Sridevi Movies Upcoming Killer Comedy Entertainer ‘Sarangapani Jathakam’ Grand Releasing on Dec 20

మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో శ్రీదేవి మూవీస్ పతాకంపై ఆ సంస్థ అధినేత శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మిస్తున్న సినిమా ‘సారంగపాణి జాతకం’. ఇందులో ప్రియదర్శి సరసన తెలుగమ్మాయి రూప కొడువాయూర్ కథానాయికగా నటించారు. ‘జెంటిల్‌మన్’, ‘సమ్మోహనం’ వంటి విజయవంతమైన సినిమాల తర్వాత మోహనకృష్ణ ఇంద్రగంటి, శివలెంక కృష్ణప్రసాద్ కలయికలో రూపొందుతున్న హ్యాట్రిక్ చిత్రమిది. ఈ సినిమా విడుదల తేదీని నేడు వెల్లడించారు.

చిత్ర నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ… ”డిసెంబర్ 20న మా సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నాం. సెప్టెంబర్ మొదటి వారంలో చిత్రీకరణ అంతా పూర్తి చేశాం. ప్రస్తుతం డబ్బింగ్ కార్యక్రమాలు సైతం తుది దశకు చేరుకున్నాయి. అతి త్వరలో ఫస్ట్ కాపీ రెడీ అవుతుంది. సెన్సార్ కార్యక్రమాలు సైతం పూర్తి చేసి క్రిస్మస్ సెలవుల్లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తాం. ఇటీవల కొన్ని సన్నివేశాలు, ఫుల్ రష్ చూశా. నాకు ఎంతో సంతృప్తి కలిగింది. మనిషి భవిష్యత్తు అతని చేతి రేఖల్లో ఉంటుందా? లేదా అతను చేసే చేతల్లో ఉంటుందా? అనే ప్రశ్నకు జవాబు ఇచ్చే ఓ పరిపూర్ణ హాస్యరస చిత్రం మా ‘సారంగపాణి జాతకం’. మోహనకృష్ణ ఇంద్రగంటితో ఇంటిల్లిపాది నవ్వుకునే వినోదాత్మక తీస్తుండటం మాకు ఆనందంగా ఉంది. మా సంస్థలో ‘సారంగపాణి జాతకం’ గుర్తుండిపోయే సినిమా అవుతుంది” అని చెప్పారు.

ప్రియదర్శి పులికొండ, రూప కొడువాయూర్ జంటగా నటించిన ఈ సినిమాలో నరేష్ విజయకృష్ణ, తనికెళ్ళ భరణి, శ్రీనివాస్ అవసరాల, ‘వెన్నెల’ కిశోర్, ‘వైవా’ హర్ష, శివన్నారాయణ, అశోక్ కుమార్, రాజా చెంబోలు, వడ్లమాని శ్రీనివాస్, ప్రదీప్ రుద్ర, రమేష్ రెడ్డి, కల్పలత, రూప లక్ష్మి, హర్షిణి, కె.ఎల్.కె, మణి, ‘ఐమ్యాక్స్’ వెంకట్ ఇతర ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి మేకప్ చీఫ్: ఆర్.కె వ్యామజాల, కాస్ట్యూమ్ చీఫ్: ఎన్. మనోజ్ కుమార్, కాస్ట్యూమ్ డిజైనర్స్: రాజేష్ కామర్సు – అశ్విన్, మార్కెటింగ్: టాక్ స్కూప్, పీఆర్వో: పులగం చిన్నారాయణ, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్: కె. రామాంజనేయులు (అంజి బాబు) – పి రషీద్ అహ్మద్ ఖాన్, కో డైరెక్టర్: కోట సురేష్ కుమార్, పాటలు: రామ జోగయ్య శాస్త్రి, స్టంట్స్: వెంకట్ – వెంకటేష్, ప్రొడక్షన్ డిజైనర్: రవీందర్, ఎడిటర్: మార్తాండ్ కె. వెంకటేష్, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: పీజీ విందా, సంగీతం: వివేక్ సాగర్, లైన్ ప్రొడ్యూసర్: విద్య శివలెంక, సహ నిర్మాత: చింతా గోపాలకృష్ణా రెడ్డి, నిర్మాత: శివలెంక కృష్ణప్రసాద్, రచన – దర్శకత్వం: మోహనకృష్ణ ఇంద్రగంటి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here