Heroin Nivetha Pethuraj Interview.. about ‘Red’

‘మెంటల్ మదిలో’ , ‘బ్రోచేవారెవరురా’, ‘అలవైకుంటపురంలో’ వంటి సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులలో మంచి గుర్తింపు సంపాదించుకున్న నివేతా పేతురాజ్ తాజాగా ‘రెడ్’ చిత్రంలో ఒక నాయికగా నటించింది.రామ్ హీరోగా, నివేతా పేతురాజ్, మాళవిక శర్మ, అమృత అయ్యర్ హీరోయిన్లుగా  కిషోర్ తిరుమల దర్శకత్వంలో స్రవంతి రవి కిషోర్ నిర్మించిన చిత్రం ‘రెడ్’. ఈ సినిమా ఈ నెల 14న విడుదల కానుంది. సంక్రాంతి తరుణంలో ఈ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడం చాలా ఆనందంగా ఉందంటున్న హీరోయిన్ నివేతా పేతురాజ్ మాట్లాడుతూ…

*వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ‘మెంటల్ మదిలో’, ‘బ్రోచేవారెవరురా’ చేశాను. కిషోర్ గారి దర్శకత్వంలో ‘చిత్రలహరి’ లో నాది చాలా ప్రాధాన్యత ఉన్న పాత్ర, ఇప్పుడు ‘రెడ్’ సినిమా చేశా. దర్శకుడు కిషోర్ తిరుమల గారు ఈ సినిమా గురించి చెప్పినప్పుడు సినిమా కథ ఏంటి, నా పాత్ర ఏంటి అని అడగకుండా వెంటనే అంగీకరించాను.

*తెలుగు సినిమాల్లో నేను నా పాత్ర గురించి మాత్రమే ఆలోచిస్తాను.కథలో నా పాత్ర కీలకంగా ఉంటే రెండో నాయిక అనే విషయం ఆలోచించను.’రెడ్’ సినిమాలో నేను పోలీస్ అధికారిని పాత్రలో కనిపిస్తాను.ఇందులో నాది ఇన్నోసెంట్ పోలీస్ పాత్ర కానీ.. బయటికి రఫ్ గా ఉంటాను. పోలీస్ పాత్ర కోసం ప్రత్యేకించి హోం వర్కు చేయలేదు,ఎందుకంటే తమిళంలో ఓ సినిమాలో పోలీస్ పాత్రలో నటించాను ఆ అనుభవం ఈ పాత్రకి బాగా ఉపయోగపడింది.

*’అల వైకుంఠపురం లో’ సినిమా నాకు మంచి పేరు తీసుకువచ్చింది.ఈ సినిమా చాలా మందికి రీచ్ అయ్యింది.ఇప్పటివరకు నేను సున్నితమైన భావోద్వేగాలు కలబోసిన పాత్రలు చేశాను భవిష్యత్తులో పూర్తిస్థాయి కమర్షియల్ హీరోయిన్ గా పేరు తెచ్చుకోవాలని ఉంది.తెలుగులో నేను చేసిన సినిమాలన్నీ మంచి విజయాలు సాధించాయి. సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా గుర్తింపు లభించడం ఆనందంగా ఉంది.

*రెడ్ సినిమాలో నాది పూర్తిస్థాయి నిడివి ఉన్న పాత్ర,ఇందులో రామ్ చేసిన రెండు పాత్రలతో నాకు సీన్లు ఉన్నాయి కానీ.. హీరోయిన్లతో లేవు. నాకు కామెడీ పాత్రలంటే ఇష్టం అయితే తెలుగులో అన్ని సీరియస్ పాత్రలే వస్తున్నాయి అది కూడా హోంలీ గా ఉండేవే గ్లామరస్ రోల్స్ చేయడానికి అభ్యంతరం లేదు. ఏ ఇండస్ట్రీ లో అయినా ప్రస్తుత పరిస్థితుల్లో హీరోయిన్లు ఎక్కువ రోజులు ఉండలేరు అందుకే ఉన్నన్ని రోజులు అన్ని రకాల పాత్రలు  చేయాలనీ ఉంది.

*తమిళంలో విజయ్ సేతుపతి కేవలం హీరోగానే కాకుండా భిన్నమైన ప్రయోగాలు చేస్తూ అన్ని పాత్రలు చేస్తున్నారు తమిళ హీరో విజయ్ సేతుపతి. నాకు  ఆయనలా లేడీ విజయ్ సేతుపతి అనిపించుకోవాలని ఉంది.కెరీర్ ప్రారంభంలో తమిళంలో వరుసగా చాలా సినిమాలు ఒప్పుకున్నాను. కథలు విశ్లేషించ కుండా అలా సినిమాలు ఒప్పుకోవడం తప్పని తెలిసింది.మెంటల్ మదిలో చిత్రలహరి సినిమాల ద్వారా ఎలాంటి ఎంపిక చేసుకోవాలో అర్థం అయింది.ఆ తర్వాత ఏ పాత్ర నాకు సరిపోతుందో దాన్ని పెంచుకుంటున్నాను.కథల ఎంపికలో ఇకముందు సెలెక్టివ్ గా ఉంటూ.. కమర్షియల్ నాయికగా పేరు తెచ్చుకోవాలనుకుంటున్నాను.

*ప్రస్తుతం ‘పాగల్’ చిత్రంతో పాటు చందు మొండేటి దర్శకత్వంలో వెబ్ సినిమా చేస్తున్నాను. విరాటపర్వం లో ప్రత్యేక పాత్రలో నటించాను. తమిళంలో ఓ సినిమా అంగీకరించాను అని చెప్పింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here