Hero Nikhil Siddartha and Anupuma Parmeswaran’s ‘Karthikeya 2’ pre release event Grandly

క‌మ‌ర్షియ‌ల్ చిత్రాల‌తో పాటు విభిన్నమైన కథలతో నిర్మాణాన్ని కొన‌సాగిస్తూ విజ‌యాలు సొంతం చేసుకుంటున్న‌ క్రేజీ నిర్మాణ సంస్థ‌లు పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రి, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్ బేన‌ర్స్ పై ఎన‌ర్జిటిక్ యంగ్ హీరో నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంట‌గా చందు మొండేటి ద‌ర్శ‌క‌త్వంలో కార్తికేయకి సీక్వెల్ గా వస్తున్న కార్తికేయ‌ 2పై అంచనాలు భారీగా ఉన్నాయి.ఈ చిత్రాన్ని  టి.జి. విశ్వ‌ప్ర‌సాద్, అభిషేక్ అగ‌ర్వాల్  సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ఇందులో కీలక పాత్రలో నటిస్తున్నారు. ‘శాంతను ఇది నువ్వు ఆపలేని యాగం.. నేను సమిధను మాత్రమే.. ఆజ్యం మళ్లీ అక్కడ మొదలైంది.. ప్రాణత్యాగం చేసే తెగింపు ఉంటేనే దీనిని పొందగలం’ అంటూ అదిరిపోయే డైలాగ్స్ తో సాగే ట్రైలర్ ఆకట్టుకుంటుంది. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుని ఆగస్ట్ 13న విడుదల కానుంది కార్తికేయ 2. ఈ సందర్బంగా చిత్ర యూనిట్ హైదరాబాద్ లోని వెస్టిన్ హోటల్ లో ప్రి రిలీజ్ ఫంక్షన్ ను ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమానికి రాజ్యసభ సభ్యులు విజయంద్ర ప్రసాద్ గారు ,మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, సింగీతం శ్రీనివాసరావు గారు, టైగర్ నాగేశ్వరావు దర్శకుడు వంశీ కృష్ణ గారు, హీరోలు అడవి శేష్, సిద్దు జొన్నలగడ్డ తదితరులు ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా

ముఖ్య అతిధులుగా వచ్చిన సీనియర్ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు గారు మాట్లాడు..ఇండస్ట్రీ కి నేను వచ్చి 68 సంవత్సరాలు అవుతుంది.ఒక సినిమా ఫినిష్ అయ్యి ఈ సినిమాను మేము రిలీజ్ చేస్తున్నాము అన్నప్పుడు వచ్చే స్పిరిట్ వారికే పండగ.లాంటిది.. రోల్స్ రాయిస్ కార్లు ,బోయింగ్ విమానాలు డీటర్జంట్ పౌడర్స్ చేస్తారు వాటన్నిటికీ 100 డేస్ లేవు.ఫినిషింగ్ అఫ్ ద ప్రోడక్ట్ కు పండుగలేదు. వరల్డ్ లో ఒక్క సినిమా ఇండస్ట్రీ కి మాత్రమే ఎస్ మేము సినిమా కంప్లీట్ చేశాము అని పండగ చేసుకుంటున్నారు. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీ ఎన్నో ప్రాబ్లెమ్స్ ను పేస్ చేస్తుంది.ఫస్ట్ నేను మాయాబాజార్ సినిమాకు అసిస్టెంట్ గా జాయిన్ అయ్యాను.అప్పుడు కూడా ఫిలిం ఇండస్ట్రీ కు ఇలాంటి కష్టాలే వచ్చాయి.అయితే అప్పటి నుండి ఇప్పటివరకు ఇదే మాటలు వింటూనే ఉన్నాను.. ఫిలిం ఇండస్ట్రీ కు ఎన్ని కస్టాలు వచ్చినా తలొగ్గకుండా ఓవర్ కం చేసుకొని పో్తూనే ఉంది.ఇప్పుడూ అంతే.. ఈ సినిమా ట్రైలర్ చాలాబాగుంది. చాలా బాగా తీశారు. ఈ సినిమాకు పనిచేసిన టీం అందరికీ అల్ ద బెస్ట్ తెలుపుతూ ఈ నెల 13 న వస్తున్న ఈ సినిమా గొప్ప విజయం సాదించాలని అన్నారు.

