ప్రముఖ ఛాయాగ్రాహకుడు సురేంద్రరెడ్డి తనయులు హీరోగా, దర్శకునిగా ‘గల్లీ గ్యాంగ్’

నందమూరిబాలకృష్ణ హీరోగా నటించిన ‘అధినాయకుడు’, ‘శ్రీమన్నారాయణ’, డా. రాజేంద్ర ప్రసాద్ ‘ఆనలుగురు’, జగపతి బాబు ‘పెళ్ళైన కొత్తలో’ చిత్రాలతో పాటు ‘జై బోలో తెలంగాణ’, ‘గరం’,’10th క్లాస్’, ‘మైసమ్మ IPS’ మొదలైన 50 చిత్రాలకు ఛాయాగ్రహణంసమకూర్చారు.అలాగే హిందీ లో ‘రుద్రాక్ష్’,’టాంగో చార్లీ’, కన్నడంలో విష్ణువర్ధన్ హీరోగా ‘కుంతీ పుత్ర’చిత్రాలకు కూడా ఫోటోగ్రఫీ అందించారు.ఆయనకు ఇద్దరు కవల పిల్లలు వినయ్ తంబిరెడ్డి, సమీర్ దత్త.వీళ్లల్లో సమీర్ దత్త హీరోగా వినయ్ తంబిరెడ్డి దర్శకత్వం లో ఓ చిత్రం రూపొందింది.మూవీ బీస్ పతాకం పై నిర్మితమైన ఈ చిత్రం పేరు ‘గల్లీ గ్యాంగ్’.తనయులు రూపొందించిన ఈ చిత్రానికి తండ్రి సురేంద్రరెడ్డి పర్యవేక్షణ చేయడం విశేషం. 

దర్శకుడు వినయ్ తంబిరెడ్డి మాట్లాడుతూ –”ఇంజినీరింగ్ పూర్తయ్యాక చెన్నైలో మైండ్స్క్రీన్ ఫిలిమ్ ఇన్స్టిట్యూట్లో డైరెక్షన్ కోర్సుచేసాను. ఆ తరువాత ‘జెస్సీ’,’కృష్ణ అండ్హిజ్ లీల’,’రాధాకృష్ణ’ చిత్రాలకు దర్శకత్వంలో పనిచేసాను.తెలంగాణ యాసతో పల్లెటూరి చక్కటి ప్రేమకథగా కుమార్ మల్లారపు రాసిన స్క్రిప్ట్ ‘గల్లీ గ్యాంగ్’ తో దర్శకునిగా పరిచయం అవుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది.ఇందులో అందరూ కొత్త వాళ్లే నటించారు.కానీ ఒక ప్రత్యేక పాత్రను మాత్రం సీనియర్ హాస్యనటులైన జెన్నీతో చేయించాం.20 రోజుల పాటు గోదావరిఖని పరిసరప్రాంతాల్లో నటీనటుల్ని ఎంపిక చేసి,వాళ్లకు వర్క్ షాప్ నిర్వహించాం.తెలంగాణ సాంస్కృతిక సమితి రాష్ట్ర సమన్వయకర్త దయానరసింగ్ సహకారంతో రామగుండం,పెద్దంపేట్ గ్రామాల్లో 40 రోజుల పాటు షూటింగ్ చేశాం.సాంకేతిక నిపుణులు కూడా అంతా కొత్త వారే.అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాం’’అని తెలిపారు. 

హీరోగా నటించిన సమీర్ దత్త  మాట్లాడుతూ,,,”నేను ముంబై లోనూ,అలాగే రామానాయుడు ఫిల్మ్ స్కూల్ లోనూ యాక్టింగ్ కోర్స్ చేసాను.’రంగు’ సినిమాలో తొలిసారిగా బండి శీను పాత్ర చేశా.తెలుగు, కన్నడ భాషల్లో రూపొందిన ‘2 ఫ్రెండ్స్’ లో హీరోఫ్రెండ్ గా,’సూపర్ స్కెచ్’ లో ఒక విలన్ గా చేశా.ఇక ఈ ‘గల్లీ గ్యాంగ్’ హీరోగా నన్నుప్రేక్షకులకి దగ్గర చేస్తుందనే నమ్మకం ఉంది” అని చెప్పారు. 

ఈ చిత్రంలో సమీర్ దత్త,భూమిక,ప్రకాశరావు,మల్లికార్జున్ శ్రీరాములు,శ్రావణ్ కుమార్,బాలు బ్రహ్మ,దశరథ్,కూన మల్లేష్,సంతోష్ జక్కుల, ఫారూఖ్,లక్ష్మి కాంత్,దయా నర్సింగ్,భవాని,విజయ్ భాస్కర్,కుష్బు,ప్రణవి,సింధు,సుదీక్షఝా,అమ్ములు,శ్వేత,జెన్నీ తదితరులు నటించారు..

ఈ చిత్రానికి ఆర్ట్:హర్ష,కథ మాటలు:కమార్ మల్లారపు,యాక్షన్:ఆనంద్రాజ్,ఎడిటింగ్:శివ సర్వాణి,సినిమాటోగ్రఫీ:రాజేష్అవల,సంగీతం:కందికట్ల రామకృష్ణ,బ్యాక్ గ్రౌండ్ స్కోర్:కృష్ణ సాయి,ప్రవీణ్ ఇమ్మడి,ఎగ్జిక్యూటివ్ నిర్మాత:ముక్తేవి ప్రకాశరావు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here