Suchirindia’s 29th National & State Level Science talent search examination, Sir CV Raman Young Genius awards ceremony

ప్రముఖ సామాజిక సేవాసంస్థ సుచిరిండియా ఫౌండేషన్ 29వ సర్ సివి రామన్ టాలెంట్ సెర్చ్ పరీక్షను జాతీయ మరియు రాష్ట్ర స్థాయిలో వివిధ పాఠశాలల్లో నిర్వహించింది. 1000 పాఠశాలల నుండి 100000 మంది విద్యార్థులు పాల్గొన్నారు.దేశ వ్యాప్తంగా మరియు తెలుగు రాష్ట్రాల పరిధిలో నిర్వహించన 29వ జాతీయ స్థాయి సైన్స్ టాలెంట్ సెర్చ్ పరీక్షల్లో 16 మందికి గోల్డ్ మెడల్స్, 48 మంది కి నేషనల్ ర్యాంక్స్ & రాష్ట్రా స్థాయి మెడల్స్, 300 మందికి జిల్లా స్థాయి ర్యాంక్స్ మరియు 10 మందికి గురుబ్రహ్మ ఛత్రాలయా అవార్డ్స్ వచ్చాయని. ఈ యువ టాలెంట్ విద్యార్థులకు రవీంద్ర భారతిలో అవార్డులు ప్రదానం చేశారు. విద్యార్థులు ఈ పురస్కారాన్ని సాధించిన ఈ యువ ప్రతిభ వెనుక ఉన్న ఉపాధ్యాయులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో సినీనటుడు డాక్టర్ రాజేంద్రప్రసాద్, డాక్టర్ JVR సాగర్ (OS & Scientist ‘H’ Group Director (E&c) DRDI), శ్రీ శ్రీధర్ బాబు మంథాని MLA , దాసరి బాలయ్య రీజినల్ పాస్ పోర్ట్ ఆఫీసర్ మరియు సూచిరిండియా ఫౌండేషన్ నిర్వహకులు లయన్ కిరణ్ చేతుల మీదుగా విద్యార్థులు కు బహుమతులు ప్రధానం చేశారు.

ప్రముఖ సినీ నటులు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ..అన్ని భాషల కంటే తెలుగు భాష గొప్పది. సహాయం చేసే గొప్ప ధనం అన్ని కార్పొరేట్ సంస్థలు సామాజిక సేవలో భాగస్వాములు కావాలి
ధనం సంపాదించటమే ముఖ్యం కాదని ఆర్జించిన సంపద లో కొంత వితరణ కోసం వెచ్చించాలని ముఖ్యం గా కార్పొరేట్ సంస్థలు సామాజిక సేవ లో భాగ స్వాములు కావాలని ప్రముఖ సినీ నటులు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ అన్నారు. ప్రదానోత్సవముఖ్య అతిధిగా రాజేంద్ర ప్రసాద్ పాల్గొని మాట్లాడుతూ పిల్లలు ఆట పాట లతో విధ్యనేర్చుకోవలని ఉపాధ్యాయలు జాతి నిర్మాతలుగా పిల్లలను తీర్చిదిద్దటామ్ గురుతర బాధ్యత అని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here