A Rom- Com Entertainer’s ‘Lingoccha’ Movie Review

Cinemarangam.Com
సినిమా : “ లింగోచ్చా ”
విడుదల తేదీ : అక్టోబర్ 27, 2023
రివ్యూ రేటింగ్ : 3 /5
బ్యానర్ : శ్రీకాల ఎంటర్టైన్మెంట్స్
సమర్పణ.. జే. నీలిమ
నిర్మాత.. యాదగిరి రాజు
సహ నిర్మాత.. మల్లేష్ కంజర్ల
దర్శకత్వం.. ఆనంద్ బడా
రచయిత.. ఉదయ్ మదినేని
సంగీతం.. బికాజ్ రాజ్
నటీనటులు.. కార్తిక్ రత్నం, సుప్యర్ధ సింగ్, ఉత్తేజ్, తాగుబోతు రమేష్, కునాల్ కౌషిక్ . కె, ఫిదా మౌగాల్, ప్రేమ్ సుమన్, భల్వీర్ సింగ్, పటాస్ సద్దామ్, కె. నరసింహ (మిమిక్రి ఆర్టిస్ట్), ఇస్మాయిల్ భాయ్, ఫిష్ వెంకట్, కళా సాగర్, శరత్ కుమార్ తదితరులు
ఎడిటర్.. మ్యాడి అండ్ షాహి బదా
ఎగ్జెక్యూటివ్ ప్రోడ్యూసర్.. ఎ ఆర్. సౌర్య
ప్రోడక్షన్ డిజైన్.. అనిల్ కుమార్ తీగల
లైన్ ప్రోడ్యూసర్.. సందీప్ తుంకూర్, శ్రీనాథ్ చౌదరి,
పి ఆర్ ఓ.. ఏలూరు శ్రీను , ధీరు అండ్ ప్రసాద్ లింగం

టాలీవుడ్ లొ తక్కువ టైం లో నటుడి గా చాలా మంచి పేరు సంపాయిందచిన కార్తిక్ రత్నం హీరోగా ,నూతన నటిగా పరిచయం అవుతున్న స్టన్నింగ్ బ్యాూటి సుప్యర్ద సింగ్ హీరోయిన్ గా ఆనంద్ బడాని ని దర్శకుడిగా పరిచయం చేస్తూ జె నీలిమ శ్రీకాల ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో యాదగిరి రాజు నిర్మించిన చిత్రం “లింగోచ్చా”(గేమ్ ఆఫ్ లవ్ అనే ట్యాగ్ లైన్). ఆ చిత్రానికి జె నీలిమ సమర్సిస్తుండగా మల్లేష్ కంజర్ల సహ నిర్మాతగా నిర్వహిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకోని ప్రపంచ వ్యాప్తంగా అక్టొబర్ 27న గ్రాండ్ గా విడుదలైన “లింగోచ్చా” చిత్రం ఎలా ఉందో రివ్యూ లో చూద్దాం పదండి .

కథ

శివ (కార్తిక్ రత్నం) హైదరాబాద్ పాతబస్తీ లో నాయి బ్రాహ్మణ కుటుంబానికి చెందిన కుర్రాడు. కటింగ్ చేయటంలో బాగా పేరుగాంచిన శివ చిన్నప్పుడే తన స్నీహితులతో కలసి లింగొచ్చా(ఏడు పెంకులాట) ఆడుతుంటే నూర్జహ (సుప్యర్థ సింగ్) ని చూసి ప్రేమలో పడతాడు. చిన్నప్పటి సంది నూర్జహ ని ప్రేమిస్తూనే వుంటాడు. ఇంతలో నూర్జహ ని వాళ్ళ తల్లితండ్రులు దుబాయ్ కి పంపిస్తాడు. అంతే శివ ప్రతిరోజు నూర్జహ కొసం ఇంటికి పోతూ వస్తుంటాడు. చిన్నప్పుడు దుబాయ్ కి వెళ్ళిన నూర్జహ పెద్దయ్యాక మెడికల్ స్టూడెంట్ గా హైదరాబాద్ కి వచ్చింది. అంతే శివ తన స్నేహితులు సలహలు పాటించి నూర్జహ దగ్గర ఫూల్ అవుతూ వుంటాడు. ఒక రోజు నూర్జహ శివ మనసు తెలుసుకుని తన ప్రేమని చెప్తుంది. వీళ్ళిద్దరి ప్రేమ విషయం తెలుసుకున్న నూర్జహ తండ్రి వేరే పెళ్ళి సంబందం చూస్తాడు. ఆ విషయాన్ని శివ కి చెప్పి దుబాయ్ వెళ్ళిపోదామని చెప్తుంది నూర్జహ.. శివ నూర్జహ చెప్పింది అంగీకిరించి దుబాయ్ వెళ్దామని ముందుగా నూర్జహ ని పంపిస్తాడు. తరువాత శివ తన పెరెంట్స్ ని దొస్త్ గాళ్ళని వదిలి నూర్జహ కొసం దుబాయ్ వెళ్ళాడా.. లేదా.. సింగిల్ గా వెళ్ళిన నూర్జహ దుబాయ్ లో ఏం చేసింది. పాతబస్తీలో శివ, నూర్జహ లవ్ స్టోరి ఎంతవరకూ వచ్చింది.. వీళ్ళు కలుసుకున్నారా.. లేదా అనేది తెలుసుకోవాలి అంటే కచ్చితంగా థియేటర్ కు వెళ్లి “లింగోచ్చా” సినిమా చూడాల్సిందే..

