Hero Adi Saikumar’s Out and Out Commercial Entertainer ‘Tees Maar Khan’ Review

Cinemarangam.com
Review Rating.. 3/5
సినిమా : “తీస్ మార్ ఖాన్”
బ్యానర్ : విజన్ సినిమాస్
ప్రొడ్యూసర్ : నాగం తిరుపతి రెడ్డి
ఎగ్జిక్యూటివ్  ప్రొడ్యూసర్ :  యాళ్ల తిర్మల్ రెడ్డి
డైరెక్టర్ : కళ్యాణ్ జి గోగణ
నటీ నటులు: ఆది సాయి కుమార్, పాయల్ రాజ్ పుత్,సునీల్, శ్రీకాంత్ అయ్యంగార్, అనూప్ సింగ్ ఠాకూర్, కబీర్ సింగ్, పూర్ణ తదితరులు.
మ్యూజిక్ : సాయి కార్తీక్
ఎడిటర్ : మణికాంత్
సినిమాటోగ్రాఫర్: బాల్ రెడ్డి
పీఆర్వో : సాయి సతీష్ , పర్వతనేని రాంబాబు

స్టూడెంట్, రౌడీ, పోలీస్ గా మూడు వేరియేషన్స్ ఉన్న పాత్రలో ఆది సాయికుమార్ హీరో గా నటిస్తున్న తాజా చిత్రం “తీస్ మార్ ఖాన్”. విజన్ సినిమాస్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెంబర్ 3 గా ప్రముఖ వ్యాపారవేత్త డా.నాగం తిరుపతి రెడ్డి  ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇందులో ఆది సాయికుమార్ హీరోగా పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. నాటకం వంటి విభిన్న కథాంశంతో కూడుకున్న చిత్రాన్ని తెరకెక్కించి ప్రేక్షకులను అలరించిన దర్శకుడు కళ్యాణ్ జి గోగణ దర్శకత్వంలో ఈ మూవీ రూపొందింది. ఇప్పటికే విడుదల చేసిన టీజర్, పోస్టర్స్ సినిమా పట్ల ఆసక్తి పెంచాయి. ఈ చిత్రం ఆగస్ట్ 19న గ్రాండ్ గా థియేటర్స్ లలో విడుదల అయిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏమాత్రం ఎంటర్ టైన్ చేసిందో చూద్దాం పదండి.

కథ:
తీస్ మార్ ఖాన్ (ఆది సాయికుమార్) చిన్నతనంలోనే ఇంట్లో నుంచి బయటకు వచ్చేస్తాడు. అతనికి మరో అమ్మాయి (హీరోయిన్ పూర్ణ) తోడవుతుంది. ఇలా ఇద్దరూ ఎంతో అన్యోన్యంగా పెరిగి పెద్దవారైన తరువాత ఆమెను తీస్ మార్ ఖాన్… అమ్మగా చూసుకుంటాడు. పూర్ణని చక్రి (సునీల్) వివాహం చేసుకుంటారు. ఇలా ముగ్గురు అన్యోన్యంగా జీవనం సాగిస్తూ ఉంటారు. ఒకరోజు అనుకోకుండా ప్రమాదంలో వున్న హోమ్ మినిస్టర్ రంగరాజన్(శ్రీకాంత్ అయ్యంగార్) ప్రాణాలను తీస్ మార్ ఖాన్ కాపాడుతాడు. దాంతో విలన్ జీజా (అనూప్ సింగ్ టాకూర్)కి తీస్ మార్ ఖాన్ తో శత్రుత్వం పెంచుకొని తీస్ మార్ ఖాన్ ప్రేమించిన అమ్మాయి పాయల్ రాజ్ పుత్ ఉన్నపుడు వీరిపై దాడి చేయించి పోలీసులచే అరెస్ట్ చేయించి జైల్లో పెట్టిస్తాడు. విలన్ బీజా పోలీస్ స్టేషన్ కు వచ్చి నువ్వు నా జోలికి వచ్చావ్ ఇంకనుండి నువ్వు సంతోషంగా ఎలా ఉంటావో చూస్తాను అని బెదిరించి పోలీసులకు వదిలెయ్యమని చెప్పి వెళతాడు.ఇంటికి వెళ్ళగానే అమ్మగా భావించే పూర్ణ చంపబడుతుంది.విలన్ జిజానే ఆమెను చంపాడని చక్రి చెప్పడంతో…ఆవేశంగా వెళ్లిన తీస్ మార్ ఖాన్ జీజాని చంపేస్తాడు. అయితే జిజా చనిపోయే ముందు మీ అమ్మను తాను చంపలేదని చెప్పి చనిపోతాడు . మరి అమ్మగా భావించే పూర్ణను చంపింది ఎవరు? ఎందుకు చంపారు? రౌడీ గా ఉన్న ఆది పోలీస్ ఎలా అయ్యాడు? అనేదే తెలుసుకోవాలంటే థియేటర్ కు వెళ్లి సినిమా చూడవలసిందే..

