Prabhas Interaction with Telugu Media about ‘Radhe Shyam’

పిరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో అద్భుతమైన ప్రేమ కథగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న చిత్రం “రాధే శ్యామ్”. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన ఈ సినిమాను దర్శకుడు రాధాకృష్ణ కుమార్ తెరకెక్కించారు.1970 ల్లో జరిగే అందమైన ప్రేమకథ ఇది. ఇప్పటికే విడుదలైన రాధే శ్యామ్ పాటలు, ట్రైలర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాకు తెలుగులో పాన్ ఇండియన్ దర్శకుడు రాజమౌళి వాయిస్ ఓవర్ ఇస్తున్నారు. అలాగే కన్నడలో శివరాజ్ కుమార్.. మలయాళంలో పృథ్విరాజ్ సుకుమారన్.. తమిళంలో సత్యరాజ్, హిందీలో బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్ రాధే శ్యామ్ సినిమాకు వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఇప్పటి వరకు రెబల్ స్టార్ ప్రభాస్ కెరీర్‌లో ఎన్నడూ లేనంత బిగ్గెస్ట్ రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్. గోపీకృష్ణా మూవీస్ సమర్పణలో యూవీ క్రియేషన్స్ నిర్మించింది. ప్రమోద్, వంశీ, ప్రసీధ నిర్మాతలు. ఈ నెల 11న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న సందర్భంగా చిత్ర యూనిట్ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసింది.

