‘Sevadas’ Movie worldwide Grand Releasing on April 1st

శ్రీశ్రీ హథీరామ్ బాలాజీ క్రియేషన్స్ పతాకంపై సీనియర్ హీరోలు సుమన్, భానుచందర్ ప్రధాన పాత్రలలో కె.పి.ఎన్. చౌహాన్, ప్రీతి అస్రాని, వినోద్ రైనా-రేఖా నిరోష హీరో హీరోయిన్లు గా యువ ప్రతిభాశాలి కె.పి.ఎన్.చౌహాన్ దర్శకత్వంలో ఇస్లావత్ వినోద్ రైనా-సీతారామ్ నాయక్ లు సంయుక్తంగా నిర్మించిన ప్రతిష్టాత్మక బహుభాషా చిత్రం “సేవాదాస్”. బంజారా-తెలుగు- ఇంగ్లీష్-హిందీ భాషల్లో రూపొందిన ఈ చిత్రం ఏప్రిల్ 1న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. ఈ సందర్భంగా

సీనియర్ హీరో సుమన్ మాట్లాడుతూ..బంజారాల సంసృతిని, ఆచార వ్యవహారాలను ఈ చిత్రం ద్వారా పొందుపరచి ప్రపంచానికి చాటిచెప్పే “సేవాదాస్” చిత్రంలో సేవాలాల్ గా నటించడం గర్వంగా ఉంది.ఏప్రిల్ 1 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రాన్ని బంజారాలే కాక తెలుగు ప్రజలంతా చిత్ర యూనిట్ ను ఎంకరేజ్ చేసి ఆశీర్వదించాలని అన్నారు

కీలక పాత్ర పోషించిన భానుచందర్ మాట్లాడుతూ..64 దేశాల్లో గల 18 కోట్ల బంజారాలతోపాటు తెలుగు, హిందీ ప్రేక్షకుల హృదయాలకు హత్తుకునేలా “సేవాదాస్” చిత్రాన్ని తీర్చిదిద్దిన దర్శక,నిర్మాతలకు ఉజ్వల భవిష్యత్ ఉందన్నారు.

హీరో-డైరెక్టర్ కె.పి.ఎన్. చౌహాన్ మాట్లాడుతూ..ఏప్రిల్ 1 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న “సేవాదాస్” సంచలన విజయం సాధించడం ఖాయం. ఇంతకుముందు మేము తీసిన గోర్ జీవన్ సినిమా పెద్ద విజయం సాధించింది.డైరెక్టర్, హీరో గా చేయడం అంటే అంత ఈజీ కాదు సినిమా టీమ్ అందరూ నాకు ఎంతో హెల్ప్ చేశారు అందరి సపోర్ట్ తో ఈ సినిమాను పూర్తి చేశాం. ఈ సినిమా తప్పక విజయం సాధిస్తుందని అన్నారు..

నిర్మాతలు ఇస్లావత్ వినోద్ రైనా- సీతారామ్ నాయక్ మాట్లాడుతూ.. “డైరెక్ట్ హీరోగా రెండవ సినిమా చేస్తున్న చౌహన్ కు మంచి ఫ్యూచర్ ఉంది. తను ఎన్నో ఇబ్బందులు పడుతూ ఈ రోజు ఈ స్టేజ్ కు వచ్చాడు.లంబాడీ ల జీవిత చరిత్రల ఆధారంగా తెరకెక్కిన చిత్రం “సేవాదాస్”.దేశంలో 12 కోట్ల మంది బంజారాలు ఉండగా, 50 లక్షల మంది బంజారాలు వున్న మన తెలంగాణ లో మనకు తగిన ప్రాధాన్యత లేదు.ఈ రోజు ఈ జాతి బిడ్డల తరుపున ఇప్పుడు ఇండస్ట్రీ కు వచ్చి మన జాతి చరిత్ర, బాషా, సంస్కృతం ఇలా అన్ని కనుమారుగై పోకూడని తెలియజేయడానికి “సేవాదాస్” చిత్రం తీయడం జరిగింది. ఈ చిత్ర రూపకల్పన కోసం శ్రమించిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా అభినందనలు.ఏప్రిల్ 1న  ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ  చిత్రాన్ని అందరూ ఆదరించాలి అన్నారు.

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ బాలు ఎమ్.చౌహాన్ మాట్లాడుతూ..ఈ దేశంలో ఉన్నటువంటి 12 కోట్ల  బంజారాలు ఏకం చేసే విధంగా ఒక గొప్ప కథతో సినిమా చేసే అవకాశం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ బోలె మాట్లాడుతూ..ఇందులోని పాటలన్నీ చాలా బాగా వచ్చాయి. ఏప్రిల్ 1 న వస్తున్న ఈ చిత్రం ప్రేక్షకులందరికీ కచ్చితంగా నచ్చుతుంది అన్నారు.

హీరో-హీరోయిన్స్ వినోద్ రైనా, రేఖా నిరోష లు మాట్లాడుతూ..  చరిత్రలో నిలిచిపోయే ఇలాంటి మంచి చిత్రంలో నటించే అవకాశం కల్పించిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు తెలుపుతూ సంతోషం వ్యక్తం చేశారు.

నటీనటులు
ఎస్.ఆర్.ఎస్. ప్రసాద్, విజయ్ రంగరాజు, చలాకీ చంటి, సంపత్ నాయక్, గీతా సింగ్, ఫిష్ వెంకట్, నవీనా రెడ్డి, శైలజ తదితరులు

సాంకేతిక నిపుణులు
నిర్మాతలు: ఇస్లావత్ వినోద్ రైనా-సీతారామ్ నాయక్,
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎమ్.బాలు చౌహాన్,
కథ-స్క్రీన్ ప్లే-డైరెక్షన్; కె.పి.ఎన్. చౌహాన్!!
అసోసియేట్ డైరెక్టర్స్: రాజేంద్రప్రసాద్ చిరుత-రవితేజ-సంజయ్ భూషణ్-సాయి కుమార్,
కో-డైరెక్టర్స్; ఎన్టీఆర్ సుబ్బు-నవీన్,
వి ఎఫ్ ఎక్స్: కిషోర్ కాలకూరి,
ఆర్ట్ డైరెక్టర్: విజయ్.ఎ,
ప్రొడక్షన్ కంట్రోలర్: లక్ష్మణరావు-శ్రీరాములు,
కెమెరామెన్: విజయ్ టాగోర్,
ఎడిటర్: ప్రదీప్,
పోస్ట్ ప్రొడక్షన్: రామానాయుడు స్టూడియోస్,

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here