‘1980’s Radhe Krishna’ Movie Review

Cinemarangam.Com
బ్యానర్ : ఎస్ వి క్రియేషన్స్
సినిమా : ‘1980లో రాధేకృష్ణ’
రివ్యూ రేటింగ్ : 3.25/5
విడుదల తేదీ : 18.10.2024
నిర్మాత : వూడుగు సుధాకర్
దర్శకత్వం : ఇస్మాయిల్ షేక్
నటీనటులు : ఎస్‌ఎస్ సైదులు, భ్రమరాంబిక, అర్పిత లోహి తదితరులు
డిఓపి : ఇలియాజ్ పాషా
మ్యూజిక్ : ఎంఎల్ రాజా
రైటర్ : రాజేష్ మాచర్ల
డైలాగ్స్ : ఎం. రాజేష్, చరణ్, ఖమ్మం బాబు, జ్ఞానేశ్వర్, వై ఉపేందర్
తెలుగు లిరిక్స్ : ఎంఎల్ రాజా
బంజారా లిరిక్స్ : ఎం. శ్రీనివాస్ చౌహన్
డిజిటల్ మీడియా : డిజిటల్ దుకాణం
పిఆర్ఓ : మధు VR

ఎస్‌వీ క్రియేషన్స్ బ్యానర్‌పై ఊడుగు సుధాకర్ నిర్మాతగా ఇస్మాయిల్ షేక్ దర్శకత్వంలో ఎస్‌ఎస్ సైదులు హీరోగా భ్రమరాంబిక, అర్పిత లోహి హీరోయిన్లుగా ఎం. ఎల్. రాజా సంగీత దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘1980లో రాధేకృష్ణ’. ఈ సినిమాని తెలుగు, బంజారా భాషల్లో నేడు విడుదల చేశారు. ఈ సినిమాకి సంబంధించిన టీజర్, ట్రైలర్, సాంగ్స్ ఇప్పటికే ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో రివ్యూ లో చూద్దాం పదండి

కథ:
ఈ సినిమా 1980లో గ్రామీణ నేపథ్యంలో సాగుతుంది. కృష్ణ(ఎస్‌ఎస్ సైదులు), వంశీ ఇద్దరు మంచి స్నేహితులు. వంశీ ఎక్కువ కులం, కృష్ణ తక్కువ కులం అయినా వాళ్ల మధ్య ఆ భావన లేకుండా కాలేజీలో మంచి మిత్రులుగా ఉంటారు. వంశీ పెద్దనాన్న రాఘవయ్య ఆ ఊరికి సర్పంచ్. ఆయనకు కులపిచ్చి బాగా ఎక్కువ. ఆయన కుమార్తె రాధ(భ్రమరాంబిక) వంశీ చదివే కాలేజీలో జాయిన్ అవుతుంది. అక్కడ కృష్ణతో రాధ ప్రేమలో పడుతుంది. అక్కడి నుంచి అసలు కథ మొదలవుతుంది. రాధ-కృష్ణ ప్రేమ ఫలించిందా? లేదా ఆ ఊళ్లో కుల వివక్ష వాళ్ల ప్రేమను బలితీసుకుందా? ప్రేమ కథ మధ్యలో మావోయిస్టులు ఏం చేశారు? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

నటీ నటుల పనితీరు
హీరోగా నటించిన ఎస్ఎస్ సైదులు తన చక్కటి అభినయంతో ఆకట్టుకున్నాడు. అమాయకుడిగా, ప్రేమికుడిగా, పోరాట యోధుడిగా అన్ని వేరియషన్స్ పలికించాడు. హీరో ఫ్రెండ్‌గా వంశీ పాత్ర పోషించిన అతను కూడా ది బెస్ట్ పర్ఫ్మార్మెన్స్ ఇచ్చాడు. ఇక హీరోయిన్లు భ్రమరాంబిక, అర్పిత లోహి కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు. భ్రమరాంబిక పాత్ర నిడివి ఎక్కువ ఉండడంతో ఆమెకు తన నటనను ప్రదర్శించే ఆస్కారం ఎక్కువ ఉంది. తన నటన, అందంతో భ్రమరాంబిక ఆకట్టుకుంది. మిగిలిన పాత్రధారులు కూడా తమ పాత్రల పరిధి మేరకు చాలా చక్కగా నటించారు.

