War Epic Drama 1917 Movie winning three Oscars Awards

రిల‌యన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, ఆంబ్లిన్ పార్ట్‌నర్స్ సంస్థలు మొదటి ప్రపంచ యుద్ధం నేపథ్యంలో సామ్‌ మెండెస్‌ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘1917’. ఇటీవల‌ దేశవ్యాప్తంగా విడుదలైన ఈ వార్‌ ఎపిక్‌ డ్రామా ఎన్నో అవార్డుల‌ను గెలుచుకుని, ఆస్కార్ స‌హా మరెన్నో అవార్డుల‌కు నామినేట్‌ అయిన విషయం తెల్సిందే. తాజాగా ఫిబ్రవరి 10న ప్రపంచ ప్రఖ్యాత 92వ ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవం అమెరికాలోని లాస్ ఏంజెల్స్ నందు గల డాల్బీ థియేటర్లో జరిగింది. ఈ ఆస్కార్ అవార్డ్ వేడుక‌లో ‘1917’ చిత్రం  బెస్ట్‌ సౌండ్‌ మిక్సింగ్‌, బెస్ట్‌ సినిమాటోగ్రఫీ, బెస్ట్‌ విజువల్‌ ఎఫెక్ట్స్ గాను 3 అకాడమీ అవార్డ్స్ గెలుచుకుంది.

ఈ చిత్రం అమెరికా, యు.కె.ల‌ల్లో కలెక్షన్ల పరంగా కొత్త రికార్డు సృష్టించి ఈ రెండు దేశాల్లో ఓపెనింగ్‌ కలెక్షన్స్‌లో నెం.1గా నిలిచింది. అంతే కాకుండా ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో విడుదలైన ఈ చిత్రం అన్ని చోట్లా భారీ కలెక్షన్స్‌ రాబట్టింది.

డ్రీమ్‌ వర్క్స్‌పిక్చర్స్‌, రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సమర్పణలో న్యూ రిపబ్లిక్‌ పిక్చర్స్‌, నీల్‌ స్ట్రీట్‌ ప్రొడక్షన్‌.. మొగాంబో ఈ చిత్రాన్ని నిర్మించారు. జార్జ్‌ మెక్‌కే, డీన్‌ చార్లెస్‌ చాప్‌మేన్‌, కొలిన్‌ ఫెర్త్‌, బెనెడిక్ట్‌ కుంబర్‌బ్యాచ్‌ తదితరులు ఈ సినిమా ముఖ్యపాత్రలు పోషించారు. జనవరిలో  రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ద్వారా ఈ చిత్రం భారతదేశంలో విడుదలైంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here