హీరో ప్రభాస్ మాట్లాడుతూ..మిర్చి, బాహుబలి, సాహో వంటి చిత్రాలు తర్వాత నేను చేస్తున్న  పిరియాడికల్ ఫిలిం ”రాధే శ్యామ్’ మంచి కిక్ నిచ్చింది. ఈ సినిమాలో పెద్దగా ఫైట్స్ ఉండవు, కానీ.. యాక్షన్ ఛేజింగ్ సన్నివేశాలు,ట్రైన్ సీన్లు,షిప్ సీన్లతో దృశ్య కావ్యంలా ఉంటుంది. బాహుబలి తర్వాత నాలాంటి యాక్టర్ కు లవ్ స్టోరీ ఇవ్వడానికి భయపడుతూ ఉంటారు. కానీ రాధాకృష్ణ “రాధే శ్యామ్” లాంటి మంచి ప్రేమకథ చెప్పారు.ఈ సినిమా కథ చెప్పడానికి రాధాకృష్ణ వచ్చి కథలో హీరో జ్యోతిష్కుడు అన్నాడు. అలాంటి వాటిపై నాకు పెద్దగా నమ్మకం లేదు.వెంటనే నో చెపితే బాగోదని ఇంటర్వల్ వరకు విని నచ్చలేదని చెబుదామని కథ వినడం స్టార్ట్ చేశాను. కానీ కథ వింటున్నంత సేపు ఆసక్తి గా కనిపించింది.ముఖ్యంగా..సెకండాఫ్ సీన్స్ నన్ను ఎగ్జైట్ చేశాయి. దాంతో ”రాధే శ్యామ్” సినిమా చేయడానికి డిసైడ్ అయిపోయాను. దర్శకుడు రాధాకృష్ణ నాలుగేళ్లుగా ఈ సినిమాకె కమిట్ అయి ఉన్నారు.పది సార్లు విదేశాలకు వెళ్లి, కోవిడ్ ను అధిగమించడం మాములు విషయం కాదు.ఈ సినిమాకు తను చాలా కష్టపడ్డాడు. క్లైమాక్స్ లో వచ్చే ఒక్క షిప్ ఎపిసోడ్ కోసమే దాదాపు రెండేళ్ల కష్టపడ్డారు.ఈ షిప్ కు తనే కెప్టెన్. “బ్రేవ్ హార్ట్” గ్లాడిటర్, ట్రాయ్ లాంటి సినిమాలకు పనిచేసిన హాలీవుడ్ నిపుణులు ఈ సినిమాకు పనిచేశారు.ఈ సినిమాలో ఉండే షిప్ ఎపిసోడ్ విజువల్ ట్రీట్ లా ఉంటుంది. గోపీ కృష్ణ మూవీస్ బ్యానర్ పెదనాన్న కెరీర్ ను మలుపుతిప్పే హిట్స్ ను ఇచ్చింది.ఇదే బ్యానర్ లో వచ్చిన “కృష్ణవేణి” చిత్రం పెదనాన్న కృష్ణంరాజుకు నటుడుగా నిర్మాతగా పెద్ద హిట్ గా నిలిచింది.ఈ బ్యానర్ లో 15 సినిమాలు నిర్మిస్తే దాదాపు 10 సినిమాలు హిట్టు. దీంతో గోపికృష్ణ మూవీస్ నుంచి వస్తున్న చిత్రం అంటే హిట్ సాధించాలనే కోరుకుంటాను ఈ చిత్రానికి నా సిస్టర్ ప్రసీద (కృష్ణం రాజు కుమార్తె) ఒక నిర్మాత .యు వి క్రియేషన్స్ వంశీ,ప్రమోద్ లు బాగా హెల్ప్ చేశారు. ఇక పెదనాన్నగారితో నేను చేసిన బిల్లా సినిమా నుంచి విజయం సాధించింది. మేకింగ్ లో ఏదైనా పొరపాటు జరిగితే పెదనాన్నకు సమాదానం చెప్పాలనే టెన్షన్ ఉండేది. రాధే శ్యామ్  చిత్రంలో పెదనాన్న గారు  పరమహంస అనే ఫిలాసఫీకల్ పాత్ర చేశారు.ఆయన పాత్ర చుట్టూ తిరుగుతుంది. ఆధ్యాత్మిక భావాలతో పాటు కొంచెం వెటకారంగా స్పందించే స్వభావం ఉన్న పాత్రను పోషించారు. ఆయనకు కథ చెప్పడానికి రాధాకృష్ణ మొదట్లో భయపడ్డారు.అయితే పైకి అలా వున్నా కూడా చాలా కూల్ పర్సన్. ఆర్ట్ డైరెక్టర్ రవీందర్ గారు పర్ఫెక్ట్ గా సెట్స్ ను డిజైన్ చేశారు. కెమెరామెన్ మనోజ్ పరమహంస గారు నాకు పూజకు మధ్య చాలా రొమాంటిక్ సీన్స్ ని బాగా చిత్రీకరించారు. ఇక ఈ లవ్ స్టోరీని జస్టిన్ ప్రభాకర్ అద్భుతమైన సంగీతం అందించారు. అలాగే తమన్ గారి మ్యూజిక్ రాధే శ్యామ్ ను మరో లెవల్ కు తీసుకెళ్ళింది.రసూల్ గారు తన సౌండ్ ఇంజినీరింగ్ తో సినిమాకు ఇంటర్నేషనల్ లుక్ ను తీసుకువచ్చారు.ప్రస్తుతం ప్రశాంత్ నీల్ తో “సలార్” చేస్తున్నా అలాగే నాగ్ అశ్విన్ తో ప్రాజెక్టులో నటిస్తున్నాను, ఆదిపురుష్ నిర్మాణాంతర పనులు జరుగుతున్నాయి. త్వరలో పూర్తి స్థాయి కామెడీ చిత్రంలో నటిస్తున్నాను అన్నారు .

చిత్ర దర్శకుడు రాధాకృష్ణ మాట్లాడుతూ..ప్రభాస్, పూజా హెగ్డే మధ్య వచ్చే ప్రేమ సన్నివేశాలు సినిమాకు ప్రాణం.అద్భుత మైన విజువల్ ఎఫెక్ట్స్, అత్యద్భుతమైన సెట్లు.. అన్నింటినీ కలిపి రాధే శ్యామ్ సినిమాను ఎప్పటికీ మరిచిపోలేని ఒక గొప్ప ప్రేమ కథగా నిలుస్తుంది. ఈ చిత్రంలో విక్రమాదిత్య, ప్రేరణ పాత్రల్లో ప్రభాస్, పూజ హెగ్డే లు మెప్పిస్తారు. థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు విక్రమాదిత్య ఎమోషన్స్ ను,ప్రేరణ ఇంటెన్స్ ను ఆడియన్స్ ఇంటికి తీసుకుని వెళతారు. కృష్ణం రాజుగారు ఇచ్చిన సలహాలు సూచనలు ఉపయోగపడ్డాయి ఈ సినిమాకు దాదాపు మూడు వందల కోట్ల బడ్జెట్ అయింది. కానీ వెయ్యి కోట్ల విజువల్ ట్రీట్ ను థియేటర్ లో చూస్తారు.యు.వి. క్రియేషన్స్‌, గోపీ కృష్ణా మూవీస్‌ వంటి ప్రతిష్ఠాత్మక సంస్థలు నిర్మిస్తున్న ఈ సినిమాకు నేను దర్శకుడు కావటం నిజంగా లక్కీ అన్నారు

