Message Oriented Action, Thrillar ‘Maro Prasthanam’ Movie Review

సినిమారంగం.. రివ్యూ రేటింగ్ : 3.25/5
విడుదల తేదీ : 24.09.2021
సినిమా  : మరో ప్రస్థానం
నటీనటులు : తనీష్ ,ముస్కాన్ సేథీ. వరుడు ఫేమ్ భానుశ్రీ మెహ్రా, కబీర్ దుహాన్ సింగ్, రాజా రవీంద్ర తదితరులు
సమర్పణ : ఉదయ్ కిరణ్
బ్యానర్ : హిమాలయ స్టూడియో మాన్షన్స్
నిర్మాత : మిర్త్ మీడియా
కథ-స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం: జానీ
కెమెరా మాన్ : యమ్. యన్.బాల్  రెడ్డి
మ్యూజిక్  : సునీల్ కశ్యప్
ఎడిటర్ : క్రాంతి (ఆర్.కె)
*ఫైట్స్ : శివ ప్రేమ్
పి.ఆర్.ఓ : రమేష్

ఇప్పుడు ట్రెండ్ మారింది కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలకు ఆదరణ పెరిగింది. కథ బావుంటే చాలు ప్రేక్షకులు బ్రహ్మ రథం పడుతున్నారు.దీంతో పెద్ద హీరోలు సైతం ఇలాంటి సినిమాలు చేయడానికి ముందుకు వస్తున్నారు.అలాంటి కోవలో తనీష్  సోషల్ కాజ్ ఉన్న డీఫ్రెంట్ కాన్సెప్ట్  చిత్రాలను సెలెక్ట్ చేసుకొని నటిస్తున్నాడు . హీరోగా రాణిస్తూ తెలుగు ప్రేక్ష‌కుల‌కు సుప‌రిచితుడైన  త‌నీశ్  తను నటించిన గత చిత్రం “రంగు” సినిమాలో లోక‌ల్ గ్యాంగ్‌స్ట‌ర్‌గా న‌టించి మెప్పించాడు.  ఇప్పుడు తనీశ్ రొటీన్‌కు భిన్నమైన ఎమోషన్ కిల్లర్  పాత్రలో నటిస్తూ తెరకెక్కిన సింగిల్‌షాట్ మూవీ “మ‌రో ప్ర‌స్థానం”. టాలెంటెడ్ డైరెక్టర్ జాని దర్శకత్వం వహించారు. ముస్కాన్ సేధి కథానాయిక కాగా, వరుడు ఫేమ్ భానుశ్రీ మెహ్రా కీలక పాత్ర పోషించింది. హిమాలయ స్టూడియో మాన్షన్స్ ఉదయ్ కిరణ్ సమర్పణలో మిర్త్ మీడియా సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది.ఈ సినిమా ఫస్ట్ లుక్ నుంచి ట్రైలర్స్ చూసిన ఆడియన్స్ ఇదేదో కొత్త తరహా చిత్రం అనే  ఆసక్తి ఏర్పడింది. సోషల్ కాజ్ తో మంచి కాన్సెప్ట్ తో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన “మరో ప్ర‌స్థానం” చిత్రం సెప్టెంబర్ 24 న ప్రపంచ వ్యాప్తంగా  ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఏమాత్రం ఎంటర్ టైన్ చేసిందో చూద్దాం పదండి.

కథ
హైద‌రాబాద్‌కు ముప్పై కిలోమీట‌ర్ల దూరంలోని భ‌వంతిలో లో వుండే పెద్ద మాఫియా గ్యాంగ్ లో శివ(తనీష్) పనిచేస్తుంటాడు .అలాగే అక్కడి గ్యాంగ్ డబ్బులు ఇస్తే చాలు.. క్రైమ్ ఏదైనా సరే క్షణాల్లో చేసేస్తారు. ఆ మాఫియా గ్యాంగ్‌కు లీడ‌ర్ నారాయణ్ రావ్ రాణే(క‌బీర్ దుహాన్ సింగ్‌). పొలిటిక‌ల్ లీడ‌ర్స్ స‌పోర్ట్ ఉండ‌టంతో అత‌న్ని ఎవ‌రూ ఏమీ చేయ‌లేరు. ఇక పోతే తన జీవితం పట్ల బాధ్యత లేకుండా ప్రవర్తించే శివకు( తనీష్)ఓ రోజు నైని (అర్చనా ఖన్నా) కనిపిస్తుంది.  తొలిచూపులోనే ప్రేమలోపడతాడు. ఆతర్వాత నైని కూడా శివను ప్రేమిస్తుంది. ఎప్పుడైతే ప్రేమలో పడ్డాడో అప్పటి నుంచి జీవితం పట్ల ఆసక్తి ఏర్పడుతుంది. తన పాత జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టి.. కొత్త జీవితం ప్రారంభించాలి అనుకుంటాడు. అయితే తను ఊహించని విధంగా  ఎంతగానో ప్రేమించిన నైనిని కోల్పోతాడు. తను ఏ క్రైమ్ బ్యాచ్ లో ఉన్నాడో ఆ బ్యాచ్ వాళ్లే నైనిని చంపేసారని తెలిసి పగ తీర్చుకోవాలి అనుకుంటాడు.ఆ బ్యాచ్ చేసే నేరాలను ఆధారాలతో సహా బయట ప్రపంచానికి చూపించాలి అనుకుంటాడు. ఓ సీక్రెట్ కెమెరాతో అంతా షూట్ చేస్తుంటాడు.అలాగే ఓ జర్నలిస్ట్ (భానుశ్రీ మెహ్రా) కూడా ఆ క్రైమ్ బ్యాచ్ కోసం ఓ రిపోర్ట్ రెడీ చేస్తుంది. ఈ విషయం తెలుసుకున్న రాణె భాయ్ ఆమెను కిడ్నాప్ చేస్తాడు. ఆమెను శివ కాపాడే ప్రయత్నం చేస్తాడు. అస‌లు శివ అలా చేయ‌డానికి కార‌ణ‌మేంటి? రాణేకు ఎంతో న‌మ్మ‌కంగా ఉండే శివ ప్ర‌వ‌ర్త‌న‌లో మార్పుకు కార‌ణ‌మేంటి? శివ ప‌నిచేసే గ్యాంగులో ఉండే మ‌రో అమ్మాయి యువిద‌తో పాటు శివ జీవితంలో కీల‌క‌మైన మార్పుకు కార‌ణ‌మైన మ‌రో అమ్మాయి నైనాలకు, క‌థ‌కు సంబంధ‌మేంటి? అనే విష‌యాల‌ను తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే..

