Tru Based Suspens Thrillar ‘Asalem Jarigindi?’ Movie Review

సినిమారంగం.కామ్
రివ్యూ రేటింగ్ 3/5
రిలీజ్ డేట్ : అక్టోబర్  22న
సమర్పణ : స్మైలీ చౌదరి
బ్యానర్ : ‘ఎక్సోడస్ మీడియా’
సినిమా : “అసలేం జరిగింది ?”
నిర్మాతలు : మైనేని నీలిమా చౌదరి, కింగ్ జాన్సన్ కొయ్యడ,
దర్శకత్వం, డి.ఓ.పి  : NVR
నటీనటులు : శ్రీరామ్ , సంచిత పదుకొనె తదితరులు
సంగీతం :ఎలెందర్ మహావీర్
పి.ఆర్.ఓ : మడూరి మధు

‘ఒక‌రికి ఒక‌రు’ సినిమా ద్వారా మంచి పేరు సంపాదించు కున్న హీరో శ్రీ‌రామ్ చాలా కాలం తర్వాత హీరోగా  మళ్లీ తెలుగులో డైరెక్ట్ మూవీ చేశారు.ఆయన సరసన  కన్నడ బ్యూటీ సంచితా ప‌దుకొనే హీరోయిన్‌గా శ్రీరామ్‌కు జోడిగా తొలిసారి స్క్రీన్ షేర్ చేసుకుంది. ఇంత‌కు ముందు సినిమాటోగ్రాఫ‌ర్‌ గా చేసిన ఎన్‌వీఆర్ ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా మైనేని నీలిమా చౌద‌రి, కొయ్యాడ కింగ్ జాన్స‌న్ క‌లిసి  ప‌తాకంపై నిర్మించారు. గ్రామీణ నేప‌థ్యంతో య‌ధార్థ సంఘ‌ట‌న‌ల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్, ల‌వ్‌ స్టోరీగా ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌నుంది. ఇందులో ప్రేమ‌, స‌స్పెన్స్, యాక్ష‌న్.. అన్నీ రంగ‌రించి ఉన్న సినిమా ‘అసలేం జరిగింది’ ఈ సినిమా అక్టోబర్  22న థియేటర్లలో విడుదలైన విషయం తెలిసిందే. మరి ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఏమాత్రం ఎంటర్ టైన్ చేసిందో రివ్యూ లో చూద్దాం పదండి.

కథ
హీరో శ్రీరామ్ తన జీవితంలో ఎదురైన ఇబ్బందులను ఎలా ఎదుర్కొన్నాడు.. తన ఊర్లో ఏదో జరుగుతుందని పెద్ద రూమర్ నడుస్తుంది. వరుసగా జనాలు చనిపోతుంటారు. ప్రతీ అమావాస్య నాడు ఏదో తెలియని శక్తి గ్రామాన్ని ఆవరిస్తుందని, అందరూ నాశనం అవుతారని అతీత శక్తుల గురించి తెలిసిన ఓ వ్యక్తి గ్రామస్తులను హెచ్చరిస్తాడు. దీంతో గ్రామస్తులు అంతా ఊరు వదిలి వెళ్లేందుకు సిద్ధపడుతారు. హీరో మాత్రం సమస్య మూలాలు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంటాడు. ఈ క్రమంలోనే అమావాస్య రోజున తాంత్రిక శక్తులతో విలన్ ఎంట్రీ ఇచ్చి.. హీరోయిన్ పై కన్నేస్తాడు. నిన్ను వదిలేది లేదని మెడలో చున్నీ వేసి లాక్కెళ్లడానికి యత్నిస్తాడు… ఆ తర్వాత ఏం జరిగింది.. హీరో హీరోయిన్, ఊరిని అతీత శక్తుల నుంచి రక్షిస్తాడా..? లేదా అనేది సినిమా చూడాల్సిందే..

నటీనటుల పనితీరు
హీరో శ్రీరామ్ నటన, యాక్షన్ సన్నివేశాలు బాగున్నాయి.
చాలా కాలం తర్వాత ఇందులో ఓ మంచి పాత్రను పోషించి.. హైలైట్ గా నిలిచాడు. అతనికి జంటగా నటించిన కన్నడ బ్యూటీ సంచిత పదుకొనె గ్రామీణ అమ్మాయిగా చక్కగా నటించింది. తాంత్రికునిగా మెయిన్ విలన్ పాత్ర పోషించిన వ్యక్తి బాగా నటించి ఆకట్టు కుంటాడు.మిగిలిన నటీనటులు తమ పరిధిమేర బాగా నటించారు.

సాంకేతిక నిపుణుల పనితీరు
రియల్ ఇన్సిడెంట్ బేస్ తో తెరకెక్కిన కథలు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. ప్రేక్షకులు కూడా వీటిని బాగా ఆదరిస్తారు. అందుకే దర్శకుడు NVR ఇలాంటి ఇంట్రెస్టింగ్ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ కథకు… ప్రేమను జోడించి ఆద్యంతం ఆడియన్స్ ని ఆకట్టుకునేలా “అసలేం జరిగింది”..చిత్రాన్ని తెరకెక్కించాడు.
ఈ సినిమాను గత ఆరేళ్ల నుంచి ప్రొడక్షన్ కంపెనీలో ఉన్న ‘ఎక్సోడస్ మీడియా’ తొలిసారిగా నిర్మించింది. టెక్నికల్ పరంగా ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, 5.1, స్పెషల్ ఎఫెక్ట్స్ వంటి వాటిలో పేరుగాంచిన నిపుణులను ఉపయోగించారు.తన డెబ్యూ కోసం రియల్ స్టోరీని ఎంచుకొని దర్శకుడు మంచి స్టెప్ తీసుకున్నాడు. మూవీ ఎక్కడా బోరింగ్ లేకుండా తెరకెక్కించాడు. సినిమాటో గ్రఫీ రిచ్ గా ఉంది. విజువల్స్ బాగున్నాయి. ఆర్ట్ డైరెక్టర్ గ్రామీణ వాతావరణాన్ని బాగా తీర్చి దిద్దారు. దీన్ని సినిమాటోగ్రాఫర్ బాగా చూపించారు. సినిమాకు ప్రధాన హైలైట్ నేపథ్య సంగీతం. కొన్ని సన్నివేశాలను బాగా బీజీఎమ్ తో లేపారు. కింగ్ జాన్సన్ కొయ్యడ, మైనేని నీలిమా చౌదరిలు కలిసి చేసిన ఈ సినిమాను ఖర్చుకు వెనకాడకుండా నిర్మాణంలో ఎక్కడా రాజీపడలేదని ఈ సినిమా చూసిన వారు ఎవరైనా చెబుతారు. మొత్తంగా “అసలేం జరిగింది” సినిమా చూసిన  ప్రేక్షకులందరికీ తప్పక నచ్చుతుంది.

             Cinemarangam.com Rating 3/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here