‘Aarohi Sewing Enterprises’ promotional add released by Heroine Nandita Sweta

తరాలు ఎన్ని మారినా కొత్త పోకడలు ఎన్ని వచ్చినా కుట్టుమిషన్ లేని జీవితం ఊహించలేము.మొదట్లో కుట్టు పని అంతా చేతితోనే జరిగేది. కుట్టు మిషన్ కనిపెట్టిన తరువాత చాలామంది జీవితాలు ఎంతో సుఖమయమయ్యాయి. ఇప్పుడు ప్రతి ఒక్కరికీ కుట్టు మిషన్ ఎంతో ఆవసరం. బట్టలు కుట్టించుకోవాలి అన్నా.. రెడీమేడ్ గా తీసుకున్న బట్టల సైజ్ చేయింజ్ చేయాలన్నా .. చిన్న చిన్న డ్యామెజీ లను సరిచేయాలన్నా కుట్టు మిషన్ ఎంతో అవసరం.ఇప్పుడున్న బిజీ జీవితంలో కుట్టుమిషన్ చాలామందికి అవసరం ఉన్నా వాటిని వాడే వారు తక్కువయ్యారని చెప్పవచ్చు. అయితే ప్రతి మహిళ కూడా ఒకరిపై ఆధారపడకుండా తానే ఎదుటివారికి మార్గదర్శకంగా నిలిచి సమాజంలో తనకు తాను ఒక ఐడెంటిటీ తెచ్చుకోవాలాని ప్రభుత్వాలు సైతం తెలుపుతున్నాయి.

అందుకే ఇంటి దగ్గర ఉన్న మహిళలకు బోర్ కొడుతుందా అయితే ఆరోహి సూయింగ్ ఎంటర్ప్రైజెస్ సంస్థ అందిస్తున్న లేటెస్ట్ ఎంబ్రాయిడరీ మిషన్ ను కొనుగోలు చేయండి. మహిళలను చైతన్యపరచడం కోసం తన వంతు సహకారం అందించాలనే లక్ష్యంతో తన కుటుంబ సభ్యులు ముఖ్యంగా భర్త మంగారావు సహకారంతో ఆరోహి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ “శిరీష మల్లాడి” ముందుకు వచ్చింది.

తను కూడా ఒక్క కుట్టు మిషన్ తో స్టార్ట్ చేసిన శిరీష తన స్టిచ్చింగ్ తో ఎంతో మంది మన్ననలను పొందింది.తక్కువ ఖర్చుతో మొదలెట్టిన .ఈ సంస్థలో ఎంతోమందికి ఉపాధి కల్పిస్తూ తన బిజినెస్ ను ముందుకు తీసుకెళ్ళిన ఈ సంస్థ దిన దినాభి వృద్ధి చెందుతూ నేడు 15 కోట్లకు చేరుకోవడం విశేషం.తనలాగే మహిళలందరూ స్వతంత్రంగా ఎదగాలనే ఉద్దేశ్యంతో చిన్నచిన్న వ్యాపారవేత్తలకు తక్కువ ఖర్చుతో యాడ్ మేకింగ్ డైరెక్షన్ చేస్తున్న ధీరజ్ డ్రీమ్ ప్రొడక్షన్ హౌస్ లో ఆరోహి సీవింగ్ ఎంటరప్రైజెస్ కొరకు ఉమెన్ ఏంపవర్ మెంట్ ప్రమోషన్ యాడ్ చేయడం జరిగింది. ఈ యాడ్ లో ప్రముఖ సీనియర్ నటులు వై విజయ, రాగిణితో పాటు ఆర్టిస్టులు శిరీష, యాంకర్ ధరణి ప్రియ, వాణి అగర్వాల్, వర్షిత, అద్వైత, పూర్ణిమ, గిరీష్, కుమార్ తదితరులు ఈ యాడ్ లో నటించడం జరిగింది. ఈ సందర్బంగా హైదరాబాద్ లో తన కస్టమర్స్, శ్రేయోభిలాషుల సమక్షంలో ఆరోహి సీవింగ్ ఎంటరప్రైజెస్ ప్రమోషన్ యాడ్ ను విడుదల చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి సినీ నటులు, టీవీ కళాకారులు హాజరయ్యారు. హిడింబ హీరోయిన్ నందిత శ్వేత ముఖ్య అతిధిగా హాజరయ్యి ఉమెన్ ఏంపవర్ మెంట్ యాడ్ ను రిలీజ్ చేసి ఆరోహి కంపెనీ యొక్క మొదటి సీవింగ్ మిషన్ కొనుగోలు చేశారు.

