Actor Naveen Chandra interview about Varuntej Movie ‘Ghani’

అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, బాలీవుడ్ బ్యూటీ సాయి మంజ్రేకర్, జగపతి బాబు,సునీల్ శెట్టి, ఉపేంద్ర,నవీన్ చంద్ర నటీనటులుగా కిరణ్ కొర్రపాటి  దర్శకత్వంలో అల్లు బాబీ కంపెనీ, రెన‌సాన్స్ ఫిలింస్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం “గని”. మ్యూజిక్ సెన్సేష‌న‌ల్ ఎస్‌.ఎస్‌.త‌మ‌న్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి జార్జ్ సి.విలియ‌మ్స్ సినిమాటో గ్ర‌ఫీ అందిస్తున్నారు. ఎప్రిల్ 8న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానున్న సందర్భంగా నటుడు నవీన్ చంద్ర విలేకరులతో మాట్లాడుతూ..

రైల్వే లో పనిచేసే మా మేనమామ టి.శివ కుమార్ జాతీయ బాక్సర్.ఆయన స్ఫూర్తితో చిన్నప్పట్నుంచి బాక్సర్ కావాలను కునేవాన్ని కానీ.. యాక్టర్ అయ్యాను. “గని” సినిమాలో ఆది క్యారెక్టర్ లో బాక్సర్ గా చేయడంతో బాక్సర్ కావాలనే కోరిక ఈ సినిమాతో తీరడంతో కల నిజమైన భావన కలిగింది. ఇందులో ఆది కారెక్టర్ గా నెగెటివ్ షేడ్స్ లో నటిస్తున్నాను.కథను ముందుకు తీసుకెళ్లే అలాంటి పాత్రని ”గని”లో మరోసారి చేయడం నటుడిగా ఎంతో తృప్తిని ఇచ్చింది.

లాక్ డౌన్ టైం లో ఈ కథ విన్నాను. ఇంత పెద్ద ప్రాజెక్టు లో నటించే అవకాశం ఇచ్చిన దర్శక,నిర్మాతలకు ధన్యవాదాలు. లాక్ డౌన్స్ వల్ల బాక్సర్ గా చాలా రోజులు ఫిట్ గానే ఉండడం చాలెంజింగ్ గా అనిపించింది. ట్రైనర్స్ మాతో ఉంటూ మమ్మల్ని ఫిట్ గా ఉండేలా చూసుకున్నారు. అలాగే నిజమైన బాక్సర్ లా కనిపించాలని జాతీయ స్థాయి బాక్సర్స్ తో ప్రత్యేక శిక్షణ తీసుకున్నాను.దర్శకుడు కిరణ్ కొర్రపాటి,హీరో వరుణ్,నిర్మాతలు నన్ను బాగా ప్రోత్సహించారు.

ఉపేంద్ర గారు,సునీల్ శెట్టి గారు,జగపతి బాబు గారు,నదియా వంటి సీనియర్లు ఈ సినిమాకు పని చేయడం చాలా సంతోషంగా వుంది. వరుణ్ తేజ్ అమేజింగ్ యాక్టర్ తనతో నాకిది మొదటి సినిమా.వరుణ్ బుజానికి గాయం అయినా కూడా..ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు.కరోనా సమయంలో నిబంధనలు పాటిస్తూ షూటింగ్ చేసినప్పుడు సిద్ధూ, అల్లు బాబీ గార్లు ప్రతి రోజు యూనిట్లో అందరికీ కరోనా పరీక్షలు చేయిస్తూ.. చాలా జాగ్రత్తలు తీసుకున్నారు.ఈ సినిమా కోసం యూనిట్ అంతా చాలా కష్టపడ్డారు. చూసిన ప్రతి ఒక్కరికీ ఈ సినిమా కచ్చితంగా నచ్చుతుంది.

అరవింద సమేత వీర రాఘవ యాక్టర్ గా నన్ను మెరుగుపరచింది.”గని” చిత్రంలోని ఆది క్యారెక్టర్ మరో ఎక్స్పీపీరియన్స్. డేట్స్ కుదరకపోవడం వల్ల  తమిళ్ హిట్ మూవీ “సారపట్ట పరంపర”లో అవకాశాన్ని కోల్పోయాను. రామ్ చరణ్ గారు హీరోగా శంకర్ గారి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో ఓ కీలక పాత్ర చేస్తున్నాను. ఏప్రిల్ 7 న మొదలయ్యే అమృత్సర్ షెడ్యూల్ లో నేను పాల్గొంటాను.ఇక నేను హీరో గా చేసిన నాలుగు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.మరో నాలుగు  ప్రాజెక్ట్స్ సెట్స్ పై ఉన్నాయి అన్నారు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here