Shankara Eye Hospital & Phoenix Organization Conduct A Huge Eye Health Camp For MAA members

శంకర ఐ హాస్పిటల్స్, ఫినిక్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ‘మా’ సభ్యులందరికీ ఫ్రీ ఐ హెల్త్ చెకప్‌ను నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మా అధ్యక్షుడు విష్ణు మంచు, వైస్ ప్రెసిడెంట్ మాదాల రవి, ట్రెజరర్ శివ బాలాజీ పాల్గొన్నారు. ఈ ఫ్రీ ఐ హెల్త్ క్యాంప్‌లో మా సభ్యులందరూ పాల్గొని ఉచితంగా కంటి పరీక్షలు చేయించుకున్నారు. అనంతరం మీడియాతో..

విష్ణు మంచు మాట్లాడుతూ.. ‘హెల్త్ క్యాంప్ నిర్వహించిన శంకర ఐ హాస్పిటల్స్, ఫినిక్స్ ఫౌండేషన్‌లకు కృతజ్ఞతలు. ఈ కార్యక్రమంలో పాల్గోని సద్వినియోగం చేసుకుని విజయవంతం చేసిన మా సభ్యులకు అభినందనలు. పద్మశ్రీ డా. రమణి గారు గురించి మేం విన్నాం. భారతదేశం అంతా కూడా ఫ్రీగా ఐ హాస్పిటల్స్ నిర్వహిస్తున్నారు. కుడిచేత్తో చేసే దానం ఎడమ చేతికి కూడా తెలియకూడదని అంటుంటారు. ఫీనిక్స్ సంస్థ, శంకర హాస్పిటల్స్ కూడా అదే చేస్తోంది. కంచి కామ కోటి మఠ పీఠాదిపతుల్ని మేం ఆరాధిస్తుంటాం. వాళ్ల ఆశీస్సులతో ఈ హాస్పిటల్స్ నడుస్తుండటం ఆనందంగా ఉంది. ’ అని అన్నారు.

మాదాల రవి మాట్లాడుతూ.. ‘ఫినిక్స్ సంస్థ నుంచి చుక్కపల్లి సురేష్ గారు, చుక్కపల్లి అవినాష్ గారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. శంకర ఐ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఫ్రీ ఐ హెల్త్ క్యాంప్‌ను నిర్వహించడం ఆనందంగా ఉంది. దీనికి సహకరించిన ఫీనిక్స్ సంస్థ నీలేష్ జానీ గారికి థాంక్స్. మా సభ్యులందరికీ ఫ్రీ చెకప్ చేసిన శంకర ఐ హాస్పిటల్ హెడ్ విశ్వ మోహన్ గారికి కృతజ్ఞతలు’ అని అన్నారు.

శివ బాలాజి మాట్లాడుతూ.. ‘అందరూ కంటి సమస్యల గురించి పట్టించుకోరు. ఇలా మా సభ్యులందరికీ ఫ్రీ ఐ హెల్త్ చెకప్ చేయించడం ఆనందంగా ఉంది. ఇప్పటి వరకు 25 లక్షల మందికి ఫ్రీ ఆపరేషన్స్ చేయించారని తెలిసింది. ఇది చాలా గొప్ప విషయం. ఇప్పుడు మేం అంతా కలిసి మీకు ఫ్రీగా ప్రచారం చేస్తామ’ని అన్నారు.

ఫీనిక్స్ సంస్థ డైరెక్టర్ నీలేష్ జానీ మాట్లాడుతూ.. ‘మేం సాధ్యమైనంత వరకు బ్లైండ్ నెస్‌ను నిర్మూలించేందుకు ప్రయత్నిస్తున్నాం. ‘మా’తో అసోసియేట్ అవ్వడం వల్ల మేం మరింతగా జనాలకు రీచ్ అవుతామని అనుకుంటున్నామ’ని అన్నారు.

శంకర హాస్పిటల్ హెడ్ విశ్వ మోహన్ మాట్లాడుతూ.. ‘సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటారు. కంటి సమస్యలను నిర్లక్ష్యం చేయకండి. ముందుగానే గుర్తించి కంటి సమస్యలను తొలగించుకోవాలి. మా సభ్యులతో కలిసి పని చేయడం ఆనందంగా ఉంది’ అని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here