 

ముఖ్య అతిధులుగా వచ్చిన రాజ్యసభ సభ్యులు విజయంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. మనసా వాచా కర్మణా చెపుతున్నా ఈ సినిమా టీజర్, ట్రైలర్ చాలా చాలా బాగుంది.ఈ నెల 13 న వస్తున్న “కార్తికేయ 2” సూపర్ హిట్ అవ్వడమే కాకుండా సౌత్ లో ఎంత కలెక్ట్ చేస్తుందో హిందీలో కూడా అంత కలెక్ట్ చేస్తుంది. నిఖిల్, అనుపమ లు అద్భుతంగా యాక్ట్ చేశారు.శ్రీనివాస్ రెడ్డి, హర్ష ఇలా ఈ సినిమాకు వర్క్ చేసిన టీం అందరికీ అల్ ద బెస్ట్. భైరవ మ్యూజిక్ బాగుంది. తను తన తండ్రి పేరు నిలబెట్టాడు.సింగీతం శ్రీనివాస్ గారు మాకు ఆదర్శం. తను ఇంకా మంచి మంచి సినిమాలు తియ్యాలి అని కోరుకుంటున్నాను అన్నారు.

ముఖ్య అతిధులుగా వచ్చిన మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. ఈ చిత్రం కొరకు హీరో నిఖిల్ , నిర్మాతలు టి.జి. విశ్వ‌ప్ర‌సాద్, అభిషేక్ అగ‌ర్వాల్, దర్శకుడు చందు వీరంతా సినిమా బాగా రావడం కొరకు చాలా కష్టపడ్డారు.ఈ మధ్య రిలీజ్ అయిన సినిమాలను ప్రేక్షకులు ఎలా ఆదరిస్తున్నారో ఈ నెల 13 న వస్తున్న “కార్తికేయ 2” సినిమాను కూడా అదే విధంగా ఆదరించాలి. దేశం నలుమూలలకు తెలిసేలా చేసిన బాహుబలి,ఆర్ ఆర్ ఆర్, సినిమాలు తెలుగు సినిమా గొప్పతనమేంటో రాజమౌళి గారు తీసి నిరూపించాడు .ఆ సినిమాలలాగే ఇప్పుడు వస్తున్న ఈ సినిమా కూడా బిగ్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. తెలంగాణ రాష్ట్రం చిన్న సినిమాలు తీసే వారికి సపోర్ట్ చేస్తుంది., మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలు తీసే వారికి థియేటర్స్ ప్రాబ్లమ్స్ వస్తే మా ప్రభుత్వం హెల్ప్ చేయడానికి ఎప్పుడూ ముందుంటుంది. ఈ సినిమాకు పని చేసిన వారందరికీ అల్ ద బెస్ట్ అన్నారు.

చిత్ర హీరో నిఖిల్ సిద్దార్థ మాట్లాడుతూ..మా సినిమాను, మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన పెద్దలందరికి ధన్యవాదాలు మా టీం అందరూ కార్తికేయ 2 కు రెండున్నర సంవత్సరాలనుండి కష్టపడ్డారు. రెండు ప్యాండమిక్స్ తరువాత వస్తుంది ఈ సినిమా. సింగీతం శ్రీనివాస్ గారి గురించి చెప్పాలి అంటే నా వయసు సరిపోదు. మైతలాజికల్ ఫిల్మ్స్, సైంటిఫిక్ సినిమాలు ఎప్పుడో తీశారు.వారిని చూసి నేను ఇన్స్పెయిర్ అయ్యాను .అలాగే విజయేంద్ర ప్రసాద్ గారి కలంతో, విజన్ తో మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నారు.కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు వస్తే ప్రేక్షకులు ఎప్పుడూ థియేటర్స్ కు తరలి వస్తారనేది ఈ మధ్య వచ్చిన సినిమాలే ఉదాహరణ. మా సినిమాకు డిస్ట్రిబ్యూటర్స్ మాకు సపోర్ట్ చేశారు. అనుపమతో వర్క్ చేయడం చాలా సంతోషంగా ఉంది. సురేష్ గారు అద్భుతమైన సెట్స్ వేశారు. కాల భైరవ మ్యూజిక్ అద్భుతంగా ఉంటాయి. చందు మొండేటి చాలా బాగా తీశాడు.మేము కృష్ణుడు కాన్సెప్ట్ ను సెలెక్ట్ చేసుకుని తీసిన మా సినిమాను ఇస్కాన్ ఆర్గనైజషన్ వారు ఓన్ చేసుకొని మమ్మల్ని మధుర కు పిలిచారు.అక్కడ బృందావనం టెంపుల్ లొ మా కార్తికేయ 2 టీజర్ ను రిలీజ్ చేసే అవకాశం కూడా కల్పించారు. వారికి మా ధన్యవాదాలు. కృష్ణుడి గురించి, మన ఇండియన్ కల్చర్ రూట్స్, మన ఇండియన్ హెరిటేజ్ గురించి ప్రేక్షకులకు తెలియ జేయాలనీ ఈ నెల 13 న ప్రేక్షకుల ముందుకు వస్తున్నాము. మమ్మల్ని, మా సినిమాను ఆదరించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