అనంతరం హీరోయిన్ నందిత శ్వేత మాట్లాడుతూ.. ఉమెన్స్ అందరూ ఒకరిపై ఆధారపడకుండా తన కాళ్ళపై తాను నిలబడేలా ఇండిపెండెంట్ గా నిలబడి ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ గా ఉండాలి. ఒక ఫ్యామిలీ లో స్త్రీ ఆర్థికంగా ఎదిగితే కుటుంబమంతా ఆర్థికంగా ఎదుగుతుంది. తక్కువ ఖర్చుతో స్టార్ట్ చేసిన శిరీష ఈరోజు ఎంతోమందికి ఉపాధి కల్పిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది . తను ఇలాగే ఎన్నో మంచి పనులు చేస్తూ ఎంతో ఎత్తుకు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

దర్శకుడు దీరజ్ మాట్లాడుతూ… హిడింబ హీరోయిన్ నందిత శ్వేత ఎంతో బిజీగా ఉన్నా మా ఉమెన్ ఏంపవర్ మెంట్ కార్యక్రమానికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. చిన్నప్పటి నుంచి నాకు సినిమా అంటే ఇష్టం.అందుకే తన పోలీసు జాబును వదలుకొని ఇండస్ట్రీకి రావడం జరిగింది.ఆర్టిస్ట్ గా చాలా సినిమాలు చేసినా దర్శకత్వం కూడా చేయాలనేది నా కోరిక ఉండేది.మా గురువుగారు యమునా కిషోర్ స్ఫూర్తి తో ధీరజ్ ప్రొడక్షన్ ఏ యాడ్ ఏజెన్సీ ని స్టార్ట్ చేశాను.ఇందులో భాగంగానే ఎంబ్రాయిడరీ కు సంబంధించిన యాడ్స్ చేయడం జరిగింది. టీవీ కమర్షియల్ యాడ్ లా కాకుండా సోషల్ మీడియాలో, యూట్యూబ్ లో కూడా మహిళలకు ఉపయోగపడే విధంగా ఆరోహి ఎంటర్ప్రైజెస్ యాడ్ చేయడం జరిగింది.ఈ కంపెనీ ఎండి శిరీష చాలా స్ట్రాంగ్ ఉమెన్. సాధారణమైన మహిళగా ఎందుకుండాలి అసాధారణమైన మహిళగా ఎదగాలి అనే కాన్సెప్ట్ తో ఉమెన్ ఎంపవర్మెంట్ అనే యాడ్ మహిళా సాధికారతకు ఉపయోగపడే విధంగా నా వంతు కృషిగా ఈ యాడ్ చేయడం జరిగింది. మేము అడిగిన వెంటనే ఉమెన్ ఎంపవర్మెంట్ కు సపోర్ట్ చేస్తూ సీనియర్ నటులు వై విజయ, రాగిణి తో పాటు మొత్తం 10 మంది ముందుకు వచ్చారు. వీరందరి సహకారం చేయడంతో యాడ్ చాలా బాగా రావడం జరిగింది. మా టెక్నీకల్ టీమ్ డిఓపి రవి, ఎడిటర్ రాము,మ్యూజిక్ డైరెక్టర్ అజయ్ పట్నాయక్,డి ఐ రాజ ఇలా అందరూ సపోర్ట్ చేయడంతో ఈ యాడ్ బాగా వచ్చిందని అన్నారు.

