కరాటెకు పూర్వ వైభవం రావాలి – హీరో విశ్వక్ సేన్

నేను చిన్నప్పుడు ఒక గ్రౌండ్ లో వందలమంది సేమ్ డ్రెస్ వేసుకుని కరాటే చేస్తుంటే చూసేందుకు చాలా ఆసక్తిగా, పండగల అనిపించేది, కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవు .. కానీ మళ్ళీ అలాంటి వైభవం కరాటేకు రావాలని కోరుకుంటున్నాను అన్నారు యంగ్ హీరో విశ్వక్ సేన్. పలక్ నామా దాస్, హిట్ సినిమాలతో టాలీవుడ్ లో హీరోగా మంచి క్రేజ్ తెచ్చుకున్న విశ్వక్ సేన్ ఈ ఆదివారం జరిగిన తెలంగాణ కరాటే అసోసియేషన్, షోట్కాన్ కరాటే అకాడమీ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో జరిగిన ఫెలిసిటేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. విశ్వక్ సేన్ తండ్రి నిర్మాత కరాటే రాజు కరాటే మాస్టర్ గా ఎంతో ప్రాముఖ్యత ఉన్న వ్యక్తి. అయన ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత సి కళ్యాణ్ తో పాటు హీరో విశ్వక్ సేన్ ఇతర కరాటే అసోసియేషన్ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా నిర్మాత , కరాటే మాస్టర్ కరాటే రాజు మాట్లాడుతూ .. కరాటే అంటే అది యోగాకు ఫాస్ట్ వెర్షన్ అని చెప్పాలి. యోగ ని స్పీడ్ గా చేస్తే అది కరాటే అవుతుంది. కరాటే అంటే నాకు దైవంతో సమానం. కరాటే అన్నది రహస్యంగా ఉండేది, కానీ దాన్ని పోటీలు పెట్టి జనాలకు తెలిసేలా చేసింది నేనే. అప్పట్లో కరాటే ఎంత వైభోగంతో ఉండేదో మళ్ళీ అలాంటి వైభోగం తేవడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. కరాటే నేటి పిల్లలకు చాలా అవసరం. ఇప్పుడు స్కూల్స్, కాలేజెస్ లో కూడా కరాటే అన్నదాన్ని అందరు నేర్చుకునేలా చూడాలి. మనల్ని మనం కాపాడుకునే ఆయుధం కరాటే. ఈ కరాటే అభివృద్ధి చేసే విషయంలో నేను ఎప్పుడు మీ ముందుంటాను అన్నారు.

విశ్వక్ నువ్వు కరాటే కు బ్రాండ్ అంబాసిడర్ కావాలి – ప్రముఖ నిర్మాత సి కళ్యాణ్

నిర్మాత సి కళ్యాణ్ మాట్లాడుతూ .. కరాటే రాజు నిర్మాతగానే నాకు తెలుసు కానీ అయన కరాటే లో మాస్టర్ అన్న విషయం ఈ మద్యే తెలిసింది. ఓ వైపు నిర్మాతగా సినిమాలు చేస్తూనే మరోవైపు కరాటే విద్యకు సపోర్ట్ చేస్తూ మంచి ప్రోత్సహం అందిస్తున్నారు. కరాటే అంటే అప్పట్లో హీరో సుమన్ ని హీరోగా తీసుకోవడానికి కారణం అయన కరాటే మాస్టర్. అప్పట్లోనే సుమన్ కరాటే విద్యలో రాణించారు. అందుకే అయన హీరోగా ఎదిగాడు. ఇప్పుడు అలాగే కరాటే విషయంలో మన హీరో విశ్వక్ సేన్ కూడా సపోర్ట్ అందించేందుకు తండ్రితో కలిసి ముందుకు వచ్చాడు. విశ్వక్ నువ్వు ఇప్పుడే హీరోగా రాణిస్తున్నావు, నువ్వు కూడా కరాటే నేపథ్యంలో ఓ సూపర్ యాక్షన్ సినిమా చేయి తప్పకుండా నీకు మంచి సక్సెస్ వస్తుంది, అలాగే కరాటే కు నువ్వు బ్రాండ్ అంబాసిడర్ గా మారాలి అన్నారు.

హీరో విశ్వక్ సేన్ మాట్లాడుతూ .. కరాటే అంటే నాకు చిన్నప్పటినుండి తెలుసు, మాకు అన్నం పెట్టింది కరాటే. అప్పట్లో మేము దిల్ సుఖ్ నగర్ లో ఉన్నప్పుడు నాన్న ఎంతగా దానికోసం కష్టపడ్డాడో తెలుసు. ఓ చిన్న ఇంట్లో ఉండేవాళ్ళం. ఆ కష్ఠాలు మాకు తెలుసు, అయితే నాన్న గురించి ఓ బాడ్ న్యూస్ ఉండేది .. అదేమిటంటే .. అయన మాస్టర్ గా చాలా కఠినంగా ఉంటాడని ప్రచారంఉంది . ఒక వ్యక్తిని కఠినంగా పరీక్షించాకే ఒక బెల్ట్ నుండి మరో బిల్డ్ కు ప్రోమోట్ చేస్తారని అంటుండేవారు. అయన హార్డ్ వర్క్ మమ్మల్ని ఇక్కడిదాకా తెచ్చింది. కరాటే ఇప్పుడు పూర్వ వైభవం కోల్పోయిందని నా అభిప్రాయం. ఎందుకంటే నా చిన్నప్పుడు ఒక గ్రౌండ్ లో వందలమంది సేమ్ డ్రెస్ వేసుకుని కరాటే చేస్తుంటే చూసేందుకు చాలా ఆసక్తిగా, పండగల అనిపించేది, కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవు .. కానీ మళ్ళీ అలాంటి వైభవం కరాటే కు రావాలని కోరుకుంటున్నాను. ఇక్కడున్న మాస్టర్స్ అందరు నాకు తెలుసు, నేను చిన్నప్పుడు వీరిని మామ మామ అంటూ తిరిగే వాణ్ణి, కరాటేకు మళ్ళీ పూర్వ వైభవం రావాలి. దానికోసం నేను మీకు ఎప్పుడు సపోర్ట్ గా ఉంటాను అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ అసోసియేషన్ అఫ్ ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కరాటే డో ( టాయ్ స్కిడ్ )అసోసియేషన్ కమిటీ సభ్యులు, కరాటే అసోసియేషన్ అఫ్ ఇండియా, షోట్కాన్ కరాటే అకాడమీ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో జరిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here