Tollywood First Interrogative Thriller “The Trial” Movie Review

Cinemarangam.Com
సినిమా : “ద ట్రయల్ ”
విడుదల తేదీ : నవంబర్ 24, 2023
రివ్యూ రేటింగ్ : 3 /5
బ్యానర్స్ : ఎస్ఎస్ ఫిల్మ్స్, కామన్ మేన్ ప్రొడక్షన్స్
నిర్మాతలు : స్మృతి సాగి, శ్రీనివాస్ కే నాయుడు
సహనిర్మాతలు : సుదర్శన్ రెడ్డి, కంచరన జయలక్ష్మి
దర్శకత్వం : రామ్ గన్ని
నటీ నటులు : స్పందన పల్లి, యుగ్ రామ్, వంశీ కోటు తదితరులు
డివోపి : సాయికుమార్ దార
సంగీతం ‘ శరవణ వాసుదేవన్
ఎడిటర్ : శ్రీకాంత్ పట్నాయక్ ఆర్
పిఆర్వో : జిఎస్కే మీడియా


డిప్యూటీ జైలర్ గా తన పదేళ్ల కెరీర్ లో ఎన్నో క్రైమ్ ఇన్సిడెంట్స్ గురించి, ఆ క్రైమ్స్ చేసి ఖైదీలుగా ఉన్న వారి కథలను విన్న దర్శకుడు రామ్ గన్ని వారి కథలను ఇన్సిపిరేషన్ గా తీసుకొని చేసిన టాలీవుడ్ ఫస్ట్ ఇంటరాగేటివ్ థ్రిల్లర్ సినిమా “ది ట్రయల్” స్పందన పల్లి, యుగ్ రామ్, వంశీ కోటు లీడ్ రోల్స్ లో నటించిన ఈ సినిమాను ఎస్ఎస్ ఫిలింస్, కామన్ మ్యాన్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించాయి. స్మృతి సాగి, శ్రీనివాస నాయుడు కిల్లాడ నిర్మించారు. సుదర్శన్ రెడ్డి కో ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. “ది ట్రయల్” చిత్రాన్ని టాలీవుడ్ ఫస్ట్ ఇంటరాగేటివ్ ఫిల్మ్ గా రూపొందించారు దర్శకుడు రామ్ గన్ని. ఈ సినిమా ఈ నెల 24న థియేటర్స్ ద్వారా గ్రాండ్ గా విడుదలైన “ది ట్రయల్” సినిమా ఎలా ఉందో రివ్యూ లో చూద్దాం పదండి.. 


కథ:
ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అయిన అజయ్(యుగ్ రామ్), పోలీస్ డిపార్ట్ మెంట్ లో ఎస్.ఐ.గా పనిచేస్తున్న రూప (స్పందన పల్లి) లది పెద్దలు కుదిర్చిన పెళ్లి . పెళ్లి తరువాత ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ దంపతుల మధ్య ఓ డైరీ విషయంలో మనస్పర్థలు వస్తాయి. వీరిద్దరూ మొదటి పెళ్లి రోజును గ్రాండ్ గా సెలబ్రేషన్ చేసుకుంటారు..అజయ్ ఒక సర్ ప్రైజ్ ఉంది రూపను కళ్లు మూసుకోమని చెబుతాడు. రూప కళ్లు తెరిచే లోగా అజయ్ అనుమానాస్పద స్థితిలో బిల్డింగ్ మీద నుంచి కిందపడి చనిపోతాడు.దాంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని… అజయ్ భార్య రూపను ఇంటారాగేషన్ చేయడం మొదలు పెడతారు? అతనిది హత్యా, ఆత్మహత్యా? అజయ్ ఎలా చనిపోయారు? ఎందుకు చనిపోయారు? రూప, అజయ్ ల మధ్య మనస్పర్థలు రావడానికి కారణమైన ఆ డైరీలో ఏముంది ? ఈ డైరీ ద్వారా జరుగుతున్న కేసు దర్యాప్తుకు ఎంత వరకూ ఉపయోగపడింది? ఇందులో ఇంటాగాగేషన్ అధికారిగా వ్యవహరించిన రాజీవ్(వంశీ)కి, రూపకి ఉన్న కనెక్షన్ ఏంటి? అనే విషయాలు తెలుసుకోవాలి అంటే కచ్చితంగా ‘ది ట్రయల్’ సినిమాని థియేటర్ కెళ్ళి చూడాల్సిందే…


