‘Prajakavi Kaloji Biopic’ Movie Song Launched By Star Producer Suresh Babu

జైనీ క్రియేషన్స్ పతాకంపై మూలవిరాట్, పద్మ,రాజ్ కుమార్, స్వప్న నటీ నటులుగా అమ్మ నీకు వందనం,  క్యాంపస్ అంపశయ్య’,  ప్రణయ వీధుల్లో’, వంటి  ప్రయోజనాత్మక ‘ సినిమాలు తీసిన ప్రభాకర్ జైనీ దర్శకత్వంలో శ్రీమతి  విజయలక్ష్మీ జైనీ నిర్మించిన చిత్రం ‘ప్రజాకవి కాళోజీ’ బయోపిక్!. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకు సిద్దమైన సందర్బంగా  ఈ చిత్రంలోని అలుపెరుగని అవిశ్రాంత కలం యోధుడా! అను పాటను ప్రముఖ నిర్మాత డి.సురేష్ బాబు ఆవిష్కరించారు. అనంతరం

డి.సురేష్ బాబు మాట్లాడుతూ… తెలంగాణ ఉద్యమ కారుడు ప్రజా కవి కాళోజీ పై చిత్రీకరించిన “అలుపెరుగని అవిశ్రాంత కలం యోధుడా!” పాట చాలా బాగుంది. ఇలాంటి వీరుల కథను సెలెక్ట్  చేసుకోని  తీసిన శ్రీమతి విజయలక్ష్మీ  జైనీ కు, దర్శకుడు ప్రభాకర్ జైనీ కు,మంచి పాటలు అందించిన బిక్కి కృష్ణ కు టోటల్ టీం కు అల్ ద బెస్ట్. త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా బిగ్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

చిత్ర దర్శకుడు ప్రభాకర్ జైనీ  మాట్లాడుతూ..మేము అడిగిన వెంటనే  మా “ప్రజా కవి కాళోజీ బయోపిక్”  సినిమాలోని పాటను విడుదల చేసిన సురేష్ బాబు గారికి మా యూనిట్ తరుపున ధన్యవాదములు తెలుపుతున్నాము. మీ చేత ప్రారంభించబడిన ప్రతి సినిమా విజయం సాధించింది. అలాగే ఇప్పుడు త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా కూడా పెద్ద విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సెన్సార్ సభ్యులు ఈ సినిమా చూసి ప్రస్తుతం అందరూ కమర్సియల్  గా సినిమాలు తీస్తుంటే దానికి భిన్నంగా ప్రజా ఉద్యమ నాయకుడైన కాళోజి గారి బయోపిక్ కు తీసుకొని నిర్మించిన  ఈ సినిమా చాలా బాగుందని ప్రశమశించారు. అలాగే ఇకముందు కూడా ఇలాంటి గొప్ప వ్యక్తుల సినిమాలను తీయడానికి  ప్రోత్సహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు

పాటల రచయిత కళారత్న బిక్కి కృష్ణ మాట్లాడుతూ.. దర్శక, నిర్మాతలు ఈ సినిమాను చాలా కష్టపడి నిర్మించారు. ఇలాంటి మంచి సినిమాలో నేను భాగమైనందుకు చాలా సంతోషంగా ఉంది. తెలంగాణ ఉద్యమ ప్రజా నాయకుడు కాళోజీ పై తీసిన బయోపిక్ కు కచ్చితంగా మంచి ప్రజాదరణ లభిస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

నటీ నటులు
కాళోజీ గారితో చిరకాలంగా సన్నిహితంగా మెదిలిన పొట్లపల్లి శ్రీనివాసరావు, నాగిళ్ళ రామశాస్త్రి, విద్యార్థి, అంపశయ్య నవీన్, డాక్టర్ వీయస్ రెడ్డి, అన్వర్, పీవీ నరసింహారావు పాత్రలో వారి సోదరుడు, పీవీ మనోహర్ రావు, ప్రముఖ కవి తుమ్మూరి రామ్మోహన్ రావు, వైభవ్ సూర్య, శంకర్, మల్లికార్జున్, ప్రియ, రాధిక, నరేశ్, రజని, దేవేందర్ రెడ్డి, లాయర్ చౌహాన్, జమీందారు పాత్రలో ఆంధ్రప్రభ చీఫ్ ఎడిటర్ వైయస్సార్ శర్మ నటించారు.  మిసెస్ ఇండియా  సుష్మా తోడేటి తదితరులు

సాంకేతిక నిపుణులు
బ్యానర్: జైనీ క్రియేషన్స్,
నిర్మాత: విజయలక్ష్మీ జైనీ,
కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ప్రభాకర్ జైనీ.
పాటలు: కళారత్న బిక్కి కృష్ణ,
కెమెరామెన్: స్వర్గీయ రవి కుమార్ నీర్ల;
సంగీతం: యస్.యస్.ఆత్రేయ,
నేపథ్య సంగీతం: మల్లిక్ యం.వి.కే;
‘ఎడిటింగ్: కొండవీటి రవి కుమార్,
సెకండ్ యూనిట్ కెమెరా:  భాస్కర్,
కొరియోగ్రఫి: మల్లన్న శ్యామ్, కళాధర్; స్వర్గీయ రవి కుమార్ నీర్ల,
పి. ఆర్. ఓ : మూర్తి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here