చిత్ర దర్శకుడు చందు మొండేటి మాట్లాడుతూ.. ఈ సినిమను 3 ఇయర్స్ పిల్లల నుండి 20 ఇయర్స్ పిల్లల వరకు ఎంత ఎక్కువమంది చూస్తే అంత మంచిది.వాళ్ళు చూడవలసిన సినిమా ఇది. ఎందుకంటే మన కల్చర్ గాని ,మన హేరేటేజ్ గానీ, రూట్స్ కానీ చాలా క్లియర్ గా తెలుస్తుంది. మన కృష్ణుడు, మన శివుడు, రాముడు గురించి మన రూట్స్ గురించి ఇప్పటి జనరేషన్ కు తెలియవు. నాకు చిన్నప్పటినుండి అమరచిత్ర కథలు రామాయణం, మహా భారతం కథలు చదివి పెరిగాను. అందుకే ఇప్పుడు ఇలాంటి సినిమా తియ్యగలిగాను.. నా ఫ్యామిలీ కూడా నాకు ఫుల్ సపోర్ట్ చెశారు . మన పురాణాల్లో ఇథిహాసాలో ఏవైతే చరిత్ర ఉందొ వాటన్నిటికీ ప్రాపర్ గా పవర్ ఫుల్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి ఈ చిత్రంలో కూడా అలాంటి ఫ్యాక్ట్స్ ఉంటాయి. అవన్నీ మనకు, భూమికి, అది దరిత్రికి, మన కల్చర్,మన హెరిటేజ్ కు ఉపయోగపడెవి. ఇలాంటివే మా సినిమాలో చెప్పడానికి ప్రయత్నించాము. నేను నిఖిల్ ఈ సినిమా కొరకు చాలా ట్రావెల్ చేశాము.. సినిమా బాగా వచ్చింది. నిన్నే మా నిర్మాత లు కూడా సినిమా చూశారు. ఈ నెల 13 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న మా సినిమాను ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

అతిదిగా వచ్చిన హీరో సిద్దు జొన్నలగడ్డ మాట్లాడుతూ.. ఫస్ట్ ఈ సినిమా ట్రైలర్ చూడగానే చాలా బాగా నచ్చింది.ట్రైలర్ లో తను పడవ మీద నుండి దూకే సీన్ నాకు బాగా నచ్చింది. విజువల్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి. క్యారెక్టర్స్ అన్ని ఫ్రెష్ గా ఆగుపిస్తాయి. ఒక వైపు హీరో అడవి శేషు థ్రిల్లర్స్, స్పై సినిమాలు చేస్తుంటే మరో వైపు నిఖిల్ సూపర్ న్యాచురల్, మైతలాజికల్ సినిమాలు చేస్తూ సక్సెస్ అవుతున్నారు. టెక్నీకల్ గా ఈ సినిమాకు మంచి టఫ్ ఉంది. టీజర్, ట్రైలర్ లతో దర్శక, నిర్మాతలు ఈ సినిమాను ఇంటర్నేషనల్ లెవెల్ కు తీసుకెళ్లారు. ఈ నెల 13 న వస్తున్న ఈ సినిమా గొప్ప విజయం సాదించాలి అన్నారు.

అతిదిగా వచ్చిన హీరో అడవి శేష్ మాట్లాడుతూ..ఈ సినిమా టీజర్, ట్రైలర్స్ ప్రతి ఒక్కరికీ రీచ్ అయ్యాయి. ఈ సినిమాకు బీబత్సమైన హైప్ ఏర్పడింది..ఈ సినిమా గొప్ప విజయం సాధిస్తుంది అన్నారు.

