తండ్రి-కొడుకుల అనుబంధం, త్యాగం, ప్రేమ, భావోద్వేగాల నేపథ్యంలో రూపొందిన హృదయాన్ని హత్తుకునే చిత్రం ‘ఐ యామ్ హ్యాండ్సమ్’ (Since 2009). దుర్గా దేవ్ నాయుడు హీరోగా నటిస్తూ స్వయంగా కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వ బాధ్యతలు నిర్వహించిన ఈ చిత్రాన్ని K ఫిలిమ్స్ బ్యానర్ పై, మహేష్ గుడారు సమర్పణలో కేదార్‌నాథ్ నిర్మించారు. అన్విష కథానాయికగా నటించిన ఈ చిత్రం జూన్ 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో చిత్ర ట్రైలర్ లాంచ్, ప్రీ-రిలీజ్ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ నిర్మాత కేఎల్ దామోదర్ ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై చిత్ర బృందాన్ని అభినందించారు.
ముఖ్య అతిథి కేఎల్ దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ, “సినిమా విజయానికి అసలు బలం కంటెంట్. మంచి కథ, బలమైన భావోద్వేగాలు ఉన్న సినిమాలు ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోతాయి. దుర్గా దేవ్ నాయుడు నటుడిగా, దర్శకుడిగా ఒకేసారి బాధ్యతలు నిర్వర్తిస్తూ ఈ చిత్రాన్ని తెరకెక్కించడం అభినందనీయం. ఆయనలో ఉన్న ప్రతిభ ఈ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్తుంది. సినీ పరిశ్రమలో టాలెంట్‌కు ఎప్పుడూ గుర్తింపు ఉంటుంది. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను” అన్నారు.
దర్శకుడు, హీరో దుర్గా దేవ్ నాయుడు మాట్లాడుతూ, “నేను ఏలూరుకు చెందినవాడిని. మా నాన్న అరటిపండ్ల వ్యాపారి. చిన్న పట్టణం నుంచి వచ్చి ఈ రోజు ఇక్కడ నిలబడటం నాకు ఎంతో ఆనందంగా ఉంది. అందుకే నేను నాకు నేనే స్టార్ అని గర్వంగా చెప్పుకుంటాను. ప్రేక్షకులందరికీ నచ్చే సినిమా తీశాను. ఒకవేళ నచ్చకపోతే ఇంకా మంచి సినిమా తీస్తాను అని నిజాయితీగా చెబుతున్నాను. ఈ సినిమాపై నాకు పూర్తి నమ్మకం ఉంది. చిత్ర యూనిట్‌లోని ప్రతి ఒక్కరూ ప్రాణం పెట్టి పనిచేశారు. డబ్బుల గురించి ఆలోచించకుండా సినిమా కోసం కష్టపడ్డారు. నిర్మాత కేదార్‌నాథ్ గారు, కేఎల్ దామోదర్ ప్రసాద్ గారు ఎంతో సహకారం అందించారు. తెలుగు ప్రేక్షకులతో పాటు మంచి కంటెంట్ కోసం ఎదురుచూసే ప్రతి సినీ ప్రేమికుడికి ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది” అన్నారు.
నిర్మాత కేదార్‌నాథ్ మాట్లాడుతూ, “మంచి కథను నమ్మి ఈ సినిమాను నిర్మించాం. తండ్రి-కొడుకుల మధ్య ఉన్న బంధాన్ని హృదయానికి హత్తుకునేలా దర్శకుడు దుర్గా దేవ్ నాయుడు తెరకెక్కించారు. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ భావోద్వేగానికి లోనవుతారు. మా యూనిట్ అంతా ఎంతో అంకితభావంతో పనిచేసింది. జూన్ 12న విడుదల కానున్న ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నాను” అన్నారు.
సంగీత దర్శకుడు ఎన్.ఎస్. ప్రసూ మాట్లాడుతూ, “ఈ చిత్రానికి సంగీతం అందించడం సంతోషంగా ఉంది. కథలోని భావోద్వేగాలకు తగ్గట్టుగా సంగీతాన్ని అందించాం. పాటలు, నేపథ్య సంగీతం ప్రేక్షకులకు బాగా నచ్చుతాయని నమ్ముతున్నాను. ఈ సినిమా ద్వారా మా అందరికీ మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను” అన్నారు.
హీరోయిన్ అన్విష మాట్లాడుతూ, “మా సినిమాను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. కథ వినగానే చాలా బాగా నచ్చింది. ఇందులో బలమైన భావోద్వేగాలు ఉన్నాయి. సినిమా పెద్ద విజయం సాధిస్తుందనే నమ్మకం అప్పుడే కలిగింది. ఈ అవకాశం ఇచ్చిన దర్శకుడు, నిర్మాతలకు ప్రత్యేక కృతజ్ఞతలు” అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో విడుదల చేసిన ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. పల్లెటూరి నేపథ్యం, కుటుంబ భావోద్వేగాలు, తండ్రి-కొడుకుల మధ్య సాగే అనుబంధం, జీవితంలో ఎదురయ్యే సవాళ్లు, హృదయాన్ని తాకే సన్నివేశాలతో ట్రైలర్ ఆసక్తిని రేకెత్తించింది. ముఖ్యంగా హీరో దుర్గా దేవ్ నాయుడు పాత్ర, భావోద్వేగ సన్నివేశాలు సినిమాపై అంచనాలను మరింత పెంచాయి.
ట్రైలర్ విడుదల అనంతరం చిత్ర బృందం మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించింది. విలేకరులు అడిగిన ప్రశ్నలకు దర్శకుడు దుర్గా దేవ్ నాయుడు, నిర్మాత కేదార్‌నాథ్, సాంకేతిక నిపుణులు సమాధానాలు ఇచ్చారు. సినిమా అవుట్‌పుట్ అద్భుతంగా వచ్చిందని, ముఖ్యంగా చివరి 45 నిమిషాలు ప్రతి ప్రేక్షకుడిని భావోద్వేగానికి గురి చేస్తాయని, థియేటర్ల నుంచి తృప్తిగా బయటకు వస్తారని వారు తెలిపారు. ‘ఐ యామ్ హ్యాండ్సమ్’ కుటుంబ బంధాలు, త్యాగం, ప్రేమ, భావోద్వేగాల సమ్మేళనంగా ప్రేక్షకులను అలరించేందుకు జూన్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.
నటీనటులు
దుర్గా దేవ్ నాయుడు (హీరో)
అన్విష (హీరోయిన్)
కిట్టయ్య (తండ్రి పాత్ర)
రూప కళ (తల్లి పాత్ర)
ఫణింద్ర
అశోక్
కీర్తి
వర్ణిక
కేదార్ శంకర్
సాంకేతిక వర్గం
బ్యానర్ : కే ఫిలిమ్స్ బ్యానర్
సమర్పణ: మహేష్ గుడారు
నిర్మాత: కేదార్‌నాథ్
కథ – దర్శకత్వం: దుర్గా దేవ్ నాయుడు
సంగీతం: ఎన్.ఎస్. ప్రసూ
ఎడిటర్ : శివ మంచాల
క్యాస్టింగ్ డైరెక్టర్: స్వాతి
సినిమాటోగ్రఫీ: ఎస్. నాగార్జున రాయల్
పిఆర్ఓ: రవి కుమార్









