High Voltage Action Drama ‘Bheemla Nayak’ Movie Review

Cinemarangam.com
Review Rating..3 5/5
సమర్పణ: పి.డి.వి. ప్రసాద్
బ్యానర్ :  సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌
సినిమా :  ‘భీమ్లానాయక్‌’
నిర్మాత: సూర్యదేవర నాగవంశీ
దర్శకత్వం: సాగర్ కె చంద్ర
సంభాషణలుస్క్రీన్ ప్లే: త్రివిక్రమ్
నటీనటులు : పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి ,నిత్య మీనన్, సంయుక్త మీనన్ నాయికలు. ప్రముఖ నటులు, సునీల్, రావు రమేష్, మురళీశర్మ, సముద్ర ఖని, రఘుబాబు,నర్రా శ్రీను , కాదంబరికిరణ్, చిట్టి, రామకృష్ణ, పమ్మి సాయి తదితరులు
ఛాయాగ్రాహకుడు : రవి కె చంద్రన్ ISC
సంగీతం : తమన్.ఎస్
ఎడిటర్ : నవీన్ నూలి
ఆర్ట్ : ఏ.ఎస్.ప్రకాష్
వి.ఎఫ్.ఎక్స్. సూపర్ వైజర్: యుగంధర్ టి
పి.ఆర్.ఓ: లక్షీవేణుగోపాల్

ఒరిజినల్ సినిమాలతో పవన్ కల్యాణ్ సినిమాలను కంపేర్ చేస్తే, కాస్త భిన్నంగా ఉంటాయి. ‘దబాంగ్’ను ‘గబ్బర్ సింగ్’గా రీమేక్ చేసినా… ‘పింక్’ను ‘వకీల్ సాబ్’గా రీమేక్ చేసినా… తాజాగా మలయాళ హిట్ ‘అయ్యప్పనుమ్ కోశియుమ్’కు రీమేక్ చేసి తెలుగులో భీమ్లా నాయక్’ గా విడుదల చేశారు. పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌, రానా దగ్గుబాటిల కాంబినేషన్‌లో ప్రఖ్యాత నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ నిర్మించారు. ఈ చిత్రంలో ’ నిత్యా మీనన్‌, సంయుక్తమీనన్‌ కథానాయికలు. మాటల మాంత్రికుడు ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్‌ సంభాషణలు, స్ర్కీన్‌ప్లే అందించారు .సాగర్‌ కె.చంద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి తమన్‌ స్వరకర్త. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్‌, ట్రైలర్లు సినిమాపై రెట్టింపు అంచనాలను పెంచాయి. ఈ నెల 25 ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన “భీమ్లా నాయక్” ప్రేక్షకులను ఏమాత్రం ఏంటర్టైన్ చేసిందో రివ్యూ లో చూద్దాం పదండి.

కథ..
భీమ్లా నాయక్ (పవన్ కల్యాణ్) ఓ నిజాయితీ గల పోలీస్ అధికారి. సబ్‌ ఇన్‌ స్పెక్టర్‌ గా విధులు నిర్వర్తిస్తుంటాడు. ఓ రాత్రి చెక్ పోస్ట్ దగ్గర డ్యూటీ చేస్తుండగా… మిలిటరీ నుంచి రిటైర్ అయిన డానియల్ శేఖర్ (రానా దగ్గుబాటి) ప్రయాణిస్తున్న కారును చెక్ పోస్ట్ దగ్గర తనిఖీ చేయగా కారులో ఉన్న లిక్కర్ బాటిల్స్ కనిపిస్తాయి. ఇదేమని అడిగిన పోలీసులపై డ్యానీ చేయి చేసుకోవడంతో భీమ్లా నాయక్ వచ్చి డ్యానీని కొట్టి అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తీసుకు వచ్చి తనదగ్గర దొరికిన లిక్కర్ బాటిల్స్ ను సీజ్ చేస్తాడు. పోలీస్ స్టేషన్ లో తననెవరూ ఏమీ చేయలేరంటూ తనకు తిరులేని విధంగా ప్రవరిస్తూ ఉండడంతో డ్యానీ పై FIR నమోదు చేస్తాడు భీమ్లా.డ్యానీ ఒక యం.పీ కొడుకని తెలిసిన తరువాత పై అధికారుల ప్రెజర్ వల్ల  కొన్ని పరిస్థితుల ప్రభావం వల్ల పోలీస్ స్టేషన్‌లో డ్యానీ చెప్పిన మాటలు నమ్మిన భీమ్లా నాయక్ తను సీజ్ చేసిన లిక్కర్ బాటిల్ ఓపెన్ చేసి… డానీకి మందు పోస్తాడు.దీన్ని ఆసరాగా తీసుకుని నాయక్ మందు పోస్తుండగా డానీ ఫోనులో షూట్ చేస్తాడు. డ్యానీ పై FIR నమోదు అయినందున డ్యానీని జైలుకు పంపుతాడు. దీంతో డానియెల్ ఈగో దెబ్బ తింటుంది. తాను బెయిల్‌ పై వచ్చాక నీ అంతు చూస్తానని నాయక్‌ కు వార్నింగ్‌ ఇస్తాడు.బెయిల్ పై బయటికి రాగానే సీజ్ చేసిన లిక్కర్ బాటిల్ ఓపెన్ చేసి… డానీకి మందు పొసే వీడియోను మీడియాకు విడుదల చేస్తాడు. ఓ సబ్ ఇన్‌స్పెక్టర్‌ అలా చేయడం చట్ట వ్యతిరేకం కనుక… రాష్ట్రపతి పురస్కారానికి ఎంపికైన భీమ్లా నాయక్ సస్పెండ్ అవుతాడు. అలా వారిద్దరి మధ్య వైరం నెలకొంటుంది. డ్యానీ తండ్రి అతని ద్వేషానికి ఆజ్యం పోస్తూ ఉంటాడు. ఈ క్రమంలో డానియెల్ ఏం చేశాడు ? అందుకు భీమ్లా నాయక్ ఎలా ప్రతి ఘటించాడు ?  చివరకు అహంకారానికి ఆత్మ గౌరవానికి మధ్య జరిగిన ఈ పోరులో ఎవరు గెలుస్తారు ? అన్న విషయాలను తెలుసుకోవాలంటే సినిమాను వెండితెరపై చూడాల్సిందే.


