Sri Vidyaniketan 30th Annual day Grand Celebrations

చిత్తూరు జిల్లా మొదుగులపాలెంలో మంచు నారాయణ స్వామి నాయుడు, మంచు లక్ష్మమ్మ దంపతులకు 1952 లో జన్మించిన మంచు భక్త వత్సలం నాయుడు ఉరఫ్ మోహన్ బాబు సినిమా నటుడిగా ఎంత సంపాదించినా..ఎంత ఎదిగినా కూడా విద్యకున్న ప్రాధాన్యతను ఆయన ఎప్పుడూ మర్చిపోలేదు. పేద పిల్లలకు డబ్బు లేకపోవడం వలన వారికి చదువు దూరమై పోతుందని, అలాగే మంచి క్వాలిటీ విద్య పేద ప్రజలకు అందడం లేదనే ఫీలింగ్ ఆయన మనసులో కలిగేది.తన చిన్నతనంలో ఏంతో కష్టపడి చదువుకున్నాడు ఆ ఫీలింగ్ తన మనసులో అలాగే ఉండి పోయేసరికి తాను ఒక స్థాయికి వచ్చిన తర్వాత పేద ప్రజల కోసం ఎంత సహాయం చేసినా తక్కువే అవుతుంది.అదే విద్యాదానం అయితే అన్నిటికంటే గొప్పదని భావించి పేద ప్రజలకు మంచి విద్యను అందిస్తే..దాని ద్వారా జీవితాంతం వారి కుటుంబాలు బతుకుతారు.ఒక మంచి క్వాలిటీ గల విద్య వారికి లభిస్తుందనే సదుద్దేశంతో.. తను  ఆర్టిస్ట్ గా బిజీగా ఉన్నప్పటికీ 1992 లో శ్రీ విద్యానికేతన్ స్కూల్ ను స్థాపించారు.ఆ తరువాత  స్కూల్ నుండి కాలేజ్, నర్సింగ్, ఫార్మసీ, ఇంజినీరింగ్, యమ్.బి.ఏ, యమ్.సి ఏ కాలేజ్ ఇలా దిన, దినాభివృద్ది చెందుతూ చిన్నగా మొదలైన ఈ సంస్థ రోజు యూనివర్సిటీ స్థాయికి ఎదిగింది. విద్యానికేతన్ ద్వారా నిర్వహించ బడే వార్షిక జాతీయ స్థాయి టెక్నో-కల్చరల్ ఫెస్ట్ లో అన్ని రకాల స్పోర్ట్ యాక్టీవిటీస్, కల్చరల్ ప్రోగ్రామ్స్, కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది.ఇందులో ఇతర సంస్థల విద్యార్థు లతో పాటు దక్షిణాది రాష్ట్రాల నుండి సుమారు 50,000 మంది విద్యార్థులు పోటీపడే దశగా ఎదిగింది.అయితే ట్రస్ట్ వ్యవస్థాప కుడు డా.ఎం. మోహన్ బాబు జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం మార్చి 19న వార్షిక దినోత్సవంగా 19,20 వ తేదీలలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు సమక్షంలో ఈ వేడుకలు నిర్వహిస్తారు.అయితే ఈ సంస్థను స్థాపించి నేటికీ 30 సంవత్సరాలు పూర్తి చేసుకొన్న ఈ వార్షికోత్సవ వేడుకలను విద్యార్థులు, వారి తల్లి దండ్రులు, ఆధ్యాత్మిక గురువులు, సినీ రాజకేయ, ప్రముఖుల సమక్షంలో ఘనంగా జరుపుకున్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా వచ్చిన శ్రీ శ్రీ శ్రీ రవి శంకర్ స్వామీజీ, సెంట్రల్ యూనియన్ మినిస్టర్ కిషన్ రెడ్డి, పారిశ్రామిక వేత్త జి.అమరెందర్ రెడ్డి,దర్శకుడు బి.గోపాల్ రెడ్డి,నటుడు వి.కె.నరేష్, అలీ, దర్శకుడు ఈశ్వర్ రెడ్డి, సినిమాటోగ్రాఫర్ చోటా కె నాయుడు,మా ప్రెసిడెంట్  విష్ణు మంచు,నిర్మాత కోన వెంకట్, మంచు లక్ష్మి, దర్శకుడు డైమండ్ రత్నబాబు,నటుడు చిట్టిబాబు తదితరులు పాల్గొని ముచ్చటగా మూడు దశాబ్దాలు పూర్తి చేసుకున్న శ్రీ విద్యానికేతన్ స్కూల్ మరింత ఉన్నత శిఖరాలను చేరుకోవాలని ఆకాంక్షిస్తూ నటుడు మోహన్ బాబు బర్త్ డే విషెస్ తెలియజేస్తూ.. ఆ యూనివర్సిటీ లోని ఉత్తమ విద్యార్థులకు గోల్డ్ మెడల్స్, ప్రశంశాపత్రాలు తెలియజేశారు. అనంతరం


