4000 film workers have been vaccinated so far under the auspices of the CCC (CoronaCrisisCharity)

కరోనా క్రైసిస్ ఛారిటిని మొదలెట్టి గత ఏడాది కరోనా సమయంలో సినిమా కార్మికులకు నిత్యావసర వస్తువులు పంపిణి చేసిన విషయం తెలిసిందే. ఈ సారి కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ఇప్పుడు సినిమా కార్మికులకు వాక్సిన్ వేయించే కార్యక్రమం ఇటీవలే చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయంలో ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో 24 క్రాఫ్ట్స్ కు సంబందించిన సినీ కార్మికులకు వాక్సిన్ ఇస్తున్నారు. గత వారం రోజులుగా ఈ వాక్సిన్ డ్రైవ్ సక్సెస్ ఫుల్ గా నడుస్తుంది.

ఈ సందర్భంగా డైరెక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎన్ శంకర్ మాట్లాడుతూ..కరోనా క్రైసిస్ చారిటి ఆధ్వర్యంలో సినిమా వర్కర్స్ 24 క్రాఫ్ట్స్ వారికీ ఉచిత వాక్సినేషన్ డ్రైవ్ కార్యక్రమం చిరంజీవి గారి చేతుల మీదుగా ఇటీవలే ప్రారంభమైన సంగతి తెలిసిందే. అప్పటినుండి ఈ కార్యక్రమం విజయవంతంగా సాగుతుంది. ఇప్పటివరకు 4000 మందికి పైగా వాక్సిన్ తీసుకున్నారు. సినిమా కార్మికులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అలాగే ఫెడరేషన్ సభ్యులు, సినీ పాత్రికేయుులకు కూడా వాక్సిన్ ఇస్తున్నాం. అలాగే, మిగతా సినిమా రంగానికి సంబందం ఉన్న అందరూ దయచేసి వాక్సిన్ తీసుకోవడనికి ముందుకు రావాలి. అప్పుడే షూటింగ్స్ తొందరగా స్టార్ట్ అవుతాయి, కాబట్టి అందరూ ముందుకు రండి…వాక్సిన్ తీసుకుని ఈ కార్యక్రమాన్ని మరింత విజయవంతం చేస్తారని కోరుకుంటున్నాం, అలాగే ఈ కార్యక్రమం నిర్వహణకు సహకరించిన ప్రతి ఒక్కరికీ నా ధన్యవాదాలు అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here