చిత్ర హీరోయిన్ అనుపమ మాట్లాడుతూ.. కార్తికేయసినిమాకు పాటు చిత్ర యూనిట్ అంతా చాలా కష్టపడ్డారు .. ఇలాంటి మైతలాజికల్ సినిమాలో నటించే మంచి అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదములు. కార్తీక్ గట్టమనేని మ్యూజిక్ బాగున్నాయి. అలాగే వి. యఫ్ ఎక్స్ చాలా బాగా వచ్చాయి. శ్రీనివాస్ రెడ్డి, వైవా హర్ష గారు అందరూ నాకు చాలా సపోర్ట్ చేశారు. ఈనెల 13 న రిలీజ్ అవుతున్న సినిమా కొరకు చాలా క్యూరియాసిటీ గా ఎదురు చూస్తున్నాను అన్నారు.

 

చిత్ర మ్యూజిక్ డైరెక్టర్ కాలభైరవ మాట్లాడుతూ.. ఈ సినిమాకు మ్యూజిక్ ఇంత బాగా రావడానికి నేను ఒక్కడినే కారణం కాదు టీం అంతా ఫుల్ సపోర్ట్ చెయ్యడంతో బాగా వచ్చింది.చేతన్ ప్రసాద్ గారు ఈ సినిమాలో చాలా క్రూసెల్ పాయింట్ లొ రాసిన కొన్ని వర్డ్స్ చాలా బాగా వర్క్అవుట్ అయ్యాయి.సాంగ్స్ కొరకు చేతన్ ప్రసాద్, రామ జోగయ్య శాస్రి, కృష్ణ గార్లకు చాలా థాంక్స్ సాంగ్స్ బ్యాక్ గ్రౌండ్, లిరిక్ పోర్షన్స్ ఇచ్చారు. వారందరికీ నా ధన్యవాదాలు.

నటుడు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ..మనిషి ఉన్నంతవరకు సినిమా ఉంటుంది అన్న గురువు సింగీతం శ్రీనివాసరావు గారికి నా ధన్యవాదాలు. దర్శకుడు చందు గారు ఈ సినిమాలో సధానంద్ అనే క్యారెక్టర్ ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది.మా హీరో నిఖిల్ కు షూటింగ్ లొ కాలు విరిగినా కూడా షూటింగ్ ఆగనియ్యకుండా ఈ సినిమాకోసం చాలా కష్టపడ్డాడు. అలాగే ఈ సినిమా అందరికి రీచ్ అవ్వాలని ఫుల్ ఎఫర్ట్ పెట్టి ఎక్కువ ప్రమోషన్ చేస్తున్నాడు.తన పడిన కష్టానికి తనతో పాటు మా అందరికీ మంచి ప్రతి ఫలం ఈ సినిమా ద్వారా దొరుకుతుంది.అనుపమ కూడా చాలా కష్టపడింది. కార్తీక్ ఘట్టమనేని విజువల్స్ బాగుంటాయి. ఈ నెలా13 న వస్తున్న ఈ సినిమాకు అందరూ థియేటర్ కు వచ్చి చూడాలని  మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరూ ఈ నెల 13 న వస్తున్న ఈ చిత్రం గొప్ప విజయం సాదించాలి అన్నారు.
.
నటీనటులు:
నిఖిల్, అనుపమ పరమేశ్వరన్, అనుపమ్ ఖేర్, శ్రీనివాస‌రెడ్డి, ప్ర‌వీణ్‌, ఆదిత్యా మీన‌న్‌, తుల‌సి, స‌త్య, వైవా హ‌ర్ష‌, వెంక‌ట్‌ తదితరులు

సాంకేతిక నిపుణులు :
క‌థ‌-స్క్రీన్‌ప్లే-ద‌ర్శ‌క‌త్యం – చందు మెుండేటి
బ్యాన‌ర్:  పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రి& అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్‌
కొ-ప్రొడ్యూస‌ర్: వివేక్ కూచిభొట్లనిర్మాత‌లు: టి.జి విశ్వ ప్ర‌సాద్‌&అభిషేక్ అగ‌ర్వాల్‌
మ్యూజిక్: కాలభైరవ
సినిమాటోగ్రాఫర్: కార్తీక్ ఘట్టమనేని
ఆర్ట్ డైరెక్టర్: సాహి సురేష్
పిఆర్ఓ: ఏలూరు శ్రీను, మేఘ శ్యామ్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here