మ్యూజిక్ డైరెక్టర్ జ‌స్టిన్ ప్ర‌భాక‌ర‌న్ మాట్లాడుతూ ..ఇంత అద్భుతమైన సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా  అవకాశం రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇది  టఫ్ జాబ్  అయినా సరే నేను రీచ్ అయ్యానని అనుకుంటున్నాను అన్నారు..

తమన్ మాట్లాడుతూ.. ప్రభాస్ సినిమాకు పనిచేయడం ఇదే తొలిసారి ఆయన సినిమాకు వర్క్ చేస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఇక తెలుగుకు “మణిరత్నం” వంటి దర్శకుడు రాధాకృష్ణ రూపంలో దొరికాడా అని నాకు అనిపిస్తుంది. నా కెరియర్ కాస్త డౌన్లో ఉన్నప్పుడు యు.వి. క్రియేషన్స్ వారు నాకు “భాగమతి” “మహానుభావుడు” వంటి సినిమాలు ఇచ్చారు ఇప్పుడు నేను రిటన్ గిఫ్ట్ గా “రాధే శ్యామ్” చేశాను అన్నారు.

ఆర్ట్ డైరెక్టర్ రవీందర్ మాట్లాడుతూ..”రాధే శ్యామ్” ను తొలుత ఇండియా బ్యాక్ డ్రాప్ అనుకున్నప్పటికీ ఆ తర్వాత ఇటలీ బ్యాక్ డ్రాప్ లో షూట్ చేయడం జరిగింది  రాధాకృష్ణను నమ్మి నిర్మాతలు అంత బడ్జెట్ ఖర్చు పెట్టారు కానీ మేము సినిమాకు ఏది అవసరమో.. ఎంత అవసరమో అంతే డిజైన్ చేశాము.అలాగే కోవిడ్ టైంలో ఈ చిత్రం కోసం వినియోగించిన వైద్య పరికరాలను కరోనా బాధితులకు ఉపయోగపడేలా చేయడం సంతోషాన్నిచ్చింది అన్నారు.

నటీనటులు:
ప్రభాస్, పూజా హెగ్డే, కృష్ణంరాజు, భాగ్యశ్రీ, సచిన్ ఖేడ్‌కర్, ప్రియదర్శి తదితరులు..

టెక్నికల్ టీమ్:

కథ, స్క్రీన్ ప్లే, దర్శకుడు: కె కె రాధాకృష్ణ కుమార్
నిర్మాతలు: వంశీ, ప్ర‌మోద్, ప్ర‌సీధ‌
బ్యానర్స్: గోపీ కృష్ణ మూవీస్, యూవీ క్రియేష‌న్స్
సంగీతం: జ‌స్టిన్ ప్ర‌భాక‌ర‌న్ (తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం), మిథున్, అనూ మాలిక్, మనన్ భరద్వాజ్ (హిందీ),
సినిమాటోగ్రఫీ: మనోజ్ పరమహంస,
ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు
యాక్ష‌న్ కొరియోగ్ర‌ఫీ: నిక్ పావెల్‌
డైర‌క్ట‌ర్ ఆఫ్ కొరియోగ్ర‌ఫీ: వైభ‌వి మ‌ర్చంట్‌
ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌: రవీందర్
సౌండ్ ఇంజ‌నీర్‌: ర‌సూల్ పూకుట్టి
ప్రొడక్షన్ కంపెనీస్: యువీ క్రియేషన్స్, టి సిరీస్
PRO : ఏలూరు శ్రీను,మేఘా శ్యామ్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here