Our Factory Store.. App launched by Minister Talasani Srinivasa Yadav

ఖైదీ నంబర్‌ 150, శ్రీమంతుడు,  దండుపాళ్యం2-3, భరత్‌ అనే నేను, కాటమ రాయుడు’ చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు కోటి.  అయన  ప్రారంభించిన  అవర్‌ ఫ్యాక్టరీ.. యాప్‌ తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌ ఆవిష్కరించారు. హైదరాబాద్‌ యూసఫ్‌గూడలోని కోటి యాదవ్‌ నెలకొల్పిన ఈ ప్యాషన్‌ స్టోర్‌కు సంబంధించిన యాప్‌ను సోమవారం హైదరాబాద్‌లో లాంచ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రితోపాటు రచయిత చిన్నకృష్ణ, సత్య మాస్టర్‌, చిన్న శ్రీశైలం యాదవ్‌ తదితరులు పాల్గొని కోటి యాదవ్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

‘‘మంచి వ్యక్తి సంఘ సేవకుడు. ఇలాంటి వ్యక్తి వ్యాపారంలో రాణిస్తే మరింత మందికి సేవలు అందిస్తాడు. ఆయన ప్రారంభించిన ‘అవర్‌ ఫ్యాక్టరీ’ యాప్‌ సక్సెస్‌ అయి నంబర్‌వన్‌ కావాలని ఒక కార్పొరేట్‌ సంస్థగా ఎదగాలని ఆశిస్తున్నారు. అతను సాధిస్తాడనే నమ్మకం ఉంది’’ అని అన్నారు.

సత్య మాస్టర్‌ మాట్లాడుతూ ‘‘కోటి గొప్ప సేవకుడు. అవర్‌ ఫ్యాక్టరీ పేరుత చక్కని బట్టల షాప్‌ ఏర్పాటు చేశారు. ఆయనకు ఉన్నదాన్లో కొంత డబ్బు ఎప్పుడూ సేవలకే ఖర్చు చేస్తుంటారు. ఈ వ్యాపారంలో ఆయన రాణించి కష్టాల్లో ఉన్న వారికి అండగా నిలవాలని కోరుతున్నా’’ అన్నారు.

ఖైదీ నంబర్‌ 150, శ్రీమంతుడు,  దండుపాళ్యం2-3, భరత్‌ అనే నేను, కాటమ రాయుడు’ చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు కోటి. అలాగే జీ, మా టీవీల కోసం పలు సీరియళ్లలోనూ నటించారు. ప్రస్తుతం ట్రెండ్‌గా నడుస్తున్న ఓటీటీల్లో వెబ్‌ సిరీస్‌లు కూడా చేస్తున్నారు. ఇటీవల కృష్ణ పరమాత్మ అనే పేరుతో ఓ బ్యానర్‌ను ప్రారంభించి త్వరలో సినిమాలు కూడా నిర్మించబోతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here