రివ్యూ: గద్దలకొండ గణేష్

gaddalakondaganesh-review

నటీనటులు: వరుణ్ తేజ్, అధర్వ మురళి, పూజా హెగ్డే, మృణాళిని రవి తదితరులు

మ్యూజిక్: మిక్కీ జె మేయర్

సినిమాటోగ్రఫీ : అయినంక బోస్

నిర్మాతలు: రామ్ ఆచంట, గోపినాథ్ ఆచంట

దర్శకత్వం: హరీష్ శంకర్

ముకుంద, కంచె, అంతరిక్షం, ఫిదా, తొలిప్రేమ, ఎఫ్ 2 ఇలా వరసగా సాఫ్ట్ పాత్రలుండే సినిమాల్లో నటిస్తూ వస్తున్న వరుణ్ తేజ్ మొదటిసారిగా హరీష్ శంకర్ దర్శకత్వంలో పక్కా మాస్ ఎంటర్టైనర్ గద్దలకొండ గణేష్ సినిమాలో నటించారు. ఒక గ్యాంగ్ స్టర్ గా ఉండే వరుణ్ ఎలా మంచి వాడుగా మారాడు అన్నది కథ. కథ ప్రకారం మొదట వాల్మీకి అని టైటిల్ పెట్టినా కొన్ని కారణాల వలన సినిమా టైటిల్ మార్చాల్సి వచ్చింది. పవన్ కళ్యాణ్ కు గబ్బర్ సింగ్ వంటి బెస్ట్ హిట్ ఇచ్చిన హరీష్ శంకర్.. వరుణ్ తేజ్ తో చేసిన ఈ గద్దలకొండ గణేష్ ఏ మేరకు మెప్పించిందో తెలుసుకుందాం.

కథ:

అధర్వ మురళి ఓ దర్శకుడు. అందరిలా కాకుండా కొత్త సబ్జెక్టుతో సినిమా చేయాలని అనుకున్నాడు. ఫేడ్ ఔట్ అయిన గ్యాంగ్ స్టర్ తో కాకుండా ప్రస్తుతం దందాలో ఉన్న గ్యాంగ్ స్టర్ కథను బేస్ చేసుకొని సినిమా చేయాలని అనుకోని.. అలాంటి వ్యక్తిని వెతుక్కుంటూ వెళ్తాడు మురళి. మురళికి గద్దలకొండ గణేష్ కనిపిస్తాడు. గణేష్ తో పరిచయం పెంచుకొని అయన కథ తెలుసుకొని ఆ కథ ఆధారంగా సినిమా చేయాలని అనుకుంటే.. గద్దలకొండ గణేష్ మురళికి ట్విస్ట్ ఇచ్చి.. ఆ సినిమాలో తానే హీరోగా ఉంటానని చెప్పడంతో షాక్ అవుతాడు. గణేష్ నుంచి తప్పించుకోలేని పరిస్థితి.. సినిమా చేయకుండా వెళ్లలేని వైనం.. దీనిమధ్య మురళి గణేష్ తో సినిమా చేశాడా ? లేదా.? గ్యాంగ్ స్టర్ గణేష్ మంచివాడిగా ఎలా మారాడు..? పూజా హెగ్డే పాత్ర ఏంటి? అన్నది మిగతా కథ.

విశ్లేష‌ణ‌ :

హీరో ఎలివేషన్ కోసం ఒరిజినల్ వెర్షన్‌లో హరీష్ శంకర్ కొన్ని మార్పులు చేయడంతో అవి మూవీ సోల్‌ని దెబ్బతీశాయి. దీనితో క్లైమాక్స్‌ సోసోగా అనిపిస్తుంది. అటు వరుణ్ పాత్ర సినిమాలో వచ్చి వెళ్లే పాత్రలా అనిపిస్తుంది తప్ప.. సినిమాలో భాగంగా ఉండదు. హరీష్ శంకర్ చేసిన మార్పుల వల్ల పర్ఫెక్ట్ క్లాసిక్ స్టోరీ డిస్టర్బ్ అయిందని చెప్పవచ్చు. అంతేకాకుండా వరుణ్ తేజ్‌కి ఈ సినిమాలో ఒక్క పూర్తిస్థాయి యాక్షన్ ఎపిసోడ్ కూడా ఉండకపోవడం గమనార్హం. దీనితో పాటు ఫస్ట్ హాఫ్ కొంత స్లోగా నడుస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here