నటీనటుల పనితీరు
తనీష్ మాఫియా డాన్‌లో కీల‌క స‌భ్యుడిగా, మెయిన్ విల‌న్ రాణే కు రైట్ హ్యాండ్ పాత్ర‌లో హీరో తనీశ్ చ‌క్క‌గా న‌టించాడు. ఇప్పటి వరకు తను చేసిన సినిమాలు ఒక ఎత్తు అయితే. ఈ సినిమా మరో ఎత్తు. . ఒక ప‌క్క ఎమోష‌న‌ల్ కోణాన్ని ఎలివేట్ చేస్తూనే విల‌న్స్ భ‌ర‌తం ప‌ట్ట‌డానికి ఎలాంటి ప‌నులు చేశాడ‌నే మ‌రో కోణాన్ని యాక్ట‌ర్‌గా చ‌క్క‌గా ఎలివేట్ చేశాడు. సినిమాలో కొంత ఎమోష‌న‌ల్ పార్ట్ ఉన్నా.. ఎక్కువ భాగం యాక్ష‌న్‌కే చుట్టూనే ర‌న్ అవుతుంది. . ఇక ముస్కాన్ సేథి , భాను శ్రీ  పాత్రలు పర్వాలేదు అనిపించాయి. ఇక రాణే పాత్ర‌లో క‌బీర్ త‌న‌దైన స్టైల్లో విల‌నిజాన్ని చూపించే ప్ర‌య‌త్నం చేశాడు. సింగిల్ షాట్ మూవీ కాబ‌ట్టి న‌టీన‌టులు త‌మ త‌మ పాత్ర‌ల‌ను ప‌రిధి మేర‌కు చ‌క్క‌గా ఎలివేట్ చేసే ప్ర‌య‌త్నం చేశారు.

సాంకేతిక నిపుణుల పనితీరు
డైరెక్ట‌ర్ జానీ రొటీన్ కు భిన్నంగా యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ త‌ర‌హాలో “మ‌రో ప్ర‌స్థానం”ను తెర‌కెక్కించాడు. ఓ రాత్రిలో జ‌రిగే క‌థ‌ను సింగిల్ షాట్‌లో చిత్రీక‌రించాల‌నుకున్న ఆలోచ‌న బావుంది. అందుకు త‌గ్గ‌ట్లు స‌న్నివేశాల‌ను ప్లాన్ చేసుకుని సినిమాను చాలా చక్కగా చిత్రీక‌రిస్తూ వ‌చ్చారు. సునీల్ క‌శ్య‌ప్  పాట‌లు  నేప‌థ్య సంగీతం బాగుంది. ఇక సింగిల్ షాట్‌లో సినిమాను చిత్రీక‌రించ‌డంలో డైరెక్ట‌ర్ జానీకి  సినిమా టోగ్రాఫ‌ర్ ఎం.ఎన్‌.బాల్ రెడ్డి చక్క‌గానే స‌పోర్ట్ చేశాడు. సింగిల్‌షాట్‌లో తెర‌కెక్కించిన రొటీన్ రివేంజ్ డ్రామా.. ఈ సినిమా చూస్తున్నంత సేపు ఇది ఎక్కడో జరుగుతుంటే మనం సీక్రెట్ గా చూస్తున్నామనే ఫీలింగ్ కలిగించారు. ఇదే ఈ సినిమా ప్రత్యేకత అని చెప్పచ్చు. ఈ చిత్ర నిర్మాతలు  ఖర్చుకు వెనకాడకుండా తీసిన నిర్మాణ విలువలు చాలా గ్రాండియర్ గా ఉంది. టోటల్ గా మరో ప్రస్థానం గురించి ఒక్కమాటలో చెప్పాలంటే.. మెసేజ్ ఓరియంట్ తో  సినిమాను చాలా చక్కగా తెరకెక్కించాడు దర్శకుడు జానీ .లవ్, సెంటిమెంట్ , యాక్షన్ తో పాటు మంచి సందేశం తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన  “మరో ప్రస్థానం” చిత్రం ఎక్కడా బోరింగ్ లేకుండా అందరూ ఫ్యామిలీతో  పాటు కలసి చూడవలసిన ఈ సినిమా ఇది. కొత్త కథలు… యాక్షన్ మూవీస్ ఇష్టపడేవారికి ఈ సినిమా తప్పక నచ్చుతుంది.

       Cinemaarangam.com…Rating 3.25/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here