నటీ నటుల పనితీరు
కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలు, థ్రిల్లర్ సినిమాలు కామెడీ ఎంటర్టైనర్ సినిమాలు చేసిన ఆది పక్కా అవుట్ అండ్ అవుట్ కమర్సియల్ సినిమాలు చేసి చాలా రోజులు అయ్యింది అని చెప్పవచ్చు. ఈ సినిమాలో స్టూడెంట్, రౌడీ, పోలీస్ గా మూడు వేరియేషన్స్ ఉన్న తీస్ మార్ ఖాన్ (ఆది సాయికుమార్) ఇందులో కొత్తగా కనిపిస్తాడు. మూడు పాత్రలలో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా పోలీస్ పాత్రలో మాస్ బాగా ఎంటర్ టైన్ చేశాడు. అతనికి జోడీ గా నటించిన పాయాల్ పాత్ర గురించి పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. పాటలకు మాత్రమే అన్నట్టుంది ఆమె క్యారక్టర్. హోమ్ మినిస్టర్ పాత్రలో శ్రీకాంత్ అయ్యంగార్ పాత్ర ఆకట్టుకుంటుంది. అనూప్ సింగ్ టాకుర్ ఎప్పటి లాగే విలనిజం చూపించారు. ఇక కమెడియన్ కమ్ హీరో సునీల్ పాత్రకి కూడా ఇంపార్టెన్స్ వున్నదే.ఎప్పుడూ చూడని సునీల్ గారిని ఈ సినిమాలో చూస్తారు. కబీర్ దుల్హన్ సింగ్ పాత్ర పర్వాలేదు.

సాంకేతిక నిపుణుల పనితీరు
పక్కాగా కంటెంట్, మరియు కమర్సియల్ ను మిక్స్ చేసి తీసిన సినిమా “తీస్ మార్ ఖాన్” అది సాయికుమార్ ఇప్పటి వరకు మాస్ ఎంటర్టైనర్ చిత్రాలలో నటించి ఇటు దక్షిణాదిన… అటు ఉత్తరాదిన మంచి మార్కెట్ సంపాదించుకున్నాడు.. ఇప్పుడు తీస్ మార్ ఖాన్ కూడా అలాంటి మాస్ ఎంటర్టైనర్ గా అలరించాలని దర్శకుడు భావించి… ఈ కథని సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఫుల్ మాస్ ఎలిమెంట్స్ కి ఓ చిన్న ట్విస్ట్ ని జోడించి… ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేసారు.ఇందులో దర్శకుడు ఎంచుకున్న పాయింట్ బాగుంది. . ఫస్ట్ హాఫ్ లో ఆది సాయికుమార్ ని జిమ్ ట్రైనర్ గా, స్టూడెంట్ గా చూపించి… సెకెండ్ హాఫ్ లో పోలీస్ ఆఫీసర్ పాత్రలో రౌడీల పని పట్టే సీన్స్ తో అలరించాడు. పూర్ణ మీద రాసుకున్న ట్విస్ట్ బాగా వర్క్ అవుట్ అయింది. ఇంటర్వెల్ తరువాత వచ్చే పాయల్ రాజ్ పుత్ సాంగ్, చివర్లో వచ్చే ఐటెం సాంగ్ అన్నీ ఆడియెన్స్ ను అలరిస్తాయి.సాయి కార్తీక్ అద్భుతమైన మ్యూజిక్ తో పాటు సాలీడ్ బ్యాగ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు. వెన్నెల కంటి గారి అబ్బాయి రాకేంద్ మౌలి ఇచ్చిన లిరిక్స్ బాగానే ఉన్నాయి తను నాలుగు పాటలు రాయగా , భాస్కరపట్ల ఒక పాట రాశాడు. ఇందులో ఉన్న పాటలన్నీ బాగున్నాయి.డి. ఓ. పి. బాల్ రెడ్డి మంచి విజువల్స్ ఇచ్చారు.మణికాంత్ ఎడిటింగ్ చాలా గ్రిప్పింగ్ గా ఉంది.విజన్ సినిమాస్ పతాకంపై
నిర్మాత డా..నాగం తిరుపతి రెడ్డి గారు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించిన నిర్మాణ విలువలు రిచ్ గా ఉన్నాయి. మొత్తానికి “తీస్ మార్ ఖాన్” సినిమా ఫుల్ పవర్ ప్యాక్డ్ సినిమా

Cinemarangam.com.. Review Rating.. 3/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here