ముఖ్య అతిథిగా వచ్చిన శ్రీ శ్రీ శ్రీ రవి శంకర్ గురుదేవ్ మాట్లాడుతూ..పేద పిల్లలకు విద్యను అందించాలని మంచి మనసుతో స్థాపించిన శ్రీ విద్యానికేత్ స్కూల్ నేటికి 30 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు డాక్టర్ మోహన్ బాబు గారికి ధన్యవాదాలు తెలియ జేస్తున్నాను. చాలా మంది  యాక్టింగ్, సినిమాటోగ్రఫీ నేర్చుకోవడానికి న్యూ యార్క్ కు వెళుతున్నారు. అయితే వారందరూ విదేశాలకు వెళ్లకుండా అందరికీ అందుబాటులో ఉండేలా ఇక్కడే సినిమాటోగ్రఫీ కాలేజ్ ఆఫ్ యాక్టింగ్ కాలేజ్ ను జూన్ నుండి ప్రారంభిస్తున్నామని చెప్పడం చాలా సంతోషం..సినిమా అనేది ఒక్క ఏంటర్ టైన్మెంట్ మాత్రమే కాకుండా అందులో సోషల్ మెసేజ్ ఇస్తూ చూసిన ప్రేక్షకులు ఇన్స్పిరేషన్ అయ్యేలా మంచి సినిమాలు తీయాలి.యువతీ, యువకులు అందరూ కూడా కలలు కనాలి పట్టుదలతో వారు కన్నా కలలను సాకారం చేసుకోవాలి. ఈ యూనివర్సిటీలో యంగ్ టాలెంట్ ఉన్న వారు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరినీ ఇంటర్నేషనల్ ఫ్లాట్ ఫార్మ్ మీదకు తీసుకు వస్తే ఎన్నో ఇన్నోవేటివ్ ఐడియాస్ తో దేశాన్ని ముందుకు నడిపిస్తారు అన్నారు.

నటుడు పద్మశ్రీ డా..మోహన్ బాబు మాట్లాడుతూ..జీవితం అంటే కష్టాల మయమైనది. జీవితంలో ఎదో సాదించాలని దొంగ బండి ఎక్కి మద్రాస్ వెళ్ళాను. అక్కడ దాదాపు 7 సంవత్సరాలు పాటు సరైన తిండిలేక,చెప్పులు లేక ఉన్న రెండు జతల బట్టలనే ఉతుక్కుంటూ కారు షెడ్ లో వుండేవాన్ని. సినిమాలలో అవకాశాల కోసం ఎన్నో కష్టాలు పడిన తరువాత దాసరి నారాయణ రావు గారు మోహన్ బాబుగా ఇండస్ట్రీకి పరిచయం చేయడం జరిగింది.ఆ తరువాత ఎన్నో అద్భుతమైన పాత్రలు చేయడం,నిర్మాతగా మారి ఎన్నో ఫెయిల్యూర్స్, సక్సెస్ లు చవి చూశాను. మా గురువు దాసరి గారు చెప్పినట్లు జీవితమే ఒక నాటకం అన్నట్లు నా జీవితం రోజూ ఒక ముళ్లబాటలాగ ఉండేది. నటుడుగా సొసైటీకి ఏమైనా చెయ్యాలని శ్రీ విద్యానికేతన్ ఇంటర్నేషనల్ స్కూల్ స్థాపించాను.ఇందులో కులమతాలకు అతీతంగా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వడం జరుగుతుంది.ఆ తరువాత అందరికి అందుబాటులో ఉండేలా అన్ని రకాల కాలేజ్ లను ఏర్పాటు చేస్తూ వస్తున్నాము.వాటిలో కూడా స్టూడెంట్స్ కు 25% కన్సక్షన్ ఇస్తున్నాము.ఇదంతా జరగడానికి కారణం భగవంతుని ఆశీస్సులు.నా జీవితం గురించి ఇక్క సారి వెనక్కి తిరిగి చూసుకుంటే నేను పడిన కష్టాలు, నా బిడ్డలకే కాదు, ఇంకెవరికీ  రాకూడదని భగవంతుడుని ప్రార్ధిస్తుంటాను. బాంబ్ బ్లాస్ట్ జరగడం దేవుడు ఆశీస్సులతో ప్రాణాలతో బయట పడడం, రాళ్ళ దెబ్బలు, పాలిటిక్స్ ఇలా చెప్పుకుంటూ పోతే నా జీవితం గురించి ఒక పుస్తకం రాయచ్చు. నేను ఇతరులకు ఉపయోగపడ్డానే కానీ.. నాకెవరూ ఉపయోగ పడలేదు.ఎన్టీ రామారావు గారితో “మేఘ సందేశం” సినిమా తీసి మళ్ళీ మిమ్మల్ని ముఖ్యమంత్రి గా చూడాలి అన్నయ్యా..అని ఆయనను కుర్చీ లో కూర్చోపెడితే అన్న ఒక్కడే నన్ను రాజ్యసభ కు పంపించాడు తప్పా..మిగిలిన వారంతా నన్ను పొలిటికల్ క్యాంపెన్ కు ఆహ్వానించి వాడుకొని నన్ను మోసం చేసిన వాళ్లే..ఇలా జీవితం నాకు ఎన్నో గుణపాఠాలు నేర్పింది. సినిమారంగలో ఎంతో కష్టపడుతూ అంచెలంచెలుగా ఎదగడం జరిగింది. ఏది ఏమైనా “శ్రీ విద్యానికేతన్” 30 సంవత్సరాల కష్టం ఈ రోజు మెహన్ బాబు యూనివర్సిటీ అయ్యింది. తోటమాలి దగ్గరనుండి అందరూ కూడా మాకు సపోర్ట్ గా నిలిచారు వారందరికీ ధన్యవాదాలు అన్నారు.


