Social message oriented ‘1948 Akhanda Bharath’ Movie Review

Cinemarangam.com
Review Rating.. 3/5
సినిమా : 1948 – అఖండ భారత్ ( మర్డర్ ఆఫ్ మహాత్మ అనునది ఉపశీర్షిక ).
చిత్రం విడుదల తేదీ – ఆగష్టు – 12 – 2022 .
చిత్ర నిడివి – 132 నిముషాలు ( 2 గంటల 12 నిముషాలు )
నిర్మాణ సంస్థ – ఎం .వై.ఎం క్రియేషన్స్
నిర్మాత: ఎమ్.వై.మహర్షి,
దర్శకత్వం: ఈశ్వర్ డి.బాబు!!
తారాగణం – డా.ఆర్య వర్ధన్ రాజ్, రఘనందన్, సమ్మెట గాంధీ, జెన్నీ, ఇంతియాజ్ ఆలీ, శరద్ దద్భవాల, సుహాస్, దుర్గాప్రసాద్, నవీన్ మాదాసు, నాగరాజు నన్నపనేని
తదితరులు .
కథ, కథనం, సంభాషణలు, గీత రచన – డా.ఆర్య వర్ధన్ రాజ్
సంగీతం – ప్రజ్వల్ క్రిష్
సినిమాటోగ్రఫీ – ఎస్ .ఆర్ .చంద్ర శేఖర్
నేపధ్య గానం – శశి ప్రీతం
కూర్పు – రాజు జాదేవ్

రోజూ మనం ఖర్చు పెట్టే నోటుపై ఉన్న గాంధీ గారిని అసలు ఎందుకు చంపారు అనేది ఎవ్వరికీ తెలియలేక పోతుంది. ఇప్పటికీ 74 సంవత్సరాలైనా కూడా ఒక వ్యక్తి మీద గాంధీజీ ని చంపిన మతోన్మాదుడనే నింద మోపబడింది. అయితే గాంధీ ని చంపడానికి గల కారణాలను,వాస్తవాన్నీ బయటకు రానివ్వలేదు.ఇప్పటికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయింది.ఇప్పటికైనా గోడ్సే ఫాక్ట్ ను ప్రేక్షకులకు తెలియజేయ్యాలని మహాత్మ గాంధీ హత్యపై పూర్తి స్థాయీ సమాచారంతో ,  యధార్థ వాస్తవాల ఆధారంగా నిర్మించిన చిత్రం 1948 – అఖండ భారత్ (మర్డర్ ఆఫ్ మహాత్మ అనునది ఉపశీర్షిక ). ఎమ్.వై.ఎమ్ క్రియేషన్స్ పతాకంపై డా.ఆర్య వర్ధన్ రాజ్, రఘనందన్, సమ్మెట గాంధీ, జెన్నీ, ఇంతియాజ్ ఆలీ, శరద్ దద్భవాల, సుహాస్, దుర్గాప్రసాద్, నవీన్ మాదాసు, నాగరాజు నన్నపనేని నటీ నటులుగా ఈశ్వర్ బాబు.డి  దర్శకత్వంలో సీనియర్ ప్రొడ్యూసర్ అండ్ డిస్ట్రిబ్యూటర్ ఎం.వై.మహర్షి నిర్మించిన చిత్రం ”1948-అఖండ భారత్ ”.ప్రపంచ వ్యాప్తంగా అన్ని భాషల్లో ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూ లో చూద్దాం పదండీ.

