి అవకాశమిచ్ఛాడు.సినిమా చాలా బాగా తీసాడు. సినీపరిశ్రమలో ఎవరు ఎప్పుడు ఏ స్థాయికి వెళతారో చెప్పలేం, నమ్ముకున్న సినీపరిశ్రమ లో ఎప్పుడైనా వారు ఒకరోజు సెలెబ్రిటీ అవుతారు.చిత్రం శ్రీను ను నేను గత 15 సంవత్సరాలుగా చూస్తున్నాను. చాలామంది ఆర్టిస్ట్ లు సినిమాల్లో నటిస్తూ కొంత కాలానికి ఔట్ డేటెడ్ అవుతుంటారు,కానీ చిత్రం సినిమాతో చిత్రం శ్రీను గా మారిన తను కంటిన్యూ గా సినిమాలు చేస్తూనే ఉన్నాడు. ఈ సినిమాలో పాటలు,ట్రైలర్ తో పాటు థ్రిల్లర్, రొమాంటిక్, హరర్ ఇలా అన్ని కంటెంట్స్ ఉన్నాయి.హారర్ కు లాంగ్వేజ్ తో పనిలేదు అంతటా డిమాండ్ ఉంది. దర్శక,నిర్మాతలు అటువంటి కథలను సెలెక్ట్ చేసుకొని తీసిన ఈసినిమా వారికీ మంచి పేరుతోపాటు ఆదాయం కూడా కలగాలని అన్నారు..

*గొట్టెముక్కల పద్మారావు మాట్లాడుతూ* :-హారర్ సినిమాలంటే నాకు భయం,నేను పెద్దగా చూడను.పెద్ద వంశీ మూవీ అన్వేషణ చూసి ఆయనే డైరెక్టర్ కావాలని ఒక నవల చదివి ఏప్రిల్ 1 విడుదల అను సినిమాను కొందరి మిత్రులతో కలిసి సినిమా తీసాను.ఈ సినిమా ట్రైలర్ ను చూసిన తరువాత హారర్ కు తగ్గట్లే మంచి ఆర్టిస్ట్ లు కూడా ఉన్నారు.చిన్న బడ్జెట్ అయినా నిర్మాతకు బడ్జెట్ పెరగకుండా పెద్ద అరిస్టులతో సినిమా బాగా తీశారు. ఇలాంటి టాలెంట్ ఉన్న దర్శకులకు అవకాశమిచ్చిన నిర్మాత కు థాంక్స్ చెప్పాలి. నేను ఈ సినిమా చూసాను,దర్శకుడు పెద్ద వంశీ అంతటి గొప్పవడవ్వాలని కోరుకుంటానని అన్నారు.

*మేడ్చెల్ యంపిపి జగన్ మాట్లాడుతూ* :-మేము ఎక్కువగా సినిమా ఫంక్షన్లకు రాము,ఇదే మొదటిసారి రావడం, ఈ సినిమా ట్రైలర్, పాటలు బాగున్నాయి.’తపస్సి’ చిత్రం దర్శక, నిర్మాతలకు మంచి పేరు తీసుకొచ్చి మరిన్ని సినిమాలు తీయాలని న్నారు.

*చిత్రం శ్రీను మాట్లాడుతూ* :-నా దగ్గర పనిచేసిన చాలా మంది డైరెక్టర్స్, యాక్టర్స్ అయ్యారు.అలా అయిన వారి లో రాజు శెట్టి ఒకరు.తను దర్శకత్వం చేస్తున్నానని చెప్పడంతో చాలా సంతోష పడ్డాను..ఇపుడు తన సినిమాలో యాక్ట్ చేయడం జరిగింది.సినిమా కోసం దర్శక,నిర్మాతలు చాలా కష్టపడ్డారు వారిద్దరికీ ఈ సినిమా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నానని అన్నారు…

*దర్శకుడు రాజు శెట్టి మాట్లాడుతూ* :-నేను చిత్రం శ్రీనన్న దగ్గర అసిస్టెంట్ గా 300 రూపాయలకు పనిచేశాను,ఆయనకు గొడుగులు కూడా పట్టాను.ఇప్పుడు ఆ అన్ననే నా సినిమాలో పెట్టుకొని రేమ్యూనిరేషన్ ఇచ్చాను.ఇదంతా అన్న సపోర్ట్ వలనే..నేను తీసిన దేవి విఘ్నం సినిమా తరువాత చేస్తున్న 2వ సినిమా ఇంత బాగా రావడానికి కారణం..నా ఎడిటిండ్ టీం నుండి డైరెక్షన్ టీం వరకు అందరూ నాకు సపోర్ట్ చేస్తూ కష్టపడి పనిచేశారు. ఇందులో సీనియర్ ఆర్టిస్ట్ లను పెట్టాము ,వీరికి షూట్ టైం చెబితే మాకన్న ముందే వచ్చి మేకప్ వేసుకొని రెడి గా ఉండేవారు. వారంతా నేను ఏది చెప్పితే అది చేసారు. వీడు మా దగ్గర పనిచేశాడు కదా వీడి మాట నేను ఎందుకు వినాలనుకోకుండా..వీరు డైరెక్టుకు ఇచ్చే వ్యాల్యూ ఇస్తూ వీరంతా నాకు ఫుల్ సపోర్ట్ చేస్తూ పనిచేసినందున ఈ సినిమా అంతా బాగా వచ్చింది.నాకింత సపోర్ట్ చేసిన శ్రీనన్నకు ప్రత్యేక అభినందనలుతెలుపుకుంటున్నాను.నిర్మాత ఇందులో మంచి కామెడీ రోల్ చేసాడని అన్నారు

*హీరో అభిరామ్ మాట్లాడుతూ* :-దర్శకుడు ఈ సినిమా కోసం వన్ మ్యాన్ ఆర్మీ లా పనిచేశాడు.నాకీ అవకాశం ఇచ్చిన దర్శక,నిర్మాతలకు ధన్యవాదాలు తెలిపారు.

నిర్మాత పి.శ్రీకృష్ణ మాట్లాడుతూ:-నామొదటి సినిమా లీల తరువాత చేస్తున్న 2వ సినిమా తపస్సి..ఈ 2019 సంవత్సరం నేను మరచిపోలేను.. నా మొదటి సినిమాకు కూడా ఇంత సపోర్ట్ రాలేదు.నేను ఇచ్చిన మాట తప్పను అనే పేరుంది,సారథి స్టూడియోలో ఒక ఫంక్షన్లో రాజును, కలిసినప్పుడు నా సినిమాలో డైరెక్షన్ అవకాశమిస్తామని చెప్పాను,ఇచ్చిన మాటను ఈ సినిమా ద్వారా నెరవేర్చుకొన్నాను అని అన్నారు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here