A Poetic Magical Visual Love Story ‘Radhe Shyam’ Review

Cinemarangam.com
Review Rating..3.5/5
సమర్పణ : రెబల్ స్టార్ డాక్టర్ యువి కృష్ణంరాజు
బ్యానర్స్: గోపీ కృష్ణ మూవీస్, యూవీ క్రియేష‌న్స్
సినిమా : “రాధే శ్యామ్”
నిర్మాతలు: వంశీ, ప్ర‌మోద్, ప్ర‌సీధ‌
కథ, స్క్రీన్ ప్లే, దర్శకుడు: కె కె రాధాకృష్ణ కుమార్
నటీనటులు: ప్రభాస్, పూజా హెగ్డే, కృష్ణంరాజు, భాగ్యశ్రీ, సచిన్ ఖేడ్‌కర్,జయరాం., జగపతి బాబు,మురళీ శర్మ,  ప్రియదర్శి,  తదితరులు..
సంగీతం: జ‌స్టిన్ ప్ర‌భాక‌ర‌న్ (తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం), మిథున్, అనూ మాలిక్, మనన్ భరద్వాజ్ (హిందీ),
సినిమాటోగ్రఫీ: మనోజ్ పరమహంస,
ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు
యాక్ష‌న్ కొరియోగ్ర‌ఫీ: నిక్ పావెల్‌
డైర‌క్ట‌ర్ ఆఫ్ కొరియోగ్ర‌ఫీ: వైభ‌వి మ‌ర్చంట్‌
ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌: రవీందర్
సౌండ్ ఇంజ‌నీర్‌: ర‌సూల్ పూకుట్టి
ప్రొడక్షన్ కంపెనీస్: యువీ క్రియేషన్స్, టి సిరీస్
PRO : ఏలూరు శ్రీను,మేఘా శ్యామ్

విధికి, విధిరాతకు మధ్య జరిగే సంఘర్షణ “రాధే శ్యామ్”. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పూజ హెగ్డే జంటగా నటిస్తున్న ఈ సినిమా గురించి ప్రేక్షకులు ఎంతగా వేచి చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఈ సినిమాను దర్శకుడు రాధాకృష్ణ కుమార్ తెరకెక్కించారు. రెబల్ స్టార్ డాక్టర్ యువి కృష్ణంరాజు సమర్పణలో గోపీకృష్ణా మూవీస్ సమర్పణలో యూవీ క్రియేషన్స్ నిర్మించింది. ప్రమోద్, వంశీ, ప్రసీధ నిర్మాతలు. ఈనెల 11న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకొచ్చిన “రాధే శ్యామ్” చిత్రం ప్రేక్షకులను ఏ మాత్రం ఎంటర్టైన్ చేసిందో రివ్యూ లో చూద్దాం పదండి.

కథ
1975 బ్యాక్ డ్రాప్ లో జరిగే కథ ఇది. పరమహంస (కృష్ణం రాజు) ఎంతో పెరుగాంచిన జ్యోతిష్యుడు, తన శిష్యుడు ప్రభాస్ (విక్రమాదిత్య)ను కూడా గొప్ప జ్యోతిష్యునిగా తయారు చేస్తాడు. తను చెప్పిన జ్యోతిష్యం వందకు వంద శాతం నిజమవుతుండడంతో.. ప్రపంచంలోని అపర కుబేరులు సైతం వారి జాతకం చెప్పించుకోవడానికి వస్తుంటారు. ప్రధాని ఇందిరా గాంధీ సైతం తనకు జాతకం చూడమంటుంది.తన చేయి చూసి దేశంలో ఏమర్జన్సీ విదించ బోతున్నారని ముందే చెపుతాడు.ఆ తరువాత కొన్ని పరిస్థితుల కారణంగా తల్లి భాగ్యశ్రీ తో కలసి ఇటలీ లోని రోమ్ కు వెళ్ళిపోతాడు.అప్పటి వరకు చాలా మంది అమ్మాయిలు విక్రమ్ కు ప్రపోజ్ చేసినా.. తన లైఫ్ లో ప్రేమ, పెళ్లికి తావులేదని ఫ్లటేషన్ షిప్ ఉందని నచ్చిన ప్రతి అమ్మాయితో సరదాగా గడుపుతుంటాడు.అదే రోమ్ లో డాక్టర్ గా పనిచేసే ప్రేరణ (పూజా హెగ్డే) కు డాక్టర్లు సైతం కనుగొనలేని డీసీజ్ తో బాధపడుతుంటుంది.తను త్వరలో చనిపోతానని తెలిసినా జీవితాన్ని ప్రతిరోజూ ఆస్వాదించాలి అనుకుని అందంగా ముస్తాభవుతూ ఎప్పుడూ సంతోషంగా ఉండే ప్రేరణను ట్రైన్ లో చూసిన మొదటి చూపులోనే ప్రేమలో పడతాడు విక్రమ్. ప్రభాస్ తో కలసిన కొన్ని రోజుల్లోనే ప్రేరణ కూడా విక్రమ్ ప్రేమలో పడుతుంది.ఒక రోజు ప్రేరణ తన చేయి విక్రమ్ కు చూయించి జాతకం చెప్పమనగా నువ్వు వందేళ్లు జీవిస్తావని చెపుతాడు.డాక్టర్లు అందరూ చనిపోతావ్ అంటుంటే విక్రమ్ మాత్రం వందేళ్లు బతుకుతావ్ అంటున్నాడు ఇదెలా సాధ్యం అని విక్రమ్ ను అడగగా తను చెప్పిన జాతకం ఎప్పటికీ తప్పు కాలేదని ప్రేరణతో బతుకు మీద ఆశను కల్పిస్తాడు విక్రమ్. ఇంతలో ప్రేరణకు విక్రమ్ గురించి ఒక షాకింగ్ న్యూస్ తెలుస్తుంది. దీంతో  ఆ సమస్యనుండి ఆదిత్య ఎలా గట్టెక్కాడు?విధితో సవాల్ చేసిన ప్రేరణ, విక్రమాదిత్య లు ప్రేమలో గెలిచి ఒక్కటయ్యారా ? లేదా అనేది థియేటర్ లో చూడవలసిందే…

