ఓటిటి లు వద్దు థియేటర్స్ ముద్దు..తెలంగాణా థియేటర్స్ ఓనర్స్ అసోసియేషన్

ప్రస్తుతం ఓటిటి రాజ్యమేలుతోంది. ఓటిటి రావడంతో కొన్ని సినిమా థియేటర్స్ మూత పడే అవకాశాలు ఉన్నాయి. ఓటిటి లకు అడ్డుకట్ట వెయ్యకపోతే సినీ పరిశ్రమ చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంది.అలాగే థియేటర్స్ ను నమ్ముకున్న చాలా కుటుంబాలు చాలా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి వస్తుందని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ లో తెలంగాణా థియేటర్స్ ఓనర్స్ అసోసియేషన్ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో  తెలంగాణా ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ వైస్ ప్రెసిడెంట్ శ్రీధర్, సెక్రెటరీ సునిల్ నారంగ్, థియేటర్ ఓనర్స్ అసోసియేషన్ సెక్రెటరీ విజయేందర్ రెడ్డి, నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు, జెమిని కిరణ్ , జాయింట్ సెక్రటరీ బాల గోవింద్ రాజ్, టి.ఎఫ్.సీ.సీ మెంబర్ అనుపమ్ రెడ్డి,మరియు సినిమా ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా

నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. రామారావు నాగేశ్వరరావు ఇప్పుడు లేకపోయినా వాళ్ళ సినిమాలు అడిన థియేటర్స్ ఇప్పటికీ వున్నాయి. నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్స్ ఎగ్జిబిటర్స్ మధ్య అవినాభావ సంబంధం వుంది.థియేటర్స్ లో  సినిమా విడుదలైతే  నిర్మాతల దగ్గర నుండి పోస్టర్స్ వేసే బాయ్స్ ,కూల్ డ్రింక్స్ అమ్మే వర్కర్స్ వరకు ఇలా అనేక మందికి ఉపాధి దొరుకుతుంది. సినిమా అనుభూతి అనేది ఓటిటీ కన్నా థియేటర్ లోనే బాగా వుంటుంది. నిర్మాతలకు నా విజ్ఞప్టి ఏమిటంటే మీ సినిమాలను మొదటగా  ఓ.టి.టి లలో కాకుండా థియేటర్స్ లొనే విడుదల చేయాలని కోరుతున్నాము. తప్పని పరిస్థితులు ఓటిటి లో విడుదల చేయాల్సి వస్తే  ఓటిటి లో రిలీజ్ అయ్యే సినిమాలకు థియేటర్స్ లో విడుదల అయ్యే సినిమాలకు  కొన్ని రోజులు గ్యాప్ వుండేలా చూసుకొని విడుదల చెయ్యమని తెలుపుతున్నాము అన్నారు.

సునీల్ నారంగ్ మాట్లాడుతూ..మేము సెప్టెంబర్ 10 న లవ్ స్టొరీ రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేస్తే  అదే రోజు  టక్  జగదీష్ విడుదల చేస్తామని అనౌన్స్ చేశారు ఇది కరెక్ట్ కాదు. లాక్ డౌన్ కారణంగా చాలా మంది డిస్ట్రిబ్యూటర్స్ ఇబ్బంది పడతారని మేము ప్రెస్ మీట్ పెట్టి సినీ నిర్మాతలందరూ కూడా  థియేటర్స్ వ్యవస్థ ను బతికించాలని కోరుతూ మీరు థియేటర్స్ లో సినిమాలు విడుదల చేస్తే మాకేమీ అభ్యంతరం లేదు.కానీ ఓటిటి లో విడుదల చేయాలను కుంటే  మూడు నెలలు వరకు ఆగి ఆ తర్వాత మీ సినిమాలను ఓటిటి లో విడుదల చేసుకోమని రిక్వెస్ట్ చేసి చెప్పడం జరిగింది.అయినా కూడా వారు ఆగకుండా  మేము థియేటర్స్ లో విడుదల చేస్తున్న డేట్ కే  “టక్ జగదీశ్ ” సినిమాను విడుదల చేస్తున్నారు. అయితే మేము విడుదల చేసే రోజు కాకుండా  ఓటిటి లో విడుదలయ్యే “టక్ జగదీశ్” సినిమా డేట్ పోస్ట్ ఫోన్ చేసుకోమని నిర్మాతలతో మాట్లాడాను వాళ్ళు అమెజాన్ వాళ్ళతో మాట్లాడతాను అన్నారు కానీ పూర్తి భరోసా ఇవ్వలేదు . అలాగే నిర్మాత లందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే దయచేసి పండుగలకు పెద్ద సినిమాలని ఓ.టి.టి లో విడుదల చెయ్యద్దు. మేమంతా ప్రేక్షకులను థియేటర్స్ కు తీసుకు రావాలని  ప్రయత్నం చేస్తుంటే మీరు ఓటిటి లో సినిమాలను రిలీజ్ చేసి ప్రేక్షకులను థియేటర్స్ కు రాకుండా దూరం చేస్తున్నారు. ఇది సినిమా ఇండస్ట్రీకు మంచిది కాదు దీనివల్ల ఎక్కువగా నష్ట పోయేది నిర్మాతలే అలాగే ఈ సమస్యను చిరంజీవి గారి దృష్టికి తీసు కెళ్లాము చిరంజీవి గారు కూడా మాట్లాడతాను అని చెప్పారు  అన్నారు.

