In the meeting of the two CMs, the issues of the Telugu film industry should be discussed

ఈ రోజు ఇరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి హైదరాబాద్ లో సమావేశమవుతున్నారు. తెలుగు రాష్ట్రాల మధ్య విభజన సమస్యలపై వారు చర్చించనున్నారు. ఈ సమావేశంలో తెలుగు చిత్ర పరిశ్రమ సమస్యలను సైతం పరిష్కరించేలా చర్చ జరగాలని కోరారు టీఎఫ్ సీసీ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణ గౌడ్. ఈ మేరకు ఆయన పలు సూచనలు చేశారు.

ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ – తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు సమావేశమై ఇరు రాష్ట్రాల సమస్యలపై చర్చలు జరపడం ఆహ్వానించదగ్గ విషయం. ఇదే సందర్భంలో తెలుగు చిత్ర పరిశ్రమ గత కొన్నేళ్లుగా ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చ జరగాలని కోరుకుంటున్నాను. ఒక సీనియర్ నిర్మాతగా, దర్శకుడిగా నేను వారి దృష్టికి కొన్ని సమస్యలు తీసుకురావాలని భావిస్తున్నా. తెలుగు సినిమా పరిశ్రమలో యూఎఫ్ వో, క్యూబ్ వంటి డిజిటల్ కంటెంట్ ప్రొవైడర్ల రేట్లు నిర్మాతలకు భారంగా మారాయి. ఇతర రాష్ట్రాల్లో రెండు మూడు వేలు ఉన్న యూఎఫ్ వో, క్యూబ్ రేట్లు మన దగ్గర పది నుంచి పదిహేను వేల దాకా వసూలు చేస్తున్నారు. ఇండస్ట్రీలోని కొందరు పెద్దలు ఈ కంపెనీలకు అడ్వైజర్లుగా ఉండి ఈ వ్యాపారానికి సపోర్ట్ చేస్తున్నారు. ప్రపంచం గర్వించేలా ఎదుగుతున్న తెలుగు సినిమాకు మాత్రం ఇతర రాష్ట్రాల కంటే క్యూబ్, యూఎఫ్ వో ఎక్కువ వసూలు చేస్తున్నాయి. దీనిపై గతంలో నేను నిరాహారదీక్ష చేశాను. అయినా మార్పు రాలేదు. గతంలో 50 వేలకు ఒక ప్రింట్ చొప్పున పది ప్రింట్లు కొంటే నిర్మాతకు అదే సరిపోయేది. చిన్న సినిమాలకు థియేటర్స్ దొరకడం లేదు. మెయిన్ సెంటర్స్ లో థియేటర్స్ కు రెంట్ సిస్టమ్ ఉంది. ఇది చిన్న నిర్మాతలకు తమ సినిమాల రిలీజ్ టైమ్ లో ఇబ్బందిగా మారుతోంది. టికెట్ బుకింగ్స్ కూడా ప్రైవేట్ కంపెనీల ద్వారా కాకుండా ప్రభుత్వమే ఎఫ్ డీసీ ద్వారా చేయిస్తే ప్రైవేట్ వారికి అనసరంగా డబ్బులు పోకుండా ఉంటాయి. థియేటర్స్ లో తినుబండారాల రేట్లు విపరీతంగా ఉంటున్నాయి. వాటిని తగ్గించాలి. చిన్న చిత్రాలకు అప్పట్లో పది లక్షల రూపాయల రాయితీ ఇచ్చేవారు. ఇప్పడు కూడా అలాంటి సిస్టమ్ తీసుకొచ్చి..ఇరవై నుంచి యాభై లక్షల రూపాయల రాయితీ ఒక్కో చిన్న చిత్రానికి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. దాని వల్ల చిన్న సినిమా బతుకుతుంది. ఇవాళ తెలుగులో తెరకెక్కే సినిమాల్లో నూటికి 90శాతం చిన్న చిత్రాలే. సింగిల్ విండో సిస్టమ్ ద్వారా షూటింగ్స్ కు ఉచితంగా పర్మిషన్స్ ఇవ్వాలి. అలాగే షూటింగ్స్ జరిగే ప్రాంతంలో చిత్ర యూనిట్ కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. ప్రస్తుతం మా సంస్థలో దీక్ష అనే సినిమాను రూపొందిస్తున్నాను. ఒక పాట మినహా చిత్రీకరణ పూర్తయింది. దీక్ష సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ చేసిన పాటలకు మంచి స్పందన వస్తోంది. మంచి పాటలు, ఫైట్స్ తో దీక్ష సినిమా ఘన విజయం సాధిస్తుంది. అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here