నటీనటుల పనితీరు


పరమహంస (కృష్ణం రాజు) పెద్ద జ్యోతిష్య శాస్త్రవేత్త గా చక్కని నటనను ప్రదర్శించగా,పరమహంస శిష్యుడుగా విక్రమాదిత్య (ప్రభాస్) జ్యోతిష్యుడు పాత్రలో చాలా స్టైలిస్ట్ గా క్లాసిక్ నటనతో అలరిస్తూ ఆ పాత్రలో ఒదిగిపోయాడు. డాక్టర్ గా ప్రేరణ పాత్రలో పూజ హెగ్డే చక్కని నటనతో ఆకట్టుకుంది. తెరపై వీరిద్దరి కెమిస్ట్రీ చాలా చూడముచ్చట గా ఉంది.హీరో తల్లిగా నటించిన భాగ్యశ్రీ  నటన అందరినీ ఆకట్టు కుంటుంది. ఓడ కెప్టెన్ గా జయరాం,ప్రేరణ పెద నాన్న గా సచిన్ ఖేడ్ ఖర్, బిజినెస్ మ్యాన్ గా జగపతిబాబు, మురళీ శర్మ,, ప్రియదర్శి ,రిద్ది కుమార్, తో పాటు మిగిలిన నటీనటులు అందరూ వారికిచ్చిన పాత్రల్లో చక్కగా నటించి మెప్పించారు.

సాంకేతిక నిపుణుల పనితీరు
పెద్ద స్టార్స్ తో భారీ బడ్జెట్ తో తీసిన డీసెంట్ లవ్ స్టొరీ ని అందంగా తెరకెక్కిస్తూ..జోతిష్యం, హస్తికా ముద్రికం త‌దిత‌ర అంశాల‌కు జోడించి చాలా హ‌నెస్ట్‌గా చెప్పడం జరిగింది.. ఇందులో ట్రైన్ సీన్స్, టైటానిక్ షిప్ ఎపిషోడ్ సీన్స్ ను కూడా అద్భుతంగా  తెరకెక్కించాడు దర్శకుడు. సినిమాలో ఎంత ఫన్ ఉంటుందో, అంతే ఎమోషనల్ గా ఉంటుంది. ఫెంటాస్టిక్ లొకేషన్స్, విజువల్స్ ఎఫెక్ట్స్ మాత్రం రాధే శ్యామ్ సినిమా చూసిన ప్రేక్షకుల  మనసు దోచుకుంటాయి.అయితే సినిమాలో మాస్ ఎలిమెంట్స్ లేకపోవడం ఫ్యాన్స్ కు నిరాశకలిగిందని చెప్పచ్చు.సినిమా మొత్తం హీరో, హీరోయిన్స్ చుట్టూనే సాగుతుంది. కథలో ట్విస్ట్ లు లేకపోవడం, సినిమాలో పెద్ద స్టార్స్ ఉన్నప్పటికీ వారిని సరిగా వాడుకోలేకపోయారు.పాన్ ఇండియా స్టార్  ఇమేజ్ ఉన్న ప్రభాస్ ఇందులో నటించినా కథ, కథనంపై దృష్టి పెట్టకుండా..యూరప్ అందాలను ఎక్కువ చూపెడుతూ.. విజువల్స్ ఎఫెక్ట్స్ పైనే ఎక్కువ దృష్టి పెట్టాడు దర్శకుడు రాధాకృష్ణ. జస్టిన్ ప్రభాకర్ మ్యూజిక్ పరవాలేదు. థమన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం సినిమాకు ప్రాణం పోసిందనే చెప్పాలి.మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ చాలా రిచ్ గా ఉంది. కోటగిరి వెంకటేశ్వర రావు ఎడిటింగ్ గ్రిప్పింగ్ గా ఉంది..కమల్ కన్నన్ విజువల్స్ ఎఫెక్ట్స్ అద్భుతంగా ఉన్నాయి.
 ఇవన్నీ కథను మరో స్థాయికి తీసుకెళ్లాయి. ప్రముఖ నిర్మాణ సంస్థలు గోపీ కృష్ణ మూవీస్, యూవీ క్రియేష‌న్స్ లపై  వంశీ, ప్ర‌మోద్, ప్ర‌సీధ‌ లు నిర్మించిన నిర్మాణ విలువలు క్వాలిటీ గా.. రిచ్ గా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాను నిర్మించారు. ఎన్నో రోజుల తరువాత థియేటర్లో విడుదలైన “రాధే శ్యామ్”  సినిమా అభిమానులకు విక్రమాదిత్య గా ప్రేక్షకులను అలరించాడు. ఒక కంప్లీట్ లవ్ & ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా పప్రేక్షకుల ముందుకు వచ్చిన “రాధే శ్యామ్” సినిమా చూసిన వారందరికీ కచ్చితంగా నచ్చుతుంది.

      Cinemarangam. com   Review Rating..3.5/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here