“Kanyaka” Movie is getting good response on Airtel Xtreme, Hungama, & All OTTs Plot farms

ప్రముఖ ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతూ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటోంది “కన్యక” మూవీ. ఈ చిత్రాన్ని బి సినీ ఈటి సమర్పణలో శ్రీ కాశీ విశ్వనాథ్ పిక్చర్స్ బ్యానర్స్ పై కేవీ అమరలింగేశ్వరరావు, ఆతుకూరి సాంబశివరావు, కూరపాటి పూర్ణచంద్ర రావు నిర్మించారు. ఈ సినిమా ప్రస్తుతం ఎయిర్ టెల్ ఎక్స్ ట్రీమ్, హంగామా, టాటా ప్లే బింగే, వాచో, వి మూవీస్ టీవీ ఇంకా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

విశ్వనాథ శాస్త్రి అనే ఒక బ్రాహ్మణోత్తముని కూతురు కన్యక కనిపించకుండా పోతుంది ఆ అమ్మాయి లేచి పోయిందా లేదా ఎవరైనా చంపేశారా అని శ్రావ్య అనే అమ్మాయి ఆ ఊరి కొచ్చి విశ్వనాథ శాస్త్రి గారి ఇంటిలోని ఉంటూ ఇన్విస్టిగేట్ చేస్తుంది…కన్యక ఏమైంది వచ్చిన అమ్మాయి ఎవరు చివరి వరకు అసలు ఏం జరిగింది అని సస్పెన్స్ కథాంశంతో, మనం చేసిన తప్పులను ఒక కన్ను గమనిస్తుంది అని మెసేజ్ తో ఈ సినిమా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది. ఓటీటీలో కన్యక కు వస్తున్న రెస్పాన్స్ పట్ల దర్శక నిర్మాతలు సంతోషాన్ని వ్యక్తం చేశారు.

నిర్మాతలు కేవీ అమరలింగేశ్వరరావు, ఆతుకూరి సాంబశివరావు, కూరపాటి పూర్ణచంద్ర రావు మాట్లాడుతూ – మా కన్యక సినిమాకు అన్ని ప్రముఖ ఓటీటీల్లో మంచి రెస్పాన్స్ వస్తోంది. మా మొదటి సినిమానే ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ సినిమా చేసినందుకు ఆనందంగా ఉంది. నకరికల్లు వాసవి కన్యక టెంపుల్ లో అమ్మవారి మీద చిత్రీకరించిన పాట హైలట్ గా నిలుస్తోంది. కన్యక సకుటుంబంగా చూడదగిన మంచి సినిమా. అన్నారు.

దర్శకుడు రాఘవ మాట్లాడుతూ – ఆడవారి పట్ల అమానుషంగా ప్రవర్తిస్తే ఎవరు క్షమించిన అమ్మవారు క్షమించదు, శిక్షిస్తుందని ఈ చిత్రం ద్వారా తెలియజేశాం. చాలా తక్కువ రోజుల్లో తక్కువ బడ్జెట్ లో ఫినిష్ చేశాం. షూటింగ్ కు నకరికల్లు, చాగంటివారి పాలెం వాసులు ఎంతో సహకరించారు. కన్యక సినిమాకు ఓటీటీలో మంచి రెస్పాన్స్ రావడం ఆనందంగా ఉంది. అన్నారు.

నటీనటులు – శివరామరాజు, జబర్ధస్త్ వాసు, ఈశ్వర్, శ్రీహరి, పీవీఎల్ వరప్రసాదరావు, సర్కార్, ఫణిసూరి, కేవీ అమర్, సాంబశివరావు, పూర్ణచంద్రరావు, సాలిగ్రామం, ఆర్ఎంపీ వెంకటశేషయ్య, మమత, శిరీష, విజయనీరు కొండ, రేవతి, తదితరులు నటించారు.

టెక్నికల్ టీమ్
మాటలు – వెంకట్.టి, పాటలు – విజయేంద్ర చేలో, సంగీతం – అర్జున్, నేపథ్య సంగీతం – జీఆర్ నరేన్, డీవోపీ – రాము, తరుణ్, కొరియోగ్రఫీ – లక్కి శ్యామ్, ఎడిటర్ & కలరిస్ట్ – సుభాన్.బి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – డీకే బోయపాటి, పీఆర్ఓ – మూర్తి మల్లాల, ప్రొడ్యూసర్స్ – కేవీ అమర లింగేశ్వరరావు, ఆతుకూరి సాంబశివరావు, కూరపాటి పూర్ణచంద్ర రావు, రచన-దర్శకత్వం, రాఘవ తిరువాయిపాటి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here