ఆరోహి సీవింగ్ ఎంటర్ ప్రైజెస్ ఫౌండర్ యం.డి. శిరీష మల్లాడి మాట్లాడుతూ... మా ఆరోహి సీవింగ్ ఎంటర్ ప్రైజెస్ ప్రమోషన్ యాడ్ ను లాంచ్ చేయడానికి వచ్చిన పెద్దలకు ధన్యవాదములు. మేము చేసిన ఈ యాడ్ ను ఎలా రిసీవ్ చేసుకుంటారో అని చాలా టెన్షన్ పడ్డాను.ప్రతి ఒక్క మహిళ కష్టపడాలి అనేది నా యొక్క సిద్ధాంతం.
మనీ పెడితేనే బిజినెస్ కాదు, తక్కువ ఇన్వెస్ట్మెంట్ తో మన హస్తకళ తో కూడా చాలా రకాల బిజినెస్ లు చేయొచ్చు. మనీ ప్రాబ్లం ఉందని మనము అక్కడితో ఆగిపోకూడదు. మనీ సంపాదించడం వలన మనకు కాన్ఫిడెన్స్ వస్తుంది. జనరల్ గా లేడీస్ అందరూ ఫాదర్, మదర్ మీద ఆధారపడి ఉంటారు. వారు మనకు లైఫ్ లాంగ్ తోడు ఉండకపోవచ్చు అప్పుడు మన ఫ్యామిలీ ని పిల్లలను లీడ్ చేయడం ఇబ్బందిగా మారుతుంది. అలాంటి టైంలో మనకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు బయటకు రాలేక చాలా ఇబ్బంది పడతాము. అలాంటి టైం లో మనకొక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండేలా… ఏ సమస్య వచ్చినా ఎదుర్కోగలం అనే ఒక నమ్మకం రావాలి.ఎవరూ తక్కువ కాదు ఎవరూ ఎక్కువ కాదు అందరి లోనూ ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. దాన్ని వృధా చేయకుండా జీవితంలో ముందుకెళ్లాలి.ప్రతి ఒక్కరూ మన గురించి చెప్పుకునే విధంగా మనకొక ఐడెంటిటీ ఉండాలి. నేను చెప్పేది ఏంటంటే మహిళలందరూ కూడా సాధారణ మహిళలు కాదు అసాధారణ మహిళలే అని చెప్తాను ఎందుకంటే. ఫ్యామిలీని లీడ్ చేయడం, పిల్లల్ని చదివించడం వారిని మంచి పిల్లలుగా సొసైటీకి అందించడంలో ఒక మహిళ సాధారణంగానే పోరాడుతుంది.కాబట్టి తను అక్కడితో ఆగిపోకుండా స్వతంత్రంగా అసాధారణ మహిళల గా ఎదగాలని కోరుకుంటున్నాను.ఆరోహి సేవింగ్ ఎంటర్ప్రైజెస్ ఈరోజు ఎంత టాప్ లో ఉందంటే నా ఫ్యామిలీ తో పాటు నా స్టాఫ్, కస్టమర్లు సపోర్ట్ గా నిలివడం వలెనే నేను సాధించగలిగాను. వారందరికీ నా ధన్యవాదాలు.ఈ యాడ్ సక్సెస్ కావడానికి టెక్నికల్ టీమ్ ధీరజ్, ఇలా అందరూ సపోర్ట్ చేయడం చాలా సంతోషంగా ఉంది.నేను ఎప్పుడూ కూడా నా కస్టమర్ సక్సెస్ అయినప్పుడే నేను సక్సెస్ అయినట్టు భావిస్తానని అన్నారు.


సీనియర్ నటి వై విజయ మాట్లాడుతూ.. నా చినప్పుడు మా మదర్ బ్లౌజస్ కుట్టేది. ఇది చాలా టైం పాస్ గా ఉండడమే కాకుండా ఆదాయం కూడా వచ్చేది. మా అమ్మను చూసి నేను కూడా చిన్నప్పుడు కుట్టడం నేర్చుకున్నాను.దర్శకుడు దీరజ్ ద్వారా శిరీష ఎదిగిన విధానం తెలుసుకున్న నేను సాధారణ మహిళ నుండి ఆసాధారణ మహిళ గా ఎదగండి అనే కాన్సెప్ట్ నచ్చి ఈ యాడ్ చేశాను. ప్రతి ఒక్క మహిళ ఒకరిపై ఆధార పడకుండా ఉండడానికి ఇలాంటి కుట్టు మిషన్ చాలా ఉపయోగపడుతుంది. ఈ సంస్థ యం.డి శిరీష 5 లాక్స్ తో స్టార్ట్ చేసిన ఈ బిజినెస్ ఇప్పుడు 15 క్రోర్స్ వరకు ఎదిగినందుకు చాలా సంతోషంగా ఉంది.తను ఇలాగే ఎంతోమంది కి సహాయపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

