Leading Producer, Senior Cine Journalist, PRO, BA Raju Passed away

ప్రముఖ సినీ పాత్రికేయుడు, నిర్మాత, సూపర్ హిట్ ఫిలిం పత్రిక, ఇండస్ట్రీహిట్.కామ్ అధినేత బి ఏ రాజు ఈ రోజు 21- 05- 2021 శుక్రవారం రాత్రి 07:56 గంటలకు హైదరాబాద్ కేర్ హాస్పిటల్ లో గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన వయస్సు 61 సంవత్సరాలు. ఆయనకు ఇద్దరు కుమారులు అరుణ్ కుమార్, శివ కుమార్ ఉన్నారు. ఆయన సతీమణి ప్రముఖ రచయిత్రి, జర్నలిస్టు,కాలమిస్ట్ , దర్శకురాలు కలిదిండి జయ రెండు సంవత్సరాల క్రితం మరణించారు. కాగా బి ఏ రాజు మరణం పట్ల తెలుగు చలనచిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది.

సూపర్ స్టార్ కృష్ణ వద్ద పబ్లిసిటీ వ్యవహారాలు చూసే పి ఆర్ ఓ గా సినీ జీవితాన్ని ప్రారంభించిన బి. ఏ. రాజు ఆ తరువాత ఆయన ప్రోద్బలంతోనే ఫిల్మ్ జర్నలిస్ట్ గా మారారు. ఆంధ్రజ్యోతి, జ్యోతి చిత్ర, ఉదయం, శివరంజని వంటి దినవార పత్రికలలో సినీ పాత్రికేయుడుగా వివిధ హోదాలలో పని చేసిన పిమ్మట 1994లో తన భార్య జయ.బి (కలిదిండి జయ) సహచర్యంతో సూపర్ హిట్ పత్రికను ప్రారంభించి ఫిలిం జర్నలిజంలో ఎన్నో సంచలనాలు సృష్టించారు బి ఏ రాజు. కేవలం జర్నలిస్ట్ గానే కాకుండా ఎందరెందరో అగ్రశ్రేణి సినీ నిర్మాతలకు, దర్శకులకు, హీరోలకు, హీరోయిన్స్ కు, సాంకేతిక నిపుణులకు పి.ఆర్. ఓ.గా పని చేశారు బి.ఏ.రాజు. అలాగే వెయ్యి చిత్రాలకు పైగా పబ్లిసిటీ ఇన్చార్జిగా పనిచేసిన బి.ఏ. రాజు ఆయా సినిమాల విజయంలో కీలక పాత్ర పోషించేవారు. చిత్ర పరిశ్రమలో పెద్దా చిన్నా ప్రతి ఒక్కరితో ఆత్మీయ అనుబంధాన్ని ఏర్పరుచుకున్న రాజు నిర్మాతగా మారి తన సతీమణి జయ.బి దర్శకత్వంలో ప్రేమలో పావని కళ్యాణి, చంటిగాడు, ప్రేమికులు, గుండమ్మగారి మనవడు, సవాల్, లవ్లీ, వైశాఖం వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించారు. అరుణ్ కుమార్, శివ కుమార్ అనే ఇద్దరు కుమారులు వున్నారు. ఇద్దరు సినీ రంగం లో పని చేస్తున్నవారే. అరుణ్ కుమార్ హాలీవుడ్ చిత్రాలకు సంబందించిన వి ఎఫ్ ఎక్స్ నిపుణుడు, శివ కుమార్ పూరి జగన్నాధ్, వి వి వినాయక్, మారుతీ, వంటి ప్రముఖ దర్శకుల వద్ద దర్శకత్వ శాఖలో అనుభవం గడించి ’22’ అనే చిత్రంతో దర్శకుడయ్యాడు. ఆ చిత్రం కరోనా కారణంగా విడుదల ఆగింది.