నటీ నటుల పనితీరు
కార్తిక్ రత్నం ధియోటర్ ఆర్టిస్ట్ కావడం వలన పాత్రలో పరకాయ ప్రవేశం చేశాడు. అతని సింగిల్ హ్యాండ్ లో కథ ని తీసుకెళ్ళాడు. హీరోయిన్ సుప్యర్థ సింగి ముద్దుగా అందర్ని ఆకట్టుకుంది. నటన, ఎక్స్ప్రెషన్స్ కూడా బాగా పలికించింది. తాగుబోతు రమేష్, ఉత్తేజ్ లు స్టోరి నేరేటర్స్ గా మెప్పించారు. ఇంకా ఇందులో నటించిన కునాల్ కౌషిక్ . కె, ఫిదా మౌగాల్, ప్రేమ్ సుమన్, భల్వీర్ సింగ్, పటాస్ సద్దామ్, కె. నరసింహ (మిమిక్రి ఆర్టిస్ట్), ఇస్మాయిల్ భాయ్, ఫిష్ వెంకట్, కళా సాగర్, శరత్ కుమార్ తదితరులు అందరూ వారికిచ్చిన పాత్రలలో నటించి ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేశారు.

సాంకేతిక నిపుణుల పనితీరు
హైదరాబాది నవాబ్స్, అంగ్రేజ్ లాంటి చిత్రాలతో లోకల్ లో సంచలన విజయాలు సాధించిన చాలా సంవత్సరాలు తరువాత మళ్ళీ హైదరాబాద్ నేటివిటి స్టొరీ తో లింగోచ్చా వచ్చింది. ఇలాంటి నేపథ్యం ఉన్న స్టోరీ ని సెలెక్ట్ చేసుకున్న దర్శకుడు ఆనంద్ బడా ని మొచ్చుకొవాలి,ఆనంద్ కొత్తవాడైనా కూడా కొత్తదనం తనలో కనబడకుండా ఎంత ఎక్స్పీరియన్స్ డైరెక్టర్ లాగా ఈ సినిమాను తీసుకుని వచ్చాడు. లవ్ స్టొరి ని చెప్పే విధానం లో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. అలాగే నటీనటుల నుంచి నటన రాబట్టుకున్నాడు. మ్యూజిక్ బికాజ్ రాజ్ మంచి సంగీతాన్ని అందించాడు. ఎడిటింగ్ పర్వాలేదనిపించింది. కెమెరామెన్  హైదరాబాద్ పాతబస్తి లొ లొకేషన్స్ ని అందంగా చూపించాడు. ఆర్ట్ వర్క్ కూడా బాగుంది. డైలాగ్స్ హైలెట్ గా నిలుస్తాయి..మిగతా టెక్నిషియన్స్ అందరూ వారి వారి పరిదిలో బాగా చేసారు.జె నీలిమ సమర్పణలో శ్రీకాల ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై యాదగిరి రాజు నిర్మించిన నిర్మాణ విలువులు చాలా రిచ్ గా ఉన్నాయి. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే “లింగోచ్చా” సినిమా ను ఫ్యామిలీ తో కలసి హాయిగా చూసి ఎంజాయ్ చేయచ్చని కచ్చితంగా చెప్పచ్చు..ఫైనల్ గా చెప్పాలి అంటే హైదరాబాద్ లో బిర్యాని, ఇరాని ఛాయ్ ఎలా ఉంటుందో ఈ “లింగోచ్చా” కూడా అలాగే ఉంటుంది.

Cinemarangam.Com Review Rating 3/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here