సోషల్ మీడియాలో దుమారం రేపుతున్న “ఉప్పెన” క్లైమాక్స్

మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ ను హీరోగా పరిచయం చేస్తూ కృతి శెట్టి హీరోయిన్ గా నవ దర్శకుడు సుకుమార్ అసిస్టెంట్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ పతాకాలపై డేరింగ్ ప్రొడ్యూసర్స్ నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం “ఉప్పెన” పై సోషల్ మీడియాలో సినిమా విడుదలకు ముందు నుండే క్లైమాక్స్ సన్నివేశం గురించి అనేక విమర్శలు చేస్తూ చిత్రంపై డిస్కర్షన్ జరుగుతున్న విషయం మన మందరికీ తెలిసిందే.సినిమా విదుడల తర్వాత.. కథ కూడా చాలా రొటీన్ గా ఉందని,సమాజాన్ని తప్పుదోవ పట్టించే విదంగా క్లైమాక్స్ ఉందని,సమాజానికి ఎం మెసేజ్ ఇవ్వడానికి ఈ సినిమా తీశారని సోషల్ మీడియాలో సినిమా క్లైమాక్స్ గురించి పెద్ద దుమారం రేపుతోంది.

పరువు హత్య కేసులు మనం ప్రతిరోజు వింటుంటాం అవి ఇప్పటికీ సమాజంలో జరుగుతూనే ఉన్నాయి.ఉదాహరణకు హైదరాబాద్ లోని యస్.ఆర్ నగర్, మిర్యాలగూడ లలోనే కాక అనేక చోట్ల పట్టపగలే అబ్బాయిలపై దాడి, జరిగిన సంఘటనలు ఇటీవల కాలంలో చాలా చోట్ల జరిగాయి. పరువు హత్యలపై చాలా సినిమాలు కూడా వచ్చాయి.అందులో ముఖ్యంగా మరాఠీ లో వచ్చిన “సైరత్’ కూడా అలాంటిదే ఆ సినిమా విడుదలై పెద్ద విజయం సాధించింది.ఆ సినిమాలో కూడా చివరకు ప్రేమను, ప్రేమికులను ఇద్దరినీ చంపేయడం జరుగుతుంది.సాధారణంగా గొప్పింటి అమ్మాయిలను ప్రేమించి పెళ్లి చేసుకున్న అబ్బాయిలను చంపేయడం చూస్తుంటాం కానీ..తాజాగా విడుదలైన “ఉప్పెన” చిత్రం కూడా అలాంటి కథతోనే రూపొందింది.

పరువు హత్య లాంటి కామన్ కథతోనే తెరకెక్కిన ఈ చిత్రంలో తమిళ్ హీరో విజయ్ సేతుపతి ఇందులో విలన్ గా నటించడం జరిగింది.చేపలు పట్టుకునే పెడవాడైన వైష్ణవి తేజ్ తక్కువ కులానికి చెందిన వాడిగా నటించాడు.హీరో వైష్ణవి తేజ్, విజయ్ సేతుపతి కూతురిని చిన్నప్పటి నుంచి ఆ అమ్మాయికి తెలియకుండా,చెప్పకుండా ప్రేమిస్తుంటాడు(వన్ సైడ్ లవ్). అయితే ఒక స్ట్రీట్ ఫైట్ లో జరిగిన సంఘటనలో.. హీరోయిన్ ,హీరో ను చూసి ప్రేమిస్తుంది.ఆ తర్వాత వారిద్దరూ ప్రేమించు కోవడం,హీరో, హీరోయిన్ లు ఒకరోజు రాత్రంతా సముద్రంలో గడపడం జరుగుతుంది.అలా చేసింది పేదింటి అబ్బాయి అని తెలుసుకొని తన కుటుంబంపై కక్షగట్టిన విజయ్ సేతుపతి చివర్లో హీరో మర్మంగాలు కట్ చేయిస్తాడు.ఇది చూసిన తన తండ్రి షాక్ కు గురై చనిపోతాడు.

