New ‘The Ten Commandments’ Movie World Wide releasing on Dec 31 in the New Year

ప్ర‌పంచ సినిమా చ‌రిత్ర లో   ‘ది టెన్ కమాండ్మెంట్స్’ ది ఒక ప్ర‌త్యేక స్థానం. ఓల్డ్ టెస్టెమెంట్ లోని మోషే చేసిన అద్భుతం ని తెర‌మీద కు తెచ్చిన ‘ది టెన్ కమాండ్మెంట్స్’ ఒక విజువ‌ల్ వండ‌ర్. ఎర్ర స‌ముద్రం ని రెండుగా చీల్చిన మోషే క‌థ ఇప్ప‌టికీ క‌న్నుల‌ముందు ఒక అద్భుతంగా క‌నిపిస్తుంది. దేవుని పై న‌మ్మ‌కం ఉంచి మోషే చేసిన ఈ అద్భుతం ఇప్పుడు మరో సారి వెండిత‌ర మీద నూత‌న సంవ‌త్స‌ర కానుక‌గా రాబోతుంది.

Escaping death, a Hebrew infant is raised in a royal household to become a prince. Upon discovery of his true heritage, Moses embarks on a personal quest to reclaim his destiny as the leader and liberator of the Hebrew people.

1956లో సెసిల్ బి డెమిల్లే (అమెరికన్ సినిమా వ్యవస్థాపక పితామహుడిగా, చలనచిత్ర చరిత్రలో అత్యంత  విజయ వంతమైన నిర్మాత/దర్శకుడిగా నిలిచిన వ్యక్తి) 220 నిమిషాల నిడివితో “ది టెన్ కమాండ్‌మెంట్స్” చిత్రాన్ని (పారామౌంట్ పిక్చర్స్) ప్రపంచ సినీ ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు.
భారతదేశంలో, ఈ చిత్రం ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, హైదరాబాద్, బెంగళూరు మరియు చెన్నై (క్యాసినో) వంటి మెట్రో నగరాలలో 50 వారాలకు పైగా ప్రదర్శితమైంది. 65 సంవత్సరాల తర్వాత ఆ అద్భుతమైన చిత్రాన్ని రీమేక్ చేశారు. ఇందులో డౌగ్రే స్కాట్ (మిషన్ ఇంపాజిబుల్ 2 & బాట్‌వుమన్ 2022 ఫేమ్) మోసెస్‌ పాత్రలో నటించారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం 2021, డిసెంబర్ 31న నూత‌న సంవ‌త్స‌ర కానుకగా పాన్ ఇండియా స్థాయిలో (ఇంగ్లీష్, తమిళం & తెలుగులో) మరియు ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. ఈ చిత్రంలో మోసెస్‌గా డౌగ్రే స్కాట్, ఆరోన్‌గా లినస్ రోచ్, మెనెరిత్‌గా నవీన్ ఆండ్రూస్, జిప్పోరాగా మియా మాస్ట్రో, రామ్‌సెస్‌గా పాల్ రైస్, అనందర్‌గా రిచర్డ్ ఓబ్రెయిన్, జెరెడ్‌గా సిలాస్ కార్సన్, యువరాణి బిథియాగా పద్మా లక్ష్మి, మిరియమ్‌గా సుసాన్ లించ్, రాణిగా క్లైరే బ్లూమ్, ఇంకా జెత్రోగా ఒమర్ షరీఫ్ నటించారు.

రాబర్ట్ డోర్న్‌హెల్మ్ మరియు జెఫ్రీ మడేజా దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి జేసన్ కామియోలో, రాండీ ఎడెల్‌మాన్ సంగీతం, ఎడ్వర్డ్ జె పేయ్ సినిమాటోగ్రఫీ అందించారు. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 31వ తేదీన ప్రపంచమంతటా ఈ చిత్రం బ్రహ్మాండమైన స్థాయిలో విడుదల కాబోతుంది.

Escaping death, a Hebrew infant is raised in a royal household to become a prince. Upon discovery of his true heritage, Moses embarks on a personal quest to reclaim his destiny as the leader and liberator of the Hebrew people.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here