Ala Vaikuntapuramulo Movie Review

Release date :January 12th,2020
Cinemarangam.com.. Rating : 3.5/5
Movie name:-”Ala Vaikuntapuramulo
Banners:-GeetaArts, Harika & Hasini Creations
Starring:-Allu Arjun,Pooja Hegde,Tabu,Jayaram,Murali Sharma, Sushant,Navdeep, Nivedita Pethuraju,Samudrakhani,Brahmanandam,Sunil,Rajendra Prasad,Brahmaji,Sachin Khedkar,Rohini,Rahul Ramakrishna,Vennala kishor,Thanikella Bharani,Ajay
Music Director :-S.S.Taman
Editor:-Naveen Nuli
Cinematography:-p.s.vinod
Director :-Trivikram
Producer :-Allu Aravind, S. Radhakrishna

అల్లు అర్జున్‌ హీరోగా త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ”అల వైకుంఠపురములో” సినిమా మీద బన్నీ ఫ్యాన్స్‌  చాలా ఆశలు పెట్టుకున్నారు. లాంగ్ గ్యాప్‌ తరువాత అల్లు అర్జున్‌ తెర మీద కనిపిస్తుండటం, జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి లాంటి హిట్స్ అందించిన క్రేజీ కాంబినేషన్‌లో సినిమా తెరకెక్కడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. బన్నీ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను గీతా ఆర్ట్స్, హారికా హాసిని క్రియేషన్స్‌ బ్యానర్లపై అల్లు అరవింద్‌, రాధాకృష్ణ (చినబాబు) లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తమన్‌ సంగీతమందించిన ఈ సినిమా ఆదివారం (జనవరి 12) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా అభిమానుల అంచనాలను అందుకుందా..? లాంగ్‌ గ్యాప్‌ తరువాత ఆడియన్స్ ముందుకు వచ్చిన బన్నీ మెప్పించాడా..? త్రివిక్రమ్ మరోసారి మాయ చేశాడా..?

 కథ:

వాల్మీకి (మురళి శర్మ) అనే మధ్యతరగతి తండ్రి,మిలియనీర్ రామచంద్ర (జయరామ్) ఇంట్లో పనిచేసేవాడు.టబు, రోహిణిలు ఒకేసారి ఒకే హాస్పిటల్‌లో ఇద్దరు మగ పిల్లలకు జన్మనిస్తారు,తన కొడుకు డబ్బున్న ఇంట్లో పెరగాలన్న ఆశతో బిడ్డలను ,తన మిలియనీర్ బాస్ రామచంద్ర (జయరామ్) బిడ్డతో ఆసుపత్రిలో మార్చేస్తాడు వాల్మీకి . ఏకైక సాక్ష్యం అయిన ఒక నర్సు ఆ సంఘటన తర్వాత కోమాకు వెళుతుంది. వాల్మీకి తన యజమాని కొడుకు బంటు (అల్లు అర్జున్) ను పెంచుతాడు,అదే సమయంలో అమూళ్య (పూజా హెగ్డే) నడుపుతున్న ఓ ట్రావెల్‌ ఏజెన్సీలో బంటుకి ఉద్యోగం వస్తుంది. అలా మొదలైన అమూళ్య, బంటుల పరిచయం ప్రేమగా మారుతుంది. మరియు వాల్మీకి బంటుని వైకుంతపురంలో నివసించే అసలు తల్లిదండ్రుల దగ్గరకు వెళ్ళకుండా చూస్తాడు. 20 ఏళ్ళకు  తరువాత,కోమలోనుంచి బయటకు వచ్చిన నర్స్ ద్వారా అనుకోని పరిస్థితుల్లో బంటు తన అసలు తల్లిదండ్రుల గురించి తెలుసుకుంటాడు.ఈ కథకు దుర్మార్గుడైన అప్పల నాయుడు (సముద్రఖని) కి సంబంధం ఏంటి..? తన తల్లిదండ్రుల కుటుంబం ఎదుర్కొంటున్న సమస్యలను అతను ఎలా పరిష్కరిస్తాడు?అనేది కథ .