కథ
గాంధీహత్యకు 45 రోజుల ముందు నుండి జరిగిన యదార్ధ సంఘటనలూ ,గాంధీ హత్య ,హత్యానంతరం జరిగిన పరిణామాలు, నిందితుల గాలింపు, ఇన్వెస్టిగేషన్, ఇంట్రాగేషన్ మరియు నాథురాం గోడ్సే కోర్ట్ వాదన, గోడ్సే ఉరితీత ,కోర్ట్ వాఘ్మూలాన్ని నిషేధించడం, అప్పటి ప్రభుత్వపు నాటకీయ పరిణామాల నేపథ్యంతో ఈ కథ ముడిపడివుంటుంది. ముస్లిమ్స్ భారత్ లో బానిసలుగా మారకూడదని పట్టుబట్టి పాకిస్తాన్ కు స్వతంత్రం కావాలని మహమ్మద్ జిన్నా పట్టుబట్టడంతో భారతదేశం రెండు ముక్కలు అవుతుంది.ఆ తరువాత కూడా పాకిస్తాన్ కు 55 కోట్ల ఫండ్ రిలీజ్ చెయ్యాలని మహమ్మద్ జిన్నా కోరతాడు. ఇండియా పాకిస్తాన్ విభజనతో ఎంతో మంది తమ ఆస్తులను కోల్పోయిన కొంతమంది భారతీయ కాందీశీకులు మాకు న్యాయం చేయకుండా పాకిస్తాన్ కు న్యాయం చేస్తున్నారని గాంధీ డౌన్ డౌన్ అని నిరసనలు వ్యక్తం చేస్తారు. అయితే భారత దేశం సంపన్న దేశం పాకిస్తాన్ కు డబ్బులు ఇచ్చి పంపాలని అప్పటి వైష్రాయ్ కు లేఖ రాసి దీక్ష ప్రారంభించిస్తాడు.ఈ దీక్షలో గాంధీ గారి ఆరోగ్యం క్షీ ణించడంతో ఆ తరువాత గాంధీ కోరిక మేరకు భారత్ నుండి 55 కోట్లు పాకిస్తాన్ కు రిలీజ్ చేస్తారు.120 గంటల 30 నిముషాల తరువాత తన దీక్షను విరామిస్తాడు గాంధీ .దాంతో గాంధీ భారతీయులను తప్పుదోవ పట్టిస్తున్న విషయం ప్రజలకు తెలియజేప్పాలని గాంధీని ఇలాగే వదిలేస్తే దేశ భవిష్యత్తు కు ముప్పు వాటిల్లుతుందని. దేశ భవిష్యత్తు ను కాపాడాలని.. మంచి ఫ్రెండ్స్ గా ఉన్న నాదూరాం గోడ్సే, నారాయణ ఆప్టే లు ఒక్కటై అగ్రణి పత్రికను స్టార్ట్ చేస్తారు.ఈ పత్రికను నాదూరాం గోడ్సే తమ్ముడు గోపాల్ గాడ్సే ప్రింటింగ్ ప్రెస్ లో ప్రింట్ చేస్తుంటారు.మరో వైపు హింధువులను రక్షించడం కొరకు లాడ్జ్ లో కొన్ని ఆయుధాలు పెడితే పోలీసులు తనికీ చేసి ఆయుధాలను స్వాధీనము చేసుకుంటారు. వారు గోడ్సే తో చేతులు కలుపుతారు. ఆ తరువాత గాంధీని ఎవరు చంపారు అన్నది అందరికి తెలుసు, కానీ , ఎందుకు ? ఏ పరిస్థితుల్లో చంపాల్సి వచ్చింది ? దానికి గల కారణాలు ఏంటి ? అనే విషయాలు తెలుసుకోవాలి అంటే సినిమా చూడాల్సిందే?

నటీ నటుల పనితీరు

గాంధీగా రఘనందన్ చాలా చక్కగా నటించాడు , నాథురాం గాడ్సే గా డా. ఆర్యవర్ధన్ రాజ్ చక్కటి హావ బావాలు  పలికించాడు అభ్యుదయ బావాలు కలిగిన యువకుడిగా చాలా చక్కగా నటించాడు , సర్ధార్ వల్లభాయ్ పటేల్ గా శరద్ దద్భావల, నెహ్రుగా ఇంతియాజ్ అలీ , జిన్నాగా జెన్నీ, అబ్దుల్ గఫర్ ఖాన్ గా సమ్మెట గాంధీ , విష్ణు కర్కరే గా సుహాస్, నారాయణ ఆప్టే గా దుర్గాప్రసాద్, మదన్ లాల్ పహ్వ గా నవీన్ మాదాసు డా .పర్చూరేయ్ గా నాగరాజు నన్నపనేని ఇలా ప్రతి ఒక్కరూ వారికిచ్చిన పాత్రలకు ప్రాణం పెట్టి అద్భుతంగా నటించారు. వీరే కాక ఇంకా ఈ సినిమాలో నటించిన వారందరూ తమకిచ్చిన పాత్రలకు న్యాయం చేశారు అని చెప్పవచ్చు.