సెంట్రల్ యూనియన్ మినిస్టర్ కిషన్ రెడ్డి మాట్లాడుతూ..మోహన్ బాబు గారు 1992లో స్థాపించిన “శ్రీ విద్యానికేతన్” స్కూల్ తన బర్త్ డే రోజు 30 సంవత్సరాలు పూర్తిచేకోవడం చాలా సంతోషంగా ఉంది. ఒక చిన్న స్కూల్ తో మొదలై ఈ రోజు మోహన్ బాబు డీమ్డ్ యూనివర్సిటీ మారడం అంటే అంత ఈజీ కాదు.దీని వెనుక ఆయన శ్రమ ఎంతో ఉంది. హీరోగా సినిమా నటుడిగా అత్యంత ఉన్నత స్థానంలో ఉన్నా కూడా పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని సదుద్దేశం తో నాకు జన్మనిచ్చిన ప్రాంతానికి, ప్రజలకు, ఏదైనా సేవ చేయాలనే  తపనతో ఎంతో సమయాన్ని వెచ్చించి సినిమా షూటింగ్ లను ఆపి ఈ యొక్క స్కూల్ ను స్థాపించడం జరిగింది.ఆ తర్వాత దీన్ని దిన దినాభివృద్ధి చెందడానికి తను ఎంతో కృషి చేయడంతో ఈ రోజు 30 వేల మంది స్టూడెంట్స్ అవ్వడం జరిగింది. స్వామి వివేకానంద , అబ్దుల్ కలాం,స్వామి రవిశంకర్ గురూజీ చెప్పినట్టు నేటి విద్యార్థులే.. దేశానికి వెన్నెముక వారు అనేక రంగాల్లో ముందుకు వెల్లాలి. రాబోయే 2047 లో మనం వంద సంవత్సరాల స్వతంత్ర వేడుకలు జరుపు కుంటాము.మన దేశానికి పెద్ద సంపద విద్యార్థులే వచ్చే 25 సంవత్సరాలు మీరు దేశానికి నాయకత్వం వహించాలి. గతంలో విదేశాలలో పరిశోధనలు జరిగేవి కానీ ఈ రోజు మన దేశ విద్యార్థులు పరిశోధనలు చేస్తూ ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తున్నారు అన్నారు.

నటుడు మంచు మనోజ్ మాట్లాడుతూ..ప్రతి ఒక్కరికి ఒక ఎయిమ్ ఉంటుంది. వారంతా కష్టపడి జీవితంలో సక్సెస్ కావాలని కోరుతున్నాను.మా యూనివర్దిటే నుంచి వెళ్ళిన వాళ్ళు ఎంతో మంది పోలీస్ ఆఫీసర్స్ గా ఐఏఎస్  ఆఫీసర్ గా ఇలా అన్ని రాష్ట్రాల్లో ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది.మా నాన్న గారు ఎంత కష్ట పడ్డారో నాకు తెలుసు తను 500 చిత్రాల్లో నటించడం జరిగింది. ప్రజలకు ఏమైనా చెయ్యాలని 30 సంవత్సరాల క్రితం “శ్రీ విద్యానికేతన్” ఇంటర్నేషనల్ స్కూల్ స్థాపించారు.అది ఇప్పుడు మోహన్ బాబు యూనివర్సిటీ అయినందుకు చాలా గర్వంగా ఉందని అన్నారు.


ఇంకా ఈ కార్యక్రమంలో పారిశ్రామిక వేత్త జి.అమరెందర్ రెడ్డి,దర్శకుడు బి.గోపాల్ రెడ్డి, నటులు వి.కె.నరేష్,అలీ, దర్శకుడు ఈశ్వర్ రెడ్డి, సినిమాటోగ్రాఫర్ చోటా కె నాయుడు,నిర్మాత కోన వెంకట్, దర్శకుడు డైమండ్ రత్నబాబు, నటుడు చిట్టిబాబు తదితరులు అందరూ  మోహన్ బాబు గారు చదువు మీద ఉన్న ప్రేమతో, గౌరవం తో ఈ కాలేజ్ ను పెట్టి ఎంతో మంది స్టూడెంట్స్ కు అండగా నిలుస్తున్న ఎంతో మంచి మనిషి మోహన్ బాబు ఆన్నగారికి ధన్యవాదాలతో జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here