Love & Family Entertainer ‘Leharayi’ Movie Review

Cinemarangam. Com
చిత్రం: లెహరాయి
విడుదల తేదీ : డిసెంబర్ 09, 2022
రివ్యూ రేటింగ్ : 3/5
సమర్పణ : బెక్కం వేణుగోపాల్
బ్యానర్ : ఎస్. ఎల్.ఎస్ మూవీస్
నిర్మాత: మద్దిరెడ్డి శ్రీనివాస్
దర్శకుడు : రామకృష్ణ పరమహంస
నటీనటులు: రంజిత్ సొమ్మి, సౌమ్య మీనన్, రావు రమేష్, అలీ, నరేష్, సత్యం రాజేష్ తదితరులు
సంగీత దర్శకులు: ఘంటాడి కృష్ణ
సినిమాటోగ్రఫీ: ఎంఎన్ బాలరెడ్డి
ఎడిటర్: ప్రవీణ్ పూడి
పి ఆర్ ఓ : ఏలూరు శీను, మేఘశ్యామ్

తెలుగు చిత్ర పరిశ్రమలో వరుస విజయాలతో తనకంటూ ఓ ప్రత్యేక క్రేజ్ తెచ్చుకున్న నిర్మాత బెక్కం వేణుగోపాల్ సమర్పణలో ఎస్. ఎల్.ఎస్ మూవీస్ పతాకంపై యంగ్ ట్యాలెంటెడ్ హీరో రంజిత్, సౌమ్య మీనన్ హీరో హీరోయిన్స్ గా, ధ‌ర్మ‌పురి ఫేం గగన్ విహారి, రావు రమేష్, సీనియర్ నరేష్,అలీ నటీనటులుగా రామకృష్ణ పరమహంసని ద‌ర్శ‌కుడి గా ప‌రిచ‌యం చేస్తూ మద్దిరెడ్డి శ్రీనివాస్ నిర్మించారు.ఈ చిత్రంలో మంచి ఫీల్ వున్న 7 పాటలు ఉండడం విశేషం. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుద‌లైన గుప్పెడంత సాంగ్,“బేబీ ఒసేయ్ బేబీ” సాంగ్,అప్సర అప్సర సాంగ్స్, చెప్పకు రా మామ నువ్వు చెప్పకు సారీ, ప్రేమ ఊబిలో మునిగి నిన్ను మరచి పోయా వంటి పాటలు మిలియ‌న్ వ్యూస్ తెచ్చుకున్నాయి ఈ సాంగ్స్ తో మంచి అంచనాలను క్రియేట్ చేసిన ఈ చిత్రం నేడు డిసెంబర్ 9 న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన “లెహరాయి” చిత్రం ఏ మేరకు ఆకట్టుకుందో రివ్యూ లో చూద్దాం పదండి..


కథ:
డాక్టర్ వృత్తిలో ఉన్న పురుషోత్తం (రావు రమేష్) కి కూతురు మేఘన (సౌమ్య మీనన్‌). చిన్నప్పుడు నుంచి చాలా పర్ఫెక్ట్ గా పెరిగినటువంటి అమ్మాయి. ఓ రోజు ఓ అమ్మాయి ప్రేమలో విఫలం అయి ఆత్మహత్య చేసుకుంటుంది. ఆ ఘటనకి చలించిపోయిన రావు రమేష్‌ తన కూతురు వలన తనకు అలాంటి పరిస్థితి రాకూడదని కూతురితో ప్రామిస్ చేయించుకుంటాడు. మేఘన తన తండ్రైన పురుషోత్తంకి తన లైఫ్ లో ఎవరినీ ప్రేమించను అని మాట ఇస్తుంది. కానీ ఊహించని విధంగా కార్తీక్(రంజిత్ సొమ్మి) కి ఆమె ప్రపోజ్ చేస్తుంది. అయితే ఆమె ఎందుకు అతనికి ప్రపోజ్ చేయాల్సి వస్తుంది? సౌమ్య, రంజిత్‌ ప్రేమ ఎలాంటి మలుపులు తిరిగింది, మొదట్లో ఆత్మహత్య చేసుకున్న అమ్మాయికి, రంజిత్‌కి ఉన్న సంబంధం ఏంటి? అనేది మిగిలిన కథ.


నటీ నటుల పని తీరు
ఈ మూవీలో రంజిత్, సౌమ్య చాలా బాగా పెర్ఫార్మన్స్ చేశారు.వీరిద్దరి జోడీ చాలా క్యూట్ గా ఉంది. హీరోయిన్‌ తండ్రిగా రావు రమేష్‌, హీరో తండ్రిగా నరేష్‌ నటన గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. గగన్‌ విహారీ నెగటివ్‌ షేడ్‌ పాత్రలో ఆకట్టుకున్నాడు. రాంప్రసాద్‌, సత్యం రాజేష్‌, అలీ కామెడీ బాగా వర్కౌట్ అయింది. ఇంకా ఈ చిత్రంలో నటించిన వారందరూ వారికిచ్చిన పాత్రలకు న్యాయం చేశారని చెప్పవచ్చు..

సాంకేతిక నిపుణుల పని తీరు
డైరెక్టర్ రామకృష్ణ పరమహంస గారికి ఇది మొదటి సినిమా అయినా ఓ రెగ్యూలర్‌ స్టోరీని తీసుకుని చాలా వరకు బోర్‌ ఫీలింగ్‌ లేకుండా తండ్రి కూతుళ్ల మధ్య అనుబంధాన్ని చాలా చక్కగా తెరకెక్కించాడు. అందరికీ నచ్చే విధంగా తెరకెక్కిన ఈ చిత్రంలో చక్కని ఫ్యామిలీ ఎలిమెంట్స్ తో పాటు లవ్, రొమాన్స్, సెంటిమెంట్ తో కూడుకున్న పక్కా కమర్షియల్ చిత్రంగా దీనిని చెప్పొచ్చు. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా తెరకెక్కించిన తీరు, దాన్ని నడిపించిన విధానంలో దర్శకుడు చాలా వరకు సక్సెస్‌ అయ్యాడని చెప్పొచ్చు. ఫస్టాఫ్ తో పోలిస్తే సెకండాఫ్ లో కథ కాస్త ఇంట్రెస్ట్ గా మారుతుంది. బీఎన్‌ బాల్‌ రెడ్డి కెమెరా వర్క్ బాగుంది. విజువల్స్ కలర్‌ ఫుల్‌గా ఉన్నాయి. జీకే(ఘంటాడి కృష్ణ) మ్యూజిక్‌ సినిమాకి పెద్ద ప్లస్‌. పాటలు, బీజీఎం ఆకట్టుకున్నాయి. బెక్కం వేణుగోపాల్ సమర్పణలో ఎస్. ఎల్.ఎస్ మూవీస్ పతాకంపై మద్దిరెడ్డి శ్రీనివాస్ నిర్మించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. ఈ సినిమాలో హీరో హీరోయిన్ల కెమిస్ట్రీ మ్యూజిక్, స్క్రీన్ ప్లే,సెంటిమెంట్ ఇలా అన్ని వర్గాల వారిని అలరించే విధంగా తెరకెక్కిన ఒక చక్కటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రం “లెహరాయి”. ఈ సినిమా చూసిన ప్రతి ప్రేక్షకుడు మంచి సినిమా చూశామనే ఫీలింగ్ తో బయటకు వస్తాడని చెప్పవచ్చు

Cinemarangam. Com Review Rating.. 3/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here