సాంకేతిక నిపుణుల పనితీరు
గాంధీ హత్య కు గల పరిణామాల నేపధ్యంలో ఈ చిత్రం తెరకెక్కింది , గాడ్సే కోణం వెలుగులోకి రాకుండా దాచిపెట్టిన ఎన్నో విషయాలను వివాదాలకు తావులేని రీతిలో- మరుగున పడిపోయిన వాస్తవాలు వెలికి తీయడమే లక్ష్యంగా “1948 – అఖండ భారత్” చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిష్పక్షపాతంగా తెరకెక్కించారు చిత్ర దర్శకుడు ఈశ్వర్ బాబు. గాంధీ ది .హత్య కాదు వధ అన్నది “గాడ్సే”వాదుల వాదన!!గాంధీని గోడ్సే చేసింది హత్య కాదని, దేశ విశాల ప్రయోజనాల కోసం చేసిన వధగా భావించేవారు ఇప్పటికీ ఉన్నారని చెప్పవచ్చు.ఈ చిత్రాన్ని ఉన్నత ప్రమాణాలతో ప్రతిష్టాత్మక చిత్రంగా నిలవాలని అందరూ ఈ చిత్రం కోసం ప్రాణం పెట్టి తెరకెక్కించారని చెప్పవచ్చు. “గాంధీజీని చంపాల్సి రావడానికి గల కారణాలు ఏమిటి? అనే విషయాలు చాలామందికి తెలియవు. అయితే గాడ్సే తన కోర్టు వాదనలో గాంధీజీని వధించడానికి గల కారణాలను సుమారు 150 పాయింట్స్ గా.. 5 గంటలపాటు సుదీర్ఘంగా వివరించినా… అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని కోర్ట్ నుంచి బైటికి రానివ్వకుండా నిషేధించింది.అతి కిరాతకంగా గోడ్సే శవాన్ని ,దహనం చేసిన ప్రదేశం సైతం ఎవ్వరికి తెలీకుండా అతని చరిత్రని ముగించడం కోసం చేసిన కుట్రలూ ,అతని ప్రతిష్టని దిగజార్చిడానికి పన్నిన కుటిల రాజకీయాల నేపథ్యంలో గత 74 సంవత్సరాలుగా దాచిపెట్టబడిన నిజాలను వెలికితీసే అంశాలతో అల్లుకున్నటువంటి చారిత్రాత్మక కథను చాలా చక్కగా మలిచారు. గాడ్సేని ఉరి తీసిన సుమారు 30 సంవత్సరాల తర్వాత… ఆయన కోర్ట్ లో ఇచ్చిన వాగ్మూలం బయటకు వచ్చినా- దాన్ని కూడా ప్రచురణ కాకుండా అడ్డుకున్నారు.. హైదరాబాద్ లో ఉన్న సెన్సార్ బోర్డ్…ఈ సినిమా సెన్సార్ చేయడానికి నిరాకరిస్తే… ముంబైలో సెన్సార్ చేయించడం జరిగింది. గాంధీని చంపే సమయంలో ని పాటను గులాబీ ఫేమ్ శశి ప్రీతం స్వరపరచి ఆలపించిన గీతం ఎమోషన్ కు గురి చేస్తుంది..సంగీత దర్శకుడు ప్రజ్వల క్రిష్, అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు, రాజు జాదవ్ ఎడిటింగ్ పని తీరు బాగుంది .కథ, కథనం, సంభాషణలు, గీత రచన ఇవన్నీ చక్కగా కుదిరేలా డా.ఆర్య వర్ధన్ రాజ్ బాగా రాసుకున్నాడు.
ఎస్ .ఆర్ .చంద్ర శేఖర్ సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికి హైలెట్ గా నిలుస్తుంది.ఎం .వై.ఎం క్రియేషన్స్ పతాకంపై నిర్మాతలు ఎమ్.వై. మహర్షి చాలా చక్కటి కథను సెలెక్ట్ చేసుకొని నిర్మించారు. నేటి యువత‌ను ఆలోచింప జేస్తూనే, అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే ఎంటర్‌టైన్‌మెంట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రాన్ని నమ్మి థియేట‌ర్ కు వచ్చిన ప్రతి ప్రేక్షకుడిని నిరుత్సాహ పరచకుండా అందరినీ “1948 అఖండ భారత్ ” కచ్చితంగా ఎంట‌ర్ టైన్ చేస్తుంది అని చెప్పవచ్చు.

Cinemarangam. com..Rating 3/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here