Jagadeesh Daneti Announces Hollywood movie of ‘Kalinga War Emperor ashoka’s Lost Bottle’

కళింగ రాజ వంశీకుడైన, భారతదేశానికి చెందిన హాలీవుడ్‌ దర్శకులు జగదీష్‌ దానేటి కళింగ వార్‌–ఎంపరర్‌ అశోకాస్‌ లాస్ట్‌ బ్యాటిల్‌ పేరిట హాలీవుడ్‌ చిత్రాన్ని రూపొందించనున్నారు. నగరంలోని మేఘాలయ హోటల్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధైర్యానికి పురిటిగడ్డ వంటి కళింగ రాజ్యం మీద యుద్ధం చేసిన అశోకుడు భారతదేశంలో తన యుద్ధాలకు స్వస్తి చెప్పి బుధ్దిజం తీసుకుని శాంతి మార్గం పట్టాడని చెప్పారు.

ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ హాలీవుడ్‌లో జగదీష్‌ సాధించిన విజయాలను కొనియాడారు. భారతదేశపు చరిత్రను ప్రపంచ వేదికపై ప్రదర్శించే విధమైన సబ్జెక్టును ఎంచుకున్నందుకు అభినందించారు. కళింగ వంశస్తులు మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో భాగం అవుతున్నందుకు గర్వపడుతున్నామని చెప్పారు. ఈ సందర్భంగా వారు తమ పూర్వీకుల ధైర్య సాహసాల గురించి వివరించారు.

ఇదే కార్యక్రమంలో పూజ్యులు శ్రీశారదా పీఠం స్వరూపానందేంద్ర స్వామీజీ యువ రాజ వంశీకుని అభినందించి శుభాకాంక్షలు అందిస్తూ ఆయనకు విజయ చిహ్నమైన రాజరికపు ఖడ్గాన్ని బహుకరించారు.

తన ఇండియా టూర్‌ (ఫిబ్రవరి 9 నుంచి 16 వరకూ)లో భాగంగా హాలీవుడ్‌ నిర్మాత, దర్శకుడు జానీ మార్టిన్, పింక్‌ జాగ్వార్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ టీమ్‌తో కలిసి జగదీష్‌ దానేటి 5 సినిమా ప్రాజెక్టులు ప్రకటించారు.

ఈ సందర్భంగా విలేకరులను ఉద్ధేశ్యించి మాట్లాడుతూ చారిత్రక యుద్ధం సంభవించిన కళింగ సీమ ప్రాంతం కాబట్టే విశాఖపట్టణంలో కళింగ వార్‌ ప్రాజెక్టు ప్రకటించినట్టు వెల్లడించారు. తమ పూర్వీకుల, కళింగ ప్రజల త్యాగం ఈ స్క్రిప్ట్‌కు స్ఫూర్తిని అందించాయన్నారు. ఈ సినిమాలో భారతీయ సూపర్‌ స్టార్లతో పాటుగా హాలీవుడ్‌కి సంబంధించిన పలువురు ప్రముఖులు పాలు పంచుకోనున్నారన్నారు. ఇది గ్లాడియేటర్‌ వంటి అద్భుత చిత్రాల సరసన నిలబడే చిత్రం కాగలదని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుత ప్రపంచంలో శాంతి చాలా అవసరమని అంటూ శాంతిని విశ్వవ్యాప్తం చేయాల్సిందిగా జగదీష్‌ భారతీయ, తూర్పు దక్షిణ ప్రాంత దేశాల యువతను, యువ రాజ వంశీకులను అభ్యర్ధిస్తూ ఆయన వారిని కలుస్తున్నారు.

హాలీవుడ్‌ నిర్మాత, దర్శకుడైన జానీ మార్టిన్‌ జగదీష్‌ దానేటితో కలసి పనిచేస్తుండడం పట్ల ఉద్విగ్నత వ్యక్త పరచారు. ఈ సందర్భంగా తమకు అన్ని విధాలా సహకరిస్తున్న భారత ప్రభుత్వాన్ని ఆయన కొనియాడారు. మనసులకు హత్తుకునే సినిమాలను రూపొందిచాలనేదే తన కోరికని, జగదీష్‌ దానేటి అద్భుతమైన స్క్రిప్ట్‌తో తన కల సాకారం చేస్తున్నారన్నారు.

ఫింక్‌ జాగ్వార్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎండి సువర్ణ పప్పు మాట్లాడుతూ పైన చెప్పిన ప్రాజెక్టుల కోసం బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు దేశానికి వస్తున్నట్టు వెల్లడించారు. సినిమా స్టూడియోలు, ఆగ్మెంటెడ్‌ రియాలిటీ (ఎఆర్‌), వర్చువల్‌ రియాలిటీ (విఆర్‌) సెంటర్స్‌ వంటి అత్యాధునిక టెక్నాలజీ మీడియా పవర్‌ హౌజ్‌ల ఏర్పాటు గురించి ఆమె ఈ సందర్భంగా చర్చించారు.

లాస్‌ ఏంజెల్స్‌ కు చెందిన హాలీవుడ్‌ నటి లిలియన్‌ రావ్‌ అమెరికా నుంచి నటనలో తన కెరీర్‌ కోసం మూలాలు వెతుక్కుంటూ తిరిగొచ్చారు. ఆమె పింక్‌ జాగ్వార్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌లో భాగం అయ్యారు. కళింగ సామాజిక వర్గానికి చెందిన మరి కొందరు కూడా ఈ కార్యక్రమంలో దర్శకులు జగదీష్‌ను కలిసి అభినందించారు. వీ టీమ్‌ గ్లోబల్‌ ఈవెంట్స్‌ చైర్మన్‌ వీరుమామా ఆధ్వర్యంలో ఈ ఈవెంట్‌ నిర్వహించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here