Director Guru Pawan interview about ‘Nachhindhi Girl Friendu’ Movie

ఉదయ్ శంకర్ హీరోగా నటిస్తున్న సినిమా నచ్చింది గాళ్ ఫ్రెండూ. జెన్నీ నాయికగా నటిస్తోంది. శ్రీరామ్ ఆర్ట్స్ బ్యానర్ పై అట్లూరి ఆర్ సౌజన్య సమర్పణలో.. అట్లూరి నారాయణ రావు నిర్మిస్తున్నారు. గురు పవన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ఈ నెల 11న రిలీజ్ అవుతున్న చిత్ర విశేషాలను తాజా ఇంటర్వ్యూలో తెలిపారు దర్శకుడు గురు పవన్.

నా మొదటి సినిమా ఇదే మా కథ. శ్రీకాంత్, భూమిక, సుమంత్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఆ సినిమా విడుదలైన వెంటనే ఈ ప్రాజెక్ట్ మొదలుపెట్టాం. ఉదయ్ శంకర్ గతంలో మంచి మూవీస్ చేశారు. ఆటగదరా శివ, మిస్ మ్యాచ్ వంటి చిత్రాలు ఆయన నట ప్రతిభ చూపించాయి. ఈ సినిమా కూడా ఉదయ్ కెరీర్ లో ఓ డిఫరెంట్ మూవీ అవుతుంది.

వైజాగ్ నేపథ్యంగా థ్రిల్లర్ ఎలిమెంట్ తో సాగే లవ్ స్టోరి ఇది. సినిమాలో ఆహ్లాదకరమైన ప్రేమ కథతో పాటు ఆసక్తిని పంచే థ్రిల్లింగ్ అంశాలుంటాయి. రోడ్ జర్నీ మూవీ అని కూడా చెప్పొచ్చు. ఈ చిత్రంలో ఉదయ్ క్యారెక్టర్ ఏంటంటే, తను ఎవరైనా అమ్మాయిని ఇష్టపడితే ఆమెను ప్రేమలో పడేస్తాడు. హీరోయిన్ ను ట్రాఫిక్ లో చూసి తనను ఛేజ్ చేసి లవ్ చేసేలా చేస్తాడు. ఈ క్యారెక్టర్ లో తన నటన ఆకట్టుకుంటుంది.

హీరోయిన్ జెన్నీఫర్ ఇమ్మానుయేల్ గతంలో ఓ చిన్న సినిమాలో నటించింది కానీ ఇది తనకు రియల్ డెబ్యూ అనుకోవచ్చు. తన పాత్రకు తగినట్లు ఎలా చెబితే అలా నటించింది. రోడ్ జర్నీ షూట్ లో ఎండలో కష్టపడింది. ఏ రోజూ షూటింగ్ విషయంలో ఇబ్బంది పెట్టలేదు. కొత్త అమ్మాయి అయినా ఆమెకు ఈ సినిమాతో మంచి పేరొస్తుంది.

ఈ సినిమాలో ఇప్పటిదాకా తెరపై చూడని ఒక అంశాన్ని చెప్పబోతున్నాం. మనందరి ఫోన్స్ లో ఇన్వెస్ట్ మెంట్స్ యాప్స్ ఉంటాయి. వాటి ద్వారా ఒక తప్పు జరిగితే దేశవ్యాప్తంగా ఎంతమంది నష్టపోతారు. వారిని సమస్య నుంచి హీరో ఎలా బయటపడేశాడు అనేది ఆసక్తికరంగా ఉంటుంది. ఇన్వెస్ట్ మెంట్ యాప్ సమస్యను ఒక సూపర్ హీరోలా కాకుండా సాధారణ వ్యక్తిగా తనకున్న ప్రతిభతో పరిష్కరిస్తాడు. దేశంలో జరిగిన ఈ పెద్ద ఘటన నేపథ్యాన్ని ప్రేమ కథకు ముడిపెట్టాం.

సినిమాలో శ్రీకాంత్ అయ్యంగార్, మధునందన్ పాత్రలు కీలకంగా ఉంటాయి. వారు తమ బెస్ట్ పర్మార్మెన్స్ ఇచ్చారు. ఈ కథను అనుకున్నది అనుకున్నట్లుగా తెరపైకి తీసుకొచ్చేందుకు నిర్మాత అట్లూరి నారాయణ రావు గారి సపోర్ట్ ఎంతో ఉంది. ఏ రోజూ మా టీమ్ లోని ఎవరికీ ఇబ్బంది రాకుండా చూసుకుంది. మ్యూజిక్, సినిమాటోగ్రఫీ విషయాల్లో సినిమా ఉన్నతంగా ఉంటుంది. సిద్ధం మనోహర్ సినిమాటోగ్రఫీ, గిఫ్టన్ మ్యూజిక్ హైలైట్ అవుతాయి. మంచి పాటలు, నేపథ్య సంగీతం ఇచ్చారు గిఫ్టన్. ఈనెల 11న మీ ముందుకొస్తున్నాం. థ్రిల్లింగ్ లవ్ స్టోరీగా మిమ్మల్ని ఆకట్టుకుంటుంది.

నటీ నటులు: ఉదయ్ శంకర్, జన్నీఫర్ ఇమ్మానుయేల్, సీనియర్ హీరో సుమన్, మధునందన్, పృధ్వీరాజ్, శ్రీకాంత్ అయ్యాంగార్, సనా, కళ్యాణ్ తదితరులు

సాంకేతక వర్గం: సినిమాటోగ్రఫీ : సిద్దం మనోహార్, మ్యూజిక్: గిఫ్టన్, ఎడిటర్: జునాయిద్ సిద్దిఖి, ఆర్ట్: దొలూరి నారాయణ, పి.ఆర్.ఓ: జియస్ కె మీడియా, నిర్మాత : అట్లూరి నారాయణ రావు, దర్శకత్వం : గురు పవన్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here