Director Sr Thirupathi Interview for Utthara Movie

నిమ్మల శ్రీరామ్, కారుణ్య కత్రేన్ జంటగా తిరుపతి యస్ ఆర్ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘ఉత్తర’.కొన్ని కథలు కొన్నిజ్ఞాపకాలను గుర్తుకు తెస్తాయి. వాటిలోని స్వచ్ఛదనం ప్రేక్షకుల్ని కట్టి పడేస్తుంది.అలాంటి కథే ఉత్తర. తెలంగాణా సొగసును తెరమీద ఆవిష్కరించిన ఈ మూవీ ప్రేక్షకుల్ని అలరించేందుకు జనవరి 3 రాబోతున్న ఈ చిత్ర విడుదల నేపథ్యంలో దర్శకుడు తిరుపతి ఎస్ ఆర్ మీడియా సమావేశంలో పాల్గొని చిత్ర విశేషాలు పంచుకున్నారు.

అసలు ఉత్తర అర్థం ఏమిటీ?
ఉత్తర అనేది ఒక అమ్మాయి పేరు. ఎటువంటి తోడులేని ఉత్తర అనే ఒక అమ్మాయి కథ ఇది. అలా అని చిత్రం మొత్తం ఆమె చుట్టూ తిరగదు.

అచ్చమైన తెలంగాణా స్లాంగ్ వాడినట్టున్నారు?
ఈ సినిమా మొత్తం తెలంగాణా పల్లె వాతావరణంలో నడుస్తుంది. అందుకే నేటివిటీకి తగ్గట్టుగా టిపికల్ తెలంగాణా స్లాంగ్ వాడటం జరిగింది. అసలు కొన్ని పదాలు అర్థం కాకపోవచ్చు. అయినప్పటికీ ప్రేక్షకులకు నవ్వు తెప్పిస్తాయి.

ఉత్తర సినిమా మీరే రాసుకున్నారా?
ఈ సినిమా కథ నేనే స్వయంగా రాసుకున్నాను. డైలాగ్స్ మాత్రం శివ కళ్యాణ్ అనే ఓ నూతన రైటర్ రాశారు.

అసలు మీ నేపథ్యం ఏమిటీ?
నాకు ఇదే మొదటి సినిమా . గతంలో ప్రజాస్వామ్యంలో , జాడ, ముద్ద బంతి అనే షార్ట్ ఫిలిమ్స్ తెరకెక్కించాను. వాటిలో జాడ షార్ట్ ఫిల్మ్ కి నేషనల్ అవార్డు వచ్చింది. షార్ట్ ఫిల్మ్ తీసేటప్పుడే మూవీ ఎలా తీయాలి, వంటి అనేక విషయాలు నేర్చుకున్నాను.
అసలు ఈ సినిమా దేని గురించి?
ఒంటరిగా ఉన్న ఒక అమ్మాయి పట్ల సొసైటీ ప్రవర్తించే తీరు ఎలా ఉంటుంది. ఆ ఆడపిల్ల పేస్ చేసే ఒడిడుకులు ఏమిటనేవి కొంచెం ఎంటర్టైనింగ్ చెప్పడం జరిగింది. మా మూవీ వాస్తవానికి దగ్గరగా ప్రేక్షకుడిని పల్లె వాతావరణంలోకి తీసుకు వెళుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here