నటీ నటులపనితీరు
పోలీసు అధికారిగా రూప పాత్రలో నటించిన స్పందన పల్లి తన పాత్రకు కరెక్ట్ గా సూట్ అయింది. ఓ పోలీసు అధికారి విచారణ ఎదుర్కొవాల్సి వస్తే… ఆ ఆధికారి ఇంట్రాగేషన్ అధికారులు అడిగే ప్రశ్నలకు ఎంత కాన్ఫిడెంట్ గా సమాధానాలు ఇవ్వచ్చనే దాన్ని మహిళా ఎస్.ఐ.రూప పాత్రలో చాలా తెలివిగా చూపించారు. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ పాత్రలో వంశీ కోటు చాలా సీరియస్ గా నటించారు. క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ కు బాగా యాప్ట్ అయ్యారు. అమాయకమైన సాప్ట్ వేర్ ఇంజినీర్ పాత్రలో యుగ్ రామ్ మెప్పించారు. మిగిలిన పాత్రల్లో నటించిన వారంతా తమ తమ పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు..


సాంకేతిక నిపుణుల పనితీరు
జైళ్ళ శాఖలో డిప్యూటీ జైలర్ గా పనిచేసిన నూతన దర్శకుడు రామ్ గన్ని తన అనుభవవాన్నంతా రంగరించి తెలుగులో ఫస్ట్ ఇంటరా గేషన్ కథను తెరకెక్కించాడు. తనకిది మొదటి సినిమా అయినా.. రాసుకున్న స్టోరీ సింపుల్ గా ఉన్నా స్క్రీన్ ప్లే ఇంట్రెస్టింగ్ గా వుంది.భార్య భర్తల మధ్య ఉన్న చిన్న మనస్పర్దకి… దాని చుట్టూ అల్లుకున్న స్క్రీన్ ప్లే తో సుమారు గంటన్నరపాటు కేవలం ఇంటరాగేషన్ మీద కథను చాలా గ్రిప్పింగ్ గా నడిపిస్తూ చూస్తున్న ప్రేక్షకులకు ఎక్కడా బోర్ కొట్టకుండా కథలో లీనమై పోయేలా చేస్తూ.. మధ్య మధ్యలో వచ్చే ఆసక్తికరమైన ట్విస్ట్ లు ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని పెంచుతాయి. గతంలో మనం చూసిన అడివి శేష్ నటించిన ఎవరు, హాలీవుడ్ చిత్రాలైన సేవ్ ది క్యాట్, అకిరా కురసోవా లాంటి స్క్రీన్ ప్లే ప్యాట్రన్ తో ఈ సినిమా ముందుకు సాగుతుంది ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకూ ట్విస్టులతో కూడిన స్క్రీన్ ప్లే ఆడియన్స ని కుర్చీలో నుంచి కదలకుండా చేసేలా చేసిన దర్శకుడు పనితీరు మెచ్చుకోవచ్చు. శరవణ వాసుదేవన్ అందించిన నేపథ్య సంగీతం సినిమాకు ప్రాణం పోశాడు. సినిమాటోగ్రఫర్ సాయికుమార్ పనితీరు వుంది. శ్రీకాంత్ పట్నాయక్ ఎడిటింగ్ చాలా క్రిస్పీగా.. ఆడియన్స్ కి ఎక్కడా బోర్ కొట్టకుండా గ్రిప్పింగ్ గా వుంది.ఎస్ఎస్ ఫిల్మ్స్, కామన్ మేన్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మాతలు స్మృతి సాగి, శ్రీనివాస్ కే నాయుడులు సంయుక్తంగా కలసి ఎక్కడా రాజీపడకుండా సినిమాని చాలా రిచ్ గా తెరకెక్కించారు. మధ్య మధ్యలో వచ్చే ప్రతీ ట్విస్టు ఆడియన్స్ ని ఎంగేజ్ చేస్తుంది. కొత్త కంటెంట్, థ్రిల్లర్, సస్పెన్స్, ఇంటరాగేషన్ జోనర్స్ ఇష్టపడే వారికి మాత్రం ‘ది ట్రయల్’ సినిమా తప్పకుండా నచ్చుతుందని కచ్చితంగా చెప్పవచ్చు.

Cinemarangam.Com Review Rating 3/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here