వైస్ ప్రెసిడెంట్ శ్రీధర్ మాట్లాడుతూ:.. ఈ మధ్య విడుదలైన సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్ లో నాకు ఓటిటి కంటే థియేటర్స్ అంటేనే ఇష్టం. నా సినిమా థియేటర్లో రిలీజ్ చేస్తానని చెప్పిన నాని ఇప్పుడు చేతులెత్తేసి అది నిర్మాతల ఇష్టం అని పిరికి మాటలు మాట్లాడుతున్నారు. థియేటర్స్ బాగుంటేనే నిర్మాతలు, హీరోలు, ఇండస్ట్రీ ఇలా ప్రతి ఒక్కరూ బాగుంటారు.ఇలాగే వుంటే ఓటిటీ వైపు వెళ్ళే నిర్మాతలకు తగిన సమాధానం చెపుతాము అన్నారు.

బాల గోవింద్ రాజ్ మాట్లాడుతూ:.. ఇప్పటి వరకు విడుదలైన సినిమాలన్నీ గొప్ప విజయం సాధించాయి.అలాగే హీరోలకు కూడా ఎంతో మంచి పేరు వచ్చింది. బాహుబలి లాంటి మూవీ ఓటిటి లో రిలీజ్ అయితే ఇంత పేరు వచ్చేది కాదు. ఓటిటీ వలన చిత్ర పరిశ్రమకు ఎంతో నష్టం జరుగుతుందని మేము నిర్మాతలందరినీ అక్టోబర్ వరకు మీ సినిమాలు ఓటిటి లో విడుదల చేయకుండా ఆగమని చెప్పాము. కానీ వాళ్ళు అక్టోబర్ వరకు ఆగకుండా “టక్ జగదీశ్” సినిమాను ఓటిటీ లో విడుదల చేస్తున్నారు. నిర్మాతలందరికీ మేము చేసే విజ్ఞప్తి ఏంటంటే మీ సినిమాలను ఓటిటి లో విడుదల చేయకుండా థియేటర్స్ లోనే విడుదల చెయ్యాలని విజ్ఞప్తి చేస్తున్నాము అన్నారు.

జెమినీ కిరణ్ మాట్లాడుతూ…థియేటర్స్ లో విడుదల అయిన రోజే ఓటిటి లో విడుదల చేస్తే థియేటర్ యజమానులు చాలా ఇబ్బందులు పడతాము. కాబట్టి మేము ఓటిటి లో విడుదల అయ్యే సినిమాలను అపలేము.అలాగే మేము ఓటిటి లో రిలీజ్ చేయద్దని చెప్పడం లేదు. కానీ థియేటర్స్ లలో  విడుదల అయ్యే సినిమాలకు పోటీగా, పండుగలకు, మరియు సేమ్ డేట్ కు  ఓటిటి లో విడుదల చేయకుండా డేట్స్ ను పోస్ట్ ఫోన్ చేసుకోమని రిక్వెస్ట్ చేస్తూ నిర్మాతలకు లెటర్స్ కూడా రాసాము అన్నారు.

విజయేందర్ రెడ్డి మాట్లాడుతూ.. నిర్మాత సునీల్ గారు సెప్టెంబర్ 10 న “లవ్ స్టొరీ” సినిమాతో థియేటర్స్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తుంటే .అదే రోజు “టక్ జగదీష్” సినిమాను ఓ టిటి లో రిలీజ్ చేస్తామని నిర్మాతలు తెలిపారు. దీన్ని మేము తీవ్రంగా కండిస్తున్నాము..సునీల్ గారు ఆ సినిమా నిర్మాతలతో సినిమా  డేట్ మార్చుకోమని చెప్పినా కూడా  వినకుండా మా సినిమాలకు పోటీ గా అదే రోజు ఓటిటి లో రేలీజ్ చేస్తున్నారు. అలాకాకుండా  కొంత గ్యాప్ తీసుకొని రిలీజ్ చెయ్యాలి. ఎగ్జిబిటర్స్ పరిస్థితి దారుణంగా వుంది.ఓ టి టి అనేది  సినీ పరిశ్రమ మనుగడకే సవాల్ గా మారుతుంది పరిస్థితులు ఇలా వుంటే చాలా థియేటర్స్ మూత పడతాయి అన్నారు.

ఎగ్జిబిటర్ రవి కుమార్ మాట్లాడుతూ…* నాని గారు ఒక ప్రెస్ మీట్ లో  ఇంతకు ముందు నేను” V” సినిమా చేసి చాలా ఇబ్బంది పడ్డాము. కాబట్టి ఇకముందు మేము మా సినిమాలను థియేటర్స్ లొనే విడుదల చేస్తామని చెప్పిన నాని ఈ నెల 10 న విడుదల చేస్తున్న “లవ్ స్టొరీ” సినిమాకు పోటీగా అదే తేదీన తన “టక్ జగదీష్” సినిమాను విడుదల చేస్తున్నారు.  సినిమాలో హీరో డైలాగ్స్ చెప్పిననాని బయట పిరికివాడిలా సినిమాను ఓటిటి లో విడుదల చేస్తున్నాడు. అలా కాకుండా తాను దైర్యంగా నిర్మాతల దగ్గరికెళ్లి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నాము అన్నారు.

ఇంకా ఈ కార్యక్రమంలో పలువురు సినీ ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్ పాల్గొని ఓటిటి వద్దు థియేటర్స్ ముద్దు అనే నినాదాలు చేశారు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here