జనరల్ గా ఏ సినిమాలో అయినా హీరో, హీరోయిన్లు గాని హీరోని గాని చంపేయడం జరుగుతుంది.కానీ ఈ మధ్య వస్తున్న అన్ని సినిమాలు అదే రొటీన్ కథలతో వస్తున్నాయని వాటికి భిన్నంగా వున్నపుడే చిత్రానికి మంచి బజ్ తో పాటు చిత్రం గురించి చర్చించుకుంటారని కేవలం హీరో మర్మాంగాలు కట్ చేయడమే మాత్రమే కొత్తగా చూపించారు. అయితే దీనిపై అనేక మంది,అనేక రకాలుగా సోషల్ మీడియాలో సినిమా విడుదల కాక ముందునుండే అందరూ అనుకున్నట్టుగానే ఈ సినిమా క్లైమాక్స్ లో హీరోయిన్ తండ్రి హీరో మర్మంగాలు కట్ చేస్తారు అనే ప్రచారం సోషల్ మీడియాలో కథనాలు వచ్చాయి,అందరూ అనుకున్నట్లే ఇప్పుడు అదే నిజమైంది.అలాగే ఇందులో విచిత్రమేమిటంటే
తనకు శరీరం తో సంబంధం లేదు, ఆ సుఖం తో సంబంధం లేదు, ప్రేమ.. మనిషి.. ముఖ్యం నాకు తనతోనే ఉండిపోతాను నాకు నీ ప్రేమ చాలు అనే హీరోయిన్ చెప్పే డైలాగులు ఆశ్చర్యానికి గురిచేస్తాయి. క్లైమాక్స్ కూడా కొత్తగా డీఫ్రెంట్ ఉందనే ప్రశంసలు కూడా వస్తున్నాయి.

అదే విదంగా హీరోయిన్ సినిమాటిక్ గా చాలా గొప్పగా చెప్పినా.. వాస్తవంగా సమాజంలో ఇది ఎంతవరకు సాధ్యం అనేది కొత్త చర్చ నడుస్తుంది. భార్య, భర్తలు ఇద్దరూ ప్రేమ,మనసు అంటూ జీవితాంతం వుండగలుగుతారా.. అమ్మాయికి ప్రేమ, మనసు ఉంటే సరిపోతుందా.. అంతకు మించి ఆ సుఖం అవసరం లేదా.. ఆన్న ప్రశ్నలు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ సమాజంలో ఇది సాధ్యం కాదనే వాదన వినిపిస్తుంది. అదే సమయంలో దర్శకుడు బుచ్చి బాబు క్లైమాక్స్ సన్నివేశంతో సమాజాన్ని పెడదారి పట్టించేదిగా ఉందనే విమర్శలు వస్తున్నాయి. సమాజంలో ఒక డబ్బున్న అమ్మాయిని ప్రేమించిన ప్రేమికుడిని ఇప్పటివరకు చంపుతూనే వస్తున్నారు ఇకపై ఉప్పెన సినిమాలో చూపించినట్టు ఇకపై అందరూ అదే పని చేసే అవకాశాలు ఉన్నాయని, ఇలా కూడా చేయవచ్చా అనే విదంగా సమాజానికి తప్పుడు సమాచారం అందించినట్లుగా ఈ సినిమా ఉందని కొందరు విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

మరి దీనిపై దర్శక,నిర్మాతలు ఎలా స్పందిస్తారో అనేది చూడాలి కానీ.. చిత్రయూనిట్ మాత్రం ఈ సినిమా పెద్ద విజయం సాధించిందని భావిస్తూ… తొలి చిత్రంతోనే దర్శకుడిగా మరి పెద్ద విజయం సాదించావని సుకుమార్ గారు తన శిష్యుడైన బుచ్చి బాబును అప్రిసియేట్ చేస్తూ.. గురువును మించిన శిష్యుడని పించావు అని ప్రశంశించడమే కాక తను కూడా క్రాకర్స్ వెలిగించి చిత్ర యూనిట్ తో పాటు సంబరాలు  చేసుకోవడం గమనార్హం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here