చిత్ర పరిశ్రమలోని ప్రముఖులందరితోనూ అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నప్పటికీ సూపర్ స్టార్ కృష్ణ ,యంగ్ సూపర్ స్టార్ మహేష్ బాబు లతో బి ఏ రాజుకు సొంత కుటుంబ సభ్యుని వంటి అనుబంధం ఉంది.”కృష్ణ గారి సినిమాలకు పని చేశాను, ప్రస్తుతం మహేష్ సినిమాలకు వర్క్ చేస్తున్నాను,రేపు గౌతమ్ కృష్ణ హీరోగా చేసే సినిమాలకు కూడా నేనే పి ఆర్ ఓ గా చేస్తాను” అని అంటుండేవారు బి.ఏ.రాజు. ఇక సినీ పాత్రికేయ కుటుంబంలో బి ఏ రాజు కు గొప్ప స్థాన విశిష్టత ఉంది. సినీ పాత్రికేయులు ఎవరికి ఏ కష్టం వచ్చినా నేనున్నాను అంటూ ఆర్థిక హార్దిక సహాయ సహకారాలు అందించే బి.ఏ.రాజు ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. తన నాలుగు దశాబ్దాల పాత్రికేయ ప్రస్థానంలో చిత్ర పరిశ్రమ మొత్తం అత్యంత ఆప్తుడిగా భావించే స్థాయికి బి ఏ రాజు ఎదిగారు .సినిమాల జయాపజయాల విషయంలో రాజు అంచనాలు విశ్లేషణ చాలా కచ్చితంగా ఉంటాయి అనే నమ్మకం పరిశ్రమ వర్గాల్లో ఉంది. అలాగే ఏ సినిమాను ఎప్పుడు ఏ దర్శకుడు ఏ హీరోతో నిర్మించాడు… ఆ బ్యానర్ ఏమిటి… రిలీజ్ డేట్ ఏమిటి… అది ఏ ఏ సెంటర్స్ లో ఎన్ని రోజులు ఆడింది – వంటి సమస్త వివరాలను,విశేషాలను ఫింగర్ టిప్స్ మీద చెప్పగలిగిన సినీ పరిజ్ఞానం బి.ఏ రాజు సొంతం.

సినిమాకు సంబంధించిన ప్రతి వేడుకలో ప్రారంభోత్సవంలో శతదినోత్సవాలలో బి ఏ రాజు ప్రెజెన్స్ తప్పనిసరిగా ఉంటుంది. తను కనిపించలేదు అంటే సినీ ప్రముఖులందరూ రాజు ఎక్కడ… రాజు ఎక్కడ.. అని పదే పదే అడగటం చిత్ర పరిశ్రమలో బి ఏ రాజు సంపాదించుకున్న గుర్తింపుకు, గౌరవానికి నిదర్శనం అని చెప్పుకోవచ్చు. ఇలా చిత్ర పరిశ్రమలో ప్రతి ఒక్కరితో అత్యంత సన్నిహిత సంబంధాలను కొనసాగించిన బి ఏ రాజు అనూహ్య మరణ వార్త చిత్ర పరిశ్రమకు నిజంగా ఒక దిగ్భ్రాంతికర వార్తే అవుతుంది.

కాగా బి.ఏ.రాజు మరణం పట్ల సినీ ప్రముఖులు అందరూ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ,కుటుంబ సభ్యులకు సానుభూతిని ప్రకటిస్తూ వాట్సాప్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ , పేస్ బుక్ మొదలగు సోషల్ మీడియా మాద్యమాలలో ఆయన ఆత్మ శాంతిని కోరుకుంటూ పంపుతున్న సంతాప సందేశాలు వెల్లువెత్తుతున్నాయి.

సినిమాటోగ్రఫీ, పశుసంవర్ధక శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్… ప్రముఖ చలనచిత్ర నిర్మాత, సీనియర్ జర్నలిస్ట్ BA. రాజు అకాల మృతి పట్ల  తన ప్రగాఢ సంతాపం తెలిపారు. రాజు కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేశారు….

– పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణ మూర్తి…ప్రముఖ పాత్రికేయులు బి ఏ రాజు హఠాన్మరణం నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది.1980వ దశకం లో మద్రాస్ లో నాకు బి ఏ రాజు గారు పరిచయం. హిరో కృష్ణ గారికి వీరాభిమానిగా, పాత్రికేయుడిగా, సిని పబ్లిసిటీ ఇంఛార్జిగా, సూపర్ హిట్ వార పత్రిక అధినేతగా, అన్నింటికీ మించి సిని పరిశ్రమ తలలోని నాలుక లా అందరి అప్తుడుగా, సిని నిర్మాతగా అయన చేసిన సేవలు అమోఘం. బి ఏ రాజు గారి మరణం సిని పరిశ్రమ కు ముఖ్యంగా పాత్రికేయ రంగానికి తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను…

నందమూరి బాలకృష్ణ…బి ఎ రాజు గారుతో నాకు ఎప్పటినుంచో మంచి అనుభందం ఉంది. ఈరోజు ఆయన మనమధ్య లేరనే వార్త నన్నెంతో కలిచివేసింది. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతున్ని ప్రార్ధిస్తున్నాను. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.

# Hero Prabhas…Shocked by the sudden demise of senior journalist and PRO #BARaju garu, who was nothing short of a family member to me. I worked with him on many films through my career and will forever cherish the experience. This is a huge loss to TFI. My prayers are with the family.-

– Producer AM Ratnam  We have longest association with BA Raju garu. He never used to complain about anything and used to solve issues with a smile on his face. He was a positive person and it is a great loss for all of us. Condolences to his family members. #RIPBARaju Garu..  

– బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్‌…బి.ఎ.రాజుతో మూడున్న‌ర ద‌శాబ్దాల‌కు పైగా అనుబంధం.. ఆయ‌న హ‌ఠాన్మ‌ర‌ణంతో షాక‌య్యాను. 1984లో స‌రిగ్గా ఇలాంటి రోజుల్లో నేను సూప‌ర్ స్టార్‌ కృష్ణ‌గారితో సినిమా చేయాల‌నుకున్నాను. అదే సంద‌ర్భంలో .. మే 31న కృష్ణ‌గారి పుట్టిన‌రోజు.. కాబ‌ట్టి కృష్ణ‌గారి స్టిల్స్ కావాల‌ని అనుకున్న‌ప్పుడు దివంగ‌త సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ ప‌సుపులేటి రామారావుగారు న‌న్ను బి.ఎ.రాజుకి ప‌రిచ‌యం చేశారు. మృదు స్వ‌భావి. ఎవ‌రినీ నొప్పించ‌కుండా, చిరునువ్వుతో అంద‌రినీ ప‌ల‌క‌రించే మ‌న‌స్త‌త్వం ఆయ‌న‌కు న‌న్ను మ‌రింత ద‌గ్గ‌ర చేసింది. అప్ప‌టి నుంచి మూడున్న‌ర దశాబ్దాల‌కు పైగా బి.ఎ.రాజుతో అనుబంధం కొన‌సాగింది. నేను నిర్మాత‌గా చేసిన ఎన్నో సినిమాల‌కు ఆయ‌న పి.ఆర్‌.ఓ వ‌ర్క్ చేశారు. మనలో ఒకడిగా కలిసిపోయే మంచి గుణమున్న వ్యక్తి. అలాంటి బి.ఎ.రాజు ఉన్న‌ట్లుండి హ‌ఠాన్మ‌ర‌ణం చెందార‌ని తెలిసి షాక‌య్యాను. సినీ పరిశ్ర‌మ‌, ముఖ్యంగా పాత్రికేయ కుటుంబం ఓ పెద్ద దిక్కును కోల్పోయింది. బి.ఎ.రాజు ఆత్మ‌కు ప్ర‌శాంత‌త చేకూర్చాల‌ని భ‌గ‌వంతుడ్ని ప్రార్థిస్తున్నాను. ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కు నా ప్ర‌గాఢ సానుభూతిని వ్య‌క్తం చేస్తున్నాను.

