Love Action Entertainer ‘Chor Bazaar’ Movie Review

Cinemarangam.com
Review Rating 3/5
సినిమా : చోర్ బజార్
బ్యానర్ – ఐ.వి ప్రొడక్షన్స్,
నిర్మాత – వీ.ఎస్ రాజు,
సహ నిర్మాత – అల్లూరి సురేష్ వర్మ,
రచన, దర్శకత్వం – బి. జీవన్ రెడ్డి.
నటీ నటులు : ఆకాశ్ పూరీ,గెహెన్నా సిప్పీ,సునీల్, , సీనియర్ హీరోయిన్ అర్చన తదితరులు
సినిమాటోగ్రఫీ – జగదీష్ చీకటి,
సంగీతం – సురేష్ బొబ్బిలి,
ఎడిటింగ్ – అన్వర్ అలీ, ప్రభు దేవా,
ఆర్ట్ – గాంధీ నడికుడికర్,
బ్యాక్ గ్రౌండ్ స్కోర్ : ప్రియదర్శన్ బాలసుబ్రహ్మణ్యం
ఫైట్స్ – ఫృథ్వీ శేఖర్,
కొరియోగ్రఫీ – భాను,
స్టిల్స్ : వికాస్ సీగు,
పి.ఆర్.వో – జీఎస్కే మీడియా,
డిజిటల్ మీడియా – వాల్స్ అండ్ ట్రెండ్స్,

“దళం”, “జార్జ్ రెడ్డి” చిత్రాలతో ప్రతిభ గల దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు జీవన్ రెడ్డి. ఆకాష్ పూరి హీరోగా ఆయన రూపొందించిన కొత్త సినిమా “చోర్ బజార్”. గెహనా సిప్పీ నాయికగా నటించింది. యూవీ క్రియేషన్స్ సంస్థ సమర్పణలో ఐవీ క్రియేషన్స్ పతాకంపై వీఎస్ రాజు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 24న .గ్రాండ్ గా విడుదల అయిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మాత్రం ఎంటర్ టైన్మెంట్ చేసిందో రివ్యూ లో చూద్దాం పదండి.

కథ:

బచ్చన్ సాబ్ (ఆకాష్ పూరి) హైదరాబాద్ లో పాతబస్తీలో ఉన్న చోర్ బజార్ అనే ప్రాంతంలో జీవనోపాధి కోసం అతను దొంగతనంగా కార్ టైర్ లు విప్పి అమ్ముతూ స్నేహతులతో సరదాగా గడిపేస్తుంటాడు.కార్లు టైర్లు విప్పే దాంట్లో మహా నేర్పరి.అంతేకాకుండా టైర్లు విప్పే దాంట్లో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సాధించాలని ప్రయత్నిస్తుంటాడు. దొంగగా ఉన్న బచ్చన్ సాబ్ అనుకోకుండా మూగ అమ్మాయి (గెహనా సిప్పీ) తో పరిచయం ఏర్పడుతుంది. చివరికి అది కాస్తా ప్రేమగా మారుతుంది. ఇలా సాగుతున్న క్రమంలో చోర్ బజార్ ను ముసేయాలని గబ్బర్(సుబ్బరాజు) కోర్టును ఆశ్రయిస్తాడు. మరో వైపు చోర్ బజార్ ను మూసేస్తే ఇక్కడున్న వారికి జీవనోపాది లేకుండా పోతుందని అలాగే తను గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఎక్కాలనే లక్ష్యం నెరవేరదని, ఈ చోర్ బజార్ ఎట్టి పరిస్థితుల్లోనూ ముసేయకుడదని బచ్చన్ సాబ్.. సిటీకి చెందిన ఫేమస్ పొలిటీషియన్ (సునీల్) ట్రై చేస్తుంటారు. అయితే చివరికి చోర్ బజార్ ను మూసివేయకుండా ఆపగలిగారా? అలాగే బచ్చన్ సాబ్ తను అనుకున్న గోల్ ను సాధించాడా? అసలు ఆ చోర్ బాజార్ ను గబ్బర్ ఎందుకు ముయించాలనుకున్నాడు? ఆ చోర్ బజార్ కు పొలిటీషియన్ కి లింకేంటి ? అనే విషయాలు తెలుసుకోవాలంటే థియేటర్ వెళ్లి సినిమా చూద్దాం పదండి..

నటీ నటుల పనితీరు
ఆకాశ్ పూరీ..బచ్చన్ సాబ్ కు న్యాయం చేయడమేగాక .బచ్చన్ పాత్రలో పూర్తిగా ఒదిగిపోయాడు.ఇది తన కెరీర్ లో ఒక డిఫరెంట్ మూవీగా నిలుస్తుంది.ఇక గెహెన్నా సిప్పీ మూగ పాత్రలో చాలా బాగా నటించింది. ఆకాష్,,గెహెన్నా సిప్పీ ల రొమాన్స్ కూడా బాగానే కుదిరింది. సునీల్ తమ పాత్రకు న్యాయం చేశాడు.సీనియర్ హీరోయిన్ అర్చన చాలా కాలం తరువాత సిల్వర్ స్క్రీన్ పై తల్లి పాత్రలో కనిపించి మెప్పించడమే తనకిచ్చిన పాత్రలో ఒదిగిపోయింది. మిగలిన పాత్రలన్నీ తమ పరిది మేర చాలా చక్కగా నటించారు.

సాంకేతిక నిపుణుల పనితీరు
దళం, జార్జిరెడ్డి లాంటి సినిమాలతో ఆకట్టుకున్న దర్శకుడు జీవన్ రెడ్డి మాస్ ఎలిమెంట్స్ తో ఈ చిత్రాన్ని చక్కగా తెరకెక్కించాడు.దర్శకుడు సినిమాని ఇంట్రెడక్షన్ నుంచి మొదలు పెట్టి చాలా క్యారెక్టర్లతో ముందుకు తీసుకెళ్లాడు..
ఆకాష్ పూరి బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టుగా పాటలు, ఫైట్స్ ని కంపోజ్ చేయించి… ఆడియెన్స్ ను బాగా ఎంటర్టైన్ చేశాడు
ఈ సినిమాలో వచ్చే మాస్ సాంగ్.. క్లైమాక్స్ లో కోర్టు సీన్, పొలిటీషియన్ సునీల్ చెప్పే సంభాషణలు మాస్ ని . మెప్పిస్తాయి.జగదీష్ చెకటి సినిమాటోగ్రఫీ రిచ్ గా వుంది. సురేష్ బొబ్బిలి సంగీతం బాగుంది. పాటలు మాస్ కి బాగా నచ్చుతాయి.అన్వర్ అలీ,ప్రభు దేవా ల ఎడిటింగ్ క్రిస్పిగా ఉంది.యూవీ క్రియేషన్స్ సమర్పణలో ఐవీ క్రియేషన్స్ పతాకంపై వీఎస్ రాజు ఉన్నతమైన నిర్మాణ విలువలతో లవ్, యాక్షన్ ఎంటర్ టైనర్ గా “చోర్ బజార్” చిత్రాన్ని నిర్మించారు.ఈ  సినిమాను నమ్మి థియేట‌ర్ కు వచ్చిన ప్రతి ప్రేక్షకుడిని నిరుత్సాహ పరచకుండా అందరినీ “చోర్ బజార్” కచ్చితంగా ఎంట‌ర్ టైన్ చేస్తుంది అని చెప్పగలను.

Cinemarangam.com Rating..3/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here