సాంకేతిక నిపుణుల పనితీరు
గ్రామాల్లో కులాల మధ్య ఉన్న విభేదాల వల్ల ప్రేమికులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు. అలాగే ప్రతి మనిషిలో ఉన్న కుల పిచ్చిని నిర్మూలించడానికి ఎలాంటి మార్పు తీసుకురావాలి అనే అంశం నేపథ్యంలో డైరెక్టర్ షేక్ ఇస్మాయిల్ రాసుకున్న కథను తెరపై చాలా చక్కగా తెరకెక్కించాడు. కృష్ణలంక అనే గ్రామంలో డిగ్రీలు చదివిన యువకులే సమాజంలో జరుగుతున్న అన్యాయాలు, అరాచకాలను ఎదుర్కొనేందుకు మావోయిస్టులుగా మారడాన్ని చూపించారు. వాళ్ల ఉద్దేశం మంచిదే కానీ వాళ్లు ఎంచుకున్న మార్గం సరైనది కాదనేలా చెబుతూ దర్శకుడు తన స్క్రీన్‌ప్లేతో ప్రేక్షకులను ఆలోచింపజేస్తాడు. హీరో కృష్ణ తన నాన్న భావాలను ఆదర్శంగా తీసుకుని కులాల నిర్మూలనకు ఏ విధంగా పాటు పడ్డాడు అనేది చాలా చక్కగా చూపించారు.గతంలో కూడా గ్రామీణ నేపథ్యంలో వచ్చిన చాలా సినిమాలు మంచి హిట్ అందుకున్నాయి. ఆ కోవలోనే ఈ చిత్రం కూడా అందమైన ప్రేమకథను తెలియజేస్తూనే.. అంతర్లీనంగా కుల వివక్ష నిర్మూలన గురించి, పరువు హత్యల నిర్ములన గురించి మంచి సందేశం ఇస్తుంది.

ఫస్ట్ హాఫ్ అంతా ప్రేమకథతో సాఫీగా సాగిపోతుంది. ఇక సెకెండాఫ్ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఒకవైపు అడవిలో అన్నలు.. మరోవైపు వాళ్లను వెంటాడే పోలీసులు. వీరిద్దరి మధ్యలో స్వచ్ఛమైన ప్రేమను కాపాడుకోవడం కోసం ప్రేమికుల పోరాటం. మొత్తంగా ఈ సినిమా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచుతుందని చెప్పొచ్చు. సాంకేతికంగా ఈ సినిమా చాలా బాగుంది. దర్శకుడు షేక్ ఇస్మాయిల్ తను ఎంచుకున్న పాయింట్‌ను ఏ మాత్రం తడబాటు లేకుండా చెప్పడంలో సక్సెస్ అయ్యాడు. ఎం. రాజేష్, చరణ్, ఖమ్మం బాబు, జ్ఞానేశ్వర్, వై ఉపేందర్ అనే కుర్రాళ్లు రాసిన డైలాగ్స్ సినిమాను మరో మెట్టు ఎక్కించాయి. మానవతాన్ని మించిన కులం ఏముంటుంది? అనే డైలాగ్ ఆలోచింపజేసేలా ఉంది. ఎంఎల్ రాజా ఇచ్చిన సంగీతం కూడా కథకు చాలా హెల్ప్ అయింది. తనే లిరిక్స్ రాసి ట్యూన్ కట్టడం వల్ల పాటలు అన్నీ చక్కగా కుదిరాయి. తూరుపు రవికిరణం సాంగ్ ఎమోషనల్‌గా ఉంది.ఇలియాజ్ పాషా సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ఎడిటింగ్ పనితీరు బాగుంది. ఎస్‌వీ క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మాత ఊడుగు సుధాకర్ ఖర్చుకు వెనుకాడకుండా నిర్మించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. ఫ్యామిలీ ఎమోషన్స్, లవ్, యాక్షన్, మంచి మ్యూజిక్ వంటి అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ తో తీసిన 1980లో రాధేకృష్ణ’ సినిమా చూసిన వారందరికీ ‘కచ్చితంగా నచ్చుతుంది.

Cinemarangam.Com  Review Rating 3.25/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here