– Samantha Akkineni..He has been such a positive light in my life .. right from my first film .. every film that has released since then ..hit or flop .. he has always had a kind word to say . I will miss you terribly #RipBaRajuGaru A terrible loss 🙏🙏🙏

Producer..GA2 Pictures Bunny vasu… Extremely saddened & shocked to hear about the sudden demise of senior PRO & journalist ‘Ba Raju’ garu. May his soul rest in peace. condolences to his family members.

Producer Naga vamsi. S, Sithara Entertainments.. I am still unable to process the news. He genuinely loved cinema & was passionate about everything regarding films. It is a great loss for film fraternity & personally for us too. May your family gain strength to recover from this loss. #RIPBaRaju garu 🙏 – 

– దర్శకుడు ప్రవీణ్ సత్తారు… బీఏ రాజుతో తనకు ఉన్న అనుబంధాన్ని ప్రవీణ్ సత్తారు గుర్తు చేసుకుంటూ “బీఏ రాజుగారు ఓ ఫిల్మ్ డిక్షనరీ. చిత్ర పరిశ్రమకు ఎన్నో ఏళ్లుగా సేవలు అందించారు. ఆయనతో నేను మాట్లాడింది తక్కువే. కానీ, మాట్లాడిన ప్రతిసారీ ఓ మంచి అనుభూతి. ఎప్పుడూ నవ్వుతూ ఉండేవారు. చాలా పాజిటివ్ పర్సన్. మారుతున్న కాలానికి అనుగుణంగా తనకు తాను అప్‌డేట్ అవుతూ వచ్చారు. ప్రస్తుతం నాగార్జునగారు కథానాయకుడిగా నేను దర్శకత్వం వహిస్తున్న సినిమాకు ఆయన పీఆర్వో. పీఆర్వోను మించిన వ్యక్తి బీఏ రాజుగారు. సినిమాకు ఎంతో కాంట్రిబ్యూట్ చేశారు. ఎన్నో ఏళ్ల క్రితం విడుదలైన సినిమాల గురించి అవలీలగా చెప్పగలరు. తెలుగు సినిమా హైదరాబాద్ సిటీకి వచ్చినప్పటి నుంచి, అంతకు ముందు మద్రాసులో ఉన్నప్పుడు ఆయన సేవలు అందించారు. మనం నడిచే ఓ సినిమా లైబ్రరీ, డిక్షనరీని కోల్పోయాం. బీఏ రాజు మరణం సినీ జర్నలిజానికి, చిత్ర పరిశ్రమకు లోటు” అని చెప్పారు.

Actor Prakasharaj.. Ahh .. No… this is devastating…too sudden…Raju Garu….. your love n support to the film fraternity will be missed .. thank you for always being there for everyone.. may his family have the strength to bear this pain.. will miss you #RIP…

Our heart feels heavy to know B A Raju garu’s sudden demise. Our heartfelt condolences to his family & friends.May your soul rest in peace🙏🏻. Lagadapati Sridhar…Ramalakshmi Cine Creations

– Producer Ramtalluri SRT Entertainments.. BA Raju garu – U r my first PRO for my production house, not only mine many of the famous banners are promoted by ur hands – We need ur guidance, we need ur smile, RIP Baraju garu..

– Producer S.Radhakrishna (Chinababu) Haarika & Hassine creations..Movies were like life to him. In his magazines and articles, it would always reflect. He always wished good things for all filmmakers and movie industry workers. He is a Legend among PRs and his contribution will be remembered forever 🙏 #RipBaRajuGaru...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here