రివ్యూ: సైరా

syeraa-movie-review

నటీనటులు: చిరంజీవి, అమితాబ్‌ బచ్చన్‌, నయనతార, జగపతిబాబు, తమన్నా, సుదీప్‌, విజయ్‌ సేతుపతి, అనుష్క, రవికిషన్‌, నిహారిక, బ్రహ్మానందం, రఘుబాబు, బ్రహ్మాజీ తదితరులు
మ్యూజిక్: అమిత్‌ త్రివేది,
బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్: జూలియస్‌ ఫాఖియం
సినిమాటోగ్రఫీ: ఆర్‌.రత్నవేలు
ప్రొడక్షన్‌ డిజైన్‌: రాజీవన్‌
నిర్మాత: రామ్‌చరణ్‌
దర్శకత్వం: సురేందర్‌రెడ్డి

మెగా అభిమానులు మాత్రమే కాదు యావత్ భారతదేశ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ‘సైరా నరసింహా రెడ్డి’. సురేందర్ రెడ్డి డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని 285 కోట్ల భారీ బడ్జెట్‌తో మెగా పవర్ స్టార్ రాంచరణ్ నిర్మించాడు. అక్టోబర్ 2న తెలుగుతో పాటు తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో ఏకకాలంలో విడుదల అయింది. ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత చరిత్రతో ఈ చిత్రం రూపొందింది.
కథ:
అనగనగా రాయలసీమలోని రేనాడు ప్రాంతం.. ఈ ప్రాంతాన్ని 61మంది పాలెగాళ్ళు పరిపాలన చేస్తుంటారు. ఆ 61 ప్రాంతాలు కూడా చిన్న చిన్న సంస్థానాలుగా ఉన్నాయి. అయితే, వీరి మధ్య ఐక్యత లేదు. ఒకరంటే మరొకరికి పడదు. అప్పటి వరకు ఆ ప్రాంతంలోని పన్నులను నిజాం నవాబులు వసూళ్లు చేసేవారు. బ్రిటిష్.. నిజాం నవాబుల మధ్య జరిగిన ఒప్పందంతో.. అక్కడి పన్నులను వసూలు చేసుకునే హక్కును బ్రిటిష్ పాలకులకు అప్పగిస్తుంది. వర్షాలు లేక, పంటలు పండగ నానా ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోకుండా పన్నులు కట్టాలని బ్రిటిష్ పాలకులు ఒత్తిడి తీసుకొస్తారు. ప్రజలను హింసిస్తుంటారు. అలాంటి సమయంలోనే సైరా నరసింహారెడ్డి బ్రిటిష్ పాలకులపై పోరాటం చేసేందుకు సిద్ధం అవుతాడు. అయితే, 61 పాలెగాళ్ళ మధ్య సఖ్యత లేకపోవడంతో మొదట్లో ఇబ్బందులు పడతారు. అనంతరం 61 మంది పాలెగాళ్లను ఒకతాటిపైకి తీసుకొచ్చి బ్రిటిష్ పాలకులను ఎలా ఎదుర్కొన్నారు అన్నది చిత్ర కథ.
విశ్లేషణ:
ఆడియన్స్ కు ఓ పక్కా కమర్షియల్ సినిమాను అందించారు.సురేందర్ రెడ్డి మార్క్ టేకింగ్,టెక్నికల్ టీమ్ సపోర్ట్,నటీనటుల ప్రతిభ అన్నీ తోడై సక్సెస్ అయింది.మొదలయిన 30 నిమిషాల వరకు సోసో గా సాగినా.. ప్రీ ఇంటర్వెల్ ఎపిసోడ్ ఆకట్టుకునేలా ఉండటంతో ఫస్టాఫ్ బాగుందనిపిస్తుంది.అక్కడ లేచిన సినిమా పేస్ తర్వాత కూడా కంటిన్యూ అయింది.తన కోటపై దాడికి వచ్చిన బ్రిటీషర్లను ఎదుర్కునే ఎపిసోడ్,వార్ ఎపిసోడ్,క్లైమాక్స్ అన్నీ బాగా వర్కవుట్ అయ్యాయి.చివర్లో దేశం గురించి,స్వాతంత్ర్య పోరాటం గురించి చెప్పిన డైలాగులు చప్పట్లు కొట్టిస్తాయి.తద్వారా బయటకు వచ్చే ప్రేక్షకుడు సాటిస్ ఫై అవుతాడు.చరిత్ర మరిచిన ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి గొప్పదనం ఈ సినిమా ద్వారా తెలుస్తుంది.ఆ పాత్రలో మెప్పించిన చిరంజీవి అభినందనీయుడు. సెకండాఫ్ లో డైరెక్టర్ సురేందర్ రెడ్డి ప్రతిభ కనిపిస్తుంది.ఇంత పెద్ద ప్రాజెక్ట్ ను హ్యాండిల్ చేయడం లో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడనే చెప్పాలి.చిరంజీవి ఫ్యాన్స్ కు ఈ సినిమా పండగ లా ఉంటుంది.తమ హీరోను ఇలాంటి గొప్ప పాత్రలో చూడటం వాళ్లను సాటిస్ ఫై చేస్తుంది కాగా ఆడియన్స్ ను కూడా ఈ చిత్రం మెప్పిస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here