సీనియర్ నటి రాగిణి మాట్లాడుతూ .. ఆడవాళ్లు ముందు ఉండాలి అనే కాన్సెప్ట్ యాడ్ లో నటించినందుకు చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఆడవాళ్లకు ఒక ధైర్యాన్ని ఇచ్చేది కుట్టుమిషన్. దీని ద్వారా తనకే కాక అన్న, తమ్ముడు, భర్తకు ఇలా అందరికీ తన ద్వారా ఎంతో ఉపయోగ పడుతుంది. కాబట్టి అందరూ ఆరోహి సేవింగ్ మిషన్ కొనుక్కో వాలని కోరుకుంటున్నాను అన్నారు.

నటి శిరీష మాట్లాడుతూ.. పెళ్ళైన తరువాత భర్త చూసుకుంటాడు అనుకోకుండా తనకు తాను సొంత గుర్తింపు తెచ్చుకుంటూ ఫైనాన్సియల్ గా ఇండిపెండెంట్ గా ఉండాలి అంటే ఇలాంటి కుట్టు మిషన్ ఉండాలని అన్నారు.


శిరీష అత్త నాగేంద్రమ్మ మాట్లాడుతూ.. ఒక్క మిషన్ తో ఇంట్లో పెట్టుకోని స్టార్ట్ చేసిన మా కోడలు శిరీష ఈ రోజు ఇంత గొప్ప గా ఎదిగినందుకు చాలా సంతోషం గా ఉంది. నేను ఎప్పుడు తనను కోడలు అనుకోను తను మా బిడ్డ అనుకుంటున్నామని అన్నారు.

దర్శకుడు దీరజ్ తల్లి పద్మావతి మాట్లాడుతూ.. మా సుధీర్ పోలీస్ డిపార్ట్మెంట్ లో జాబ్ చేస్తున్న తను సినిమా ఇండస్ట్రీ లొకి రావడం జరిగింది. ఈ రోజు ఇంతమంది పెద్దలు సుధీర్ గురించి చెపుతుంటే చాలా హ్యాపీ గా ఉంది. ఈ రోజు తను డైరెక్షన్ చేసిన యాడ్స్ చూస్తే తను గొప్ప డైరెక్టర్ అవుతాడానే నమ్మకం ఏర్పడింది అన్నారు.

నటుడు కుమార్ మాట్లాడుతూ.. శిరీష యొక్క ట్యాలెంట్ ను గుర్తించి తనను ప్రోతహించిన తన భర్త మంగా రావుకు హ్యాట్సాప్ చెప్పాలి. తను ఈ రోజు గొప్ప గా ఎదిగిన శిరీష ఇంకా ఎత్తుకు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

డబ్బింగ్ ఆర్టిస్ట్ ఆర్. సి .యం రాజు మాట్లాడుతూ.. సాధారణ మహిళ నుండి అసాధారణ మహిళగా ఎదిగిన శిరీష ఒక బిజినెస్ లోనే కాకుండా షోషల్ సర్వీస్ కూడా చేస్తుండడం విశేషం. తను ఇలాగే మంచి పనులు ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

నటుడు గిరీష్ మాట్లాడుతూ.. దర్శకుడు దీరజ్ నాకు మంచి ఫ్రెండ్ తను పోలీస్ డిపార్ట్మెంట్ లో మంచి జీతం వున్నా దాన్ని ఒదులు కొని ఇండస్ట్రీ కి వచ్చాడు.ఇక్కడ తను చాలా కష్టపడ్డాడు.తన కష్టానికి ఈ రోజు ఫలితం దక్కింది. అలాగే ఆరోహి యం డి శిరీష ఎంతో కష్టపడి పని చేయడమే కాకుండా తను చాలా నిజాయితీగా ఉంటారు.అలాంటి తనకు మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

ఇంకా ఈ కార్యక్రమం లో మ్యూజిక్ డైరెక్టర్ అజయ్ పట్నాయక్, ఎడిటర్ రాము, ఆర్టిస్ట్ మోనా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here