నటీనటుల పనితీరు
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటనలో ఎనర్జీ కనిపించింది.తన పాత్ర గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. డానియల్ గా రానా పంచెకట్టులో కొత్తగా కనిపిస్తూ అద్భుతంగా నటించాడు. పవన్,రానాల పెర్ఫార్మెన్స్‌కు పేరు పెట్టాల్సిన పనిలేదు. పవన్, నిత్యల మధ్య ఎమోషన్ చాలా బాగుంది. నిత్య మీనన్‌, సంయుక్త మీనన్‌లు కూడా తమ పాత్రల పరిధుల మేర బాగానే నటించారు.రావు రమేష్, మురళీ శర్మ, సముద్రఖని, తనికెళ్ళ భరణి, సంజయ్ స్వరూప్, మోనికా తదితరులు తమ పాత్రలకు న్యాయం చేశారు.ఇతర నటీనటులు కూడా ఫర్వాలేదని పించారు

సాంకేతిక నిపుణుల పనితీరు
మలయాళ సినిమాను తెలుగు నెటివిటీకి అనుగుణంగా తెరకెక్కించడంలో దర్శకుడు సాగర్ కె చంద్ర వందశాతం సక్సెస్ అయ్యారు. సినిమాలో పవన్‌, రానాల మధ్య ఉండే ఇంటెన్సిటీ  ఇద్దరూ పేల్చే డైలాగ్స్ ప్రేక్షకులచే విజిల్స్ కొట్టిస్తాయి.త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, సంభాషణలు సినిమాకు బలంగా నిలిచాయి.తమన్ అందించిన మ్యూజిక్ సూపర్‌ గా ఉంది. ముఖ్యంగా నేపథ్య సంగీతంతో మురిపించారు. రవి కె.చంద్రన్ సినిమాటోగ్రఫీ కనువిందు చేస్తుంది. పవన్ కల్యాణ్ మరోసారి తన మ్యాజిక్‌ను ఈ సినిమాలో చూపించారని చెప్పవచ్చు. ప్రఖ్యాత నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ నిర్మించిన నిర్మాణ విలువలు క్వాలిటీ గా.. రిచ్ గా ఉన్నాయి. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాను నిర్మించారు.మొత్తంగా చెప్పాలంటే.. ఎన్నో రోజుల తరువాత థియేటర్లో విడుదలైన ‘భీమ్లా నాయక్’ సినిమా అభిమానులకు పవన్ విశ్వరూపం,పవన తాండవం చూసి మురిసిపోతారు. పవన్ కల్యాణ్ అభిమానులకు ఫుల్ మీల్స్‌ అవుతుంది. వారికే కాక ..ఇతర ప్రేక్షకులకు కూడా ఈ మూవీ చక్కని వినోదాన్ని అందిస్తుంది. కనుక ఈ  సినిమా చూసిన వారందరికీ కచ్చితంగా నచ్చుతుంది.

Cinemarangam.com   Review Rating..3 5/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here