టాలీవుడ్లో నూతన నిర్మాణ సంస్థ ‘శివమ్ మీడియా’ పేరుతో ప్రారంభం అయ్యింది. సీనియర్ జర్నలిస్ట్ శివమల్లాల ఈ బ్యానర్ నిర్మాత. గురువారం ఈ సినిమా శివమ్ మీడియా లోగో మరియు బ్యానర్‌ను ప్రముఖ నటులు అలీ నిర్మాత, దర్శకులు ప్రవీణా కడియాల , అనిల్ కడియాల చేతుల మీదుగా బ్యానర్‌ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా అలీ మాట్లాడుతూ–‘‘ శివ నా తమ్ముడు లాంటివాడు. గత 20 ఏళ్లుగా వ్యక్తిగతంగా నాకు ఎంతో సన్నిహితుడు. చిన్న స్థాయి నుండి కెరీర్‌ను ప్రారంభించి ఈ రోజున నిర్మాతగా తన బ్యానర్‌ను స్థాపించి ముందుకు వెళ్లటం ఆనందంగా ఉంది’’ అన్నారు.
అనిల్ కడియాల మాట్లాడుతూ– శివమల్లాల తొలి రోజుల్నుంచి మాకు మంచి ఫ్రెండ్, మంచిమనిషి. అందుకే మా జర్నీలో శివ ఎప్పుడు ఉన్నాడు. ఈ రోజు ‘శివమ్ మీడియా’ అనే బ్యానర్ ద్వారా శివ అనేక సినిమాలు తీసి మంచి విజయాలు అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’’ అన్నారు.
జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్స్ నిర్మాత ప్రవీణా కడియాల మాట్లాడుతూ– ‘‘ ఈరోజు నాకు ఎంతో ఆనందంగా ఉంది. మా ముందు చిన్న రిపోర్టర్‌గా పిఆర్వోగా పనిచేసిన మా శివాయేనా ఒక బ్యానర్‌ని పెట్టింది అనిపిస్తుంది. ‘శివమ్ మీడియా’ విషయంలో నేను ఎంతో ప్రౌడ్‌గా ఫీలవుతున్నాను. ఈ బ్యానర్‌ద్వారా డబ్బింగ్ సినిమానా, స్ట్రెయిట్ సినిమానా అనే తేడా లేకుండా అనేక మంచి సినిమాలు వస్తాయని రావాలని కోరుకుంటున్నా’’ అన్నారు.
శివమ్ మీడియా నిర్మాత శివమల్లాల మాట్లాడుతూ– సినిమా పరిశ్రమకి వచ్చిన ప్రతి ఒక్కరికి చిన్న చిన్న కోరికలు ఉంటాయి. అవి తీర్చుకోవటానికి ప్రతి ఒక్కరు తనదైన స్టైల్లో కష్టపడుతుంటారు. నాకు కూడా ఇలాంటి చిన్న చిన్న కోరికలు ఉన్నాయి. సినిస్టార్ మ్యాగజైన్లో మాధవి అక్క, ఫ్రభు మామయ్య ఇచ్చిన అవకాశంతో ఫోటోగ్రాఫర్‌గా ప్రారంభమైన నేను తర్వాత కాలంలో అనేక వెబ్సైట్లకు పనిచేశాను. 2008 నుండి ఫోటోగ్రాఫర్‌గా, రిపోర్టర్‌గా, సీనియర్ రిపోర్టర్‌గా ‘సాక్షి’ దినపత్రికలో పనిచేస్తూ కొన్ని సినిమాలకు ఎగ్జిక్యుటివ్ ప్రొడ్యూసర్‌గా పనిచేశాను. సాక్షి పేపర్లో 13 ఏళ్లు పనిచేసిన తర్వాత ‘శివమ్ మీడియా’ పేరుతో మాదాపూర్‌లో ఆఫీస్ ఓపెన్ చేశాను. అక్కడ మ్యాజికల్ మూమెంట్స్ అనే ఈవెంట్ కంపెనీ, ట్యాగ్ తెలుగు.కామ్ వెబ్సైట్, ట్యాగ్‌తెలుగు, రెయిజ్ యువర్ వాయిస్ యూట్యూబ్ చానల్స్‌తో పాటు శివమ్ యాడ్ ఏజన్సీ ఏర్పాటు చేసి కొన్ని యాడ్స్‌ను తెరకెక్కించాను. రీసెంట్గా పాడ్‌కాస్ట్ కూడా చేస్తున్నాను. ప్రతి సమయంలో నా వెన్నంటి ఉన్న నా శివమ్ మీడియా టీమ్‌కి నా వైఫ్ సుజాతకు, తమ్ముడు మూర్తికి, మరో తమ్ముడు తాతా. పవన్‌కి చాలా చాలా థ్యాంక్స్. ఫైనల్‌గా శివమ్ మీడియా పేరుతో ప్రొడక్షన్ హౌస్‌ను ఈ రోజు నా ముగ్గురు స్నేహితులు అలీ, అనిల్, ప్రవీణా ల చేతుల మీదుగా నా బ్యానర్‌ని ప్రారంభించటం ఎంతో హ్యాపీ. నేను ఎంత కష్టపడతానో ఈ ముగ్గురికి బాగా తెలుసు. శివమ్ మీడియా బ్యానర్‌పై మంచి సినిమాలు చేస్తాను’’ అన్నారు.
నటీననటులు– సాంకేతిక నిపుణులు
హీరో– హమరేశ్, హీరోయిన్ – ప్రార్థన సందీప్, ఆడుగాలం మురుగదాస్, మాటలు– కె.యన్ విజయ్ పాటలు– రాంబాబు గోసాల, సంగీతం– సుందరమూర్తి కె.యస్ డిఓపి– బ్యానర్– శివమ్ మీడియా నిర్మాత– శివమల్లాల, కథ– దర్శకత్వం– వాలీ మోహన్‌దాస్ ,పీఆర్వో– మధు వి.ఆర్, మూర్తి మల్లాల