‘Aatagadara Shivaa’ Event on Jan 5th,2020 at Shilpakalavedika.

జనవరి 5న ‘ఆటగదరా శివ’ సంగీత విభావరి
ప్రముఖ నటుడు, రచయిత, కవి, దర్శకుడు తనికెళ్ల భరణి రాసిన ‘ఆటగదరా
శివా’ గేయ కావ్యం సంగీత విభావరిగా సంగీతాభిమానుల ముందుకు రానుంది.
వచ్చే ఏడాది జనవరి 5వ తేదీ సాయంత్రం 6.30 గంటలకు హైదరాబాద్ లోని
శిల్పకళావేదికలో ఈ కార్యక్రమాన్ని ప్రదర్శించనున్నారు. స్వతహాగా శివభక్తుడైన
తనికెళ్ల భరణి రాసిన  శివతత్త్వాలు అనేకం ఇప్పటికే జనంలోకి వెళ్లాయి. సంగీత
దర్శకుడు, ప్రఖ్యాత వేణుగాన విధ్వాంసుడు ఫ్లూట్ నాగరాజ్ ఈ ‘ఆటగదరా శివ’ తత్వాలకు సంగీత దర్శకత్వం అందించనున్నారు. ఇవామ్, తెలంగాణ కల్చరల్ అండ్ టూరిజం మినిస్ట్రీ సహకారంతో నిర్వహించే ఈ కార్యక్రమాన్ని అలేఖ్య హోమ్స్ సమర్పిస్తోంది. ఈ కార్యక్రమానికి శ్రీమతి మణినాగరాజ్ రూపకల్పన చేయగా, హీరో సాయికుమార్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తారు. విశ్వవిఖ్యాత డ్రమ్మర్ శివమణి, గిటార్ వాద్యకారిణి మోహినీ డే పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమానికి చెన్నైబృందం వాద్య సహకారం అందిస్తుంది.  జంట నగరాలకు చెందిన గాయకులు ఈ పాటలు పాడతారు. పలువురు సినీ ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరవుతారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here