‘Dochevarevarura’.. Movie lyrical video song launched by Tanikellabharani

ఐక్యూ క్రియేషన్స్ పతాకం పై ప్రణవ చంద్ర, మాళవిక జంటగా శివ నాగేశ్వరరావు దర్శకత్వం లో నిర్మాత బొడ్డు కోటేశ్వరరావు నిర్మించిన ఔట్ &ఔట్ ఎంటర్ టైనర్ “దోచేవారెవరురా..”ఈ చిత్రం లోని లిరికల్ వీడియో సాంగ్ ను యస్. పి. బాలు జయంతి సందర్బంగా హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో సినీ అతిరధుల సమక్షంలో ఘనంగా విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధి గా వచ్చిన ప్రముఖ రచయిత ,నటుడు తనికెళ్ళభరణి “సూళ్ళే బాకు..” లిరికల్ వీడియో సాంగ్ ను ” లాంచ్ చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో చంద్రబోస్, అజయ్ గోష్, సిరాశ్రీ, చైతన్య ప్రసాద్, బిత్తిరి సత్తి, సునయన, తదితరులు పాల్గొన్నారు.

ముఖ్య అతిధిగా వచ్చిన తనికెళ్ళ భరణి మాట్లాడుతూ..యస్ పి. బాలు జయంతి సందర్బంగా దర్శకుడు శివానాగేశ్వరరావు రాసిన లిరికల్ వీడియో ను విడుదల చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది.ఇలాంటి మంచి కాన్సెప్ట్ ఉన్నటువంటి సినిమాలు ప్రస్తుత సమాజానికి ఎంతో అవసరం. త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న.. ఈ సినిమా గొప్ప విజయం సాదించాలి అన్నారు.

దర్శకుడు శివ నాగేశ్వరరావు మాట్లాడుతూ. .ఒక ఫ్రెండ్ ద్వారా .శ్రీహరి గారు పరిచయ మయ్యారు. వారు మంచి సినిమా తీద్దామని చెప్పడంతో నేను పాన్ ఇండియా సినిమా తీద్దాం అంటే నీవు ఏది తీసిన అందులో కామెడీ ఉండాలి అన్నారు సస్పెన్స్ కామెడీ థ్రిల్లర్ గా వస్తున్న ఈ చిత్రాన్ని కుటుంబ సామెతంగా కూర్చొని చూడదగ్గ సినిమాగా తెరకేక్కించడం జరిగింది.ఈ సినిమా లో నేను రాసిన పాట పాన్ గ్లోబ్ సాంగ్ లిరికల్ వీడియోను తనకెళ్ళభరణి గారి చేతుల మీదుగా రిలీజ్ చేయడం చాలా సంతోషంగా ఉంది ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు ఒక సాంగ్, కొంత ప్యాచ్ వర్క్ మినిహా సినిమా పూర్తయింది. అన్నీ కార్యక్రమాలు పూర్తిచేసుకొని జులై చివరి వారంలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి ప్రయత్నం చేస్తున్నాము అన్నారు.ఈ సినిమా కథ మొత్తం డబ్బుకు సంబందించిన అంశం చుట్టూ జరుగుతుంది. ప్రస్తుత సమాజంలో మనము ఇంటినుండి బయటికి వచ్చిన తరువాత మనల్ని రకరకాలుగా దోచుకుంటున్నారు.ఇంతకుముందు ఎవర్ని దోచుకోవాలో సెలెక్ట్ చేసుకొని వారిని దోచుకొనే వారు. ప్రస్తుతం మనల్ని ఎవరు దోచుకోవాలో వారిని మనమే సెలెక్ట్ చేసుకుంటున్నాము ఓటు వేసి.అయితే ఇది పొలిటికల్ సినిమా కాదు ఇందులో అన్ని రకాల ఎమోషన్స్ తో పాటు ఫుల్ ఔట్ & ఔట్ కామెడీ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా అందరికీ తప్పకుండా నచ్చుతుంది అన్నారు.

చిత్ర నిర్మాత బొడ్డు కోటేశ్వర రావు మాట్లాడుతూ..ఇందులో నటీ నటులు, టెక్నిషియన్స్ అందరూ సహకరించడంతో సినిమా బాగా వచ్చింది.మంచి కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమా గొప్ప విజయం సాదించాలి అన్నారు.

చైతన్య ప్రసాద్ మాట్లాడుతూ..ఈ చిత్రం లో నా సాటి కవి, దర్శకుడు శివ నాగేశ్వరరావు రాసిన పాట చాలా బాగుంది. మారుతున్నా తరానికి ప్రయోగాలు నచ్చుతాయి. మా అబ్బాయి ప్రణవ చంద్ర ఈ సినిమాలో నటిస్తున్నాడు. ఇంతకు ముందు ఏమో గుర్రం ఎగరావచ్చు సినిమాలో చేశాడు. నా ఇద్దరు కొడుకులు దర్శకులు అవ్వాలని వర్క్ చేస్తున్నారు. ఐతే కో డైరెక్టర్ గా చేస్తున్న ప్రణవ్ కు శివ నాగేశ్వరావు ఈ సినిమాలో హీరోగా చేసే అవకాశం ఇచ్చారు.మంచి కామెడీ తో వస్తున్న ఈ చిత్రం గొప్ప విజయం సాదించాలి అన్నారు.

సిరాశ్రీ మాట్లాడుతూ.. బాలు గారు పాడినన్ని పాటలు ఇప్పటి వరకు ఎవరూ పాడలేదు. మేము అయన పాటలు వింటూనే పెరిగాము. తన పాటలు ఒక బాషకు పరిమితం కాకుండా ప్రతి బాషలో తన పాటలు ఉండడం గొప్ప విశేషం. శివ నాగేశ్వరరావు తీసిన చాలా సినిమాలకు నేను నెగిటివ్ రివ్యూ లు రాసినా దానిని స్పోర్టివ్ గా తీసుకొనే వాడు. అటువంటిది ఇప్పుడు తన సినిమాకు నేను పాటలు రాయడం చాలా సంతోషంగా ఉంది..ఇంకా ఈ సినిమాలో చాలా విశేషాలు ఉన్నాయి అన్నారు.

హీరో ప్రణవ మాట్లాడుతూ.. క్రిష్ దగ్గర దర్శకత్వ శాఖ లో పని చేస్తున్న నాకు శివనాగేశ్వర రావు గారు చేసే సినిమాలో హీరోగా చేసే అవకాశమిచ్చిన దర్శక, నిర్మాత కు ధన్యవాదాలు. నా కో ఆర్టిస్ట్ మాళవిక కూడా చాలా చక్కగా నటించింది. అజయ్ ఘోస్, బిత్తిరి సత్తి వంటి వారితో సినిమా చేయడం చాలా సంతోషంగా ఉంది అన్నారు

హీరోయిన్ మాళవిక మాట్లాడుతూ..ఇలాంటి మంచి సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాత కు ధన్యవాదాలు అన్నారు.

నటీనటులు
ప్రణవ చంద్ర, మాళవిక సతీశన్ అజయ్ ఘోష్, బిత్తిరి సత్తి, టార్జాన్, ప్రణతి తదితరులు

సాంకేతిక నిపుణులు..

బ్యానర్ : IQ క్రియేషన్స్
నిర్మాత : బొడ్డు కోటేశ్వర రావు
దర్శకుడు : శివనాగేశ్వర రావు
డిఓపి : అర్లి
సంగీతం : రోహిత్ వర్ధన్
పి.ఆర్.ఓ: లక్ష్మీనివాస్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here