నటీనటులు:

అల్లు అర్జున్ అద్భుతమైన నటనను అందించారు. పూజా హెగ్డే తన పాత్రకు న్యాయం చేసింది, మరియు హీరోతో ఆమె కెమిస్ట్రీ తెరపై చూడటానికి చూడముచ్చటగా ఉంది.ఈ చిత్రంలో ఆరు పాటలు స్విచ్ వేషన్ తగ్గట్టు ఉన్నాయి,లాంగ్ గ్యాప్‌ తరువాత స్క్రీన్‌ మీద  బన్నీ అభిమానులకు ఫుల్‌ ట్రీట్‌ ఇచ్చాడు. కామెడీ, యాక్షన్‌, రొమాన్స్‌, సెంటిమెంట్‌ ఇలా అన్నింటిలో తనదైన స్టైల్‌లో చెలరేగిపోయాడు. ఒక్క మాటలో చెప్పాలంటే సినిమా అంతా వన్‌మేన్‌ షోలా సాగింది. వినోదం కూడా ఎక్కువే, కామెడీ టైమింగ్‌, స్టైలింగ్‌తో పాటు ఎమోషనల్‌ సీన్స్‌లోనూ సూపర్బ్‌ అనిపించాడు. అల్లు అర్జున్‌ను ‘స్టైలిష్ స్టార్’ అని ఎందుకు పిలుస్తారు అనేదానికి ఆ పోరాట సన్నివేశం ఒక్క నిదర్శనం.మరియు ఆ పాత్ర అతని కోసం తయారు చేసినట్లు అనిపిస్తుంది. అతను ఎమోషనల్, మరియు కొరియోగ్రాఫ్ చేసిన యాక్షన్ సన్నివేశాలలో రెండింటిలోనూ అద్భుతంగా చేసాడు. నౌకాశ్రయంలోని యాక్షన్ సన్నివేశం బాగుంది. త్రివిక్రమ్ చేసిన డైలాగులు కూడా ఈ చిత్రానికి పెద్ద ప్లస్.. విలక్షణ నటుడు మురళీశర్మ మరోసారి తన మార్క్‌ చూపించాడు. కొడుకును నిరుత్సాహపరిచే తండ్రి పాత్రలో ఆయన నటన ఆకట్టుకుంటుంది. టబు, జయరామ్‌లు తమ పాత్రలో హుందాగా ఒదిగిపోయారు. ఎమోషనల్‌ సీన్స్‌ను వారి అనుభవంతో అద్భుతంగా పండించారు.నివేదాపేతురాజ్‌లు కేవలం గ్లామర్‌ షోకు మాత్రమే పరిమితమైంది. హీరోగా కొనసాగుతున్న సుశాంత్‌ను స్పెషల్ రోల్‌ కోసం తీసుకున్నా.. అనుకున్న స్థాయిలో వినియోగించుకోలేదనిపిస్తుంది. ఇతర పాత్రల్లో సునీల్‌, వెన్నెల కిశోర్‌, నవదీప్‌, రాహుల్‌ రామకృష్ణ తమ పాత్రల పరిధిమేరకు ఆకట్టుకున్నారు.

సాంకేతికత:

సాంకేతిక వర్గం విషయానికి వస్తే సినిమాకు ప్రధాన బలం తమన్ అందించిన సంగీతం. ఆడియో సినిమా రిలీజ్‌కు ముందే సూపర్‌ హిట్ అయ్యింది. సామజవరగమన, రాములో రాములా, బుట్ట బొమ్మ పాటలు తెర మీద కూడా సూపర్బ్ అనిపించేలా ఉన్నాయి. మిగిలిన పాటలు కూడా అలరిస్తాయి. నేపథ్య సంగీతంలోనూ తమన్‌ తన మార్క్ చూపించి ది బెస్ట్ అనిపించుకున్నాడు. త్రివిక్రమ్‌ తన టేకింగ్‌తో ఆడియన్స్‌ను ఎంగేజ్‌ చేయటంలో సక్సెస్‌ అయ్యాడు, త్రివిక్రమ్‌ మార్క్‌ కామెడీ ఆడియన్స్‌కు కితకితలు పెడుతుంది. త్రివిక్రమ్ చేసిన డైలాగులు కూడా ఈ చిత్రానికి పెద్ద ప్లస్. సినిమాకు మరో ప్రధాన బలం పీఎస్ వినోద్‌ సినిమాటోగ్రఫి ప్రతీ ఫ్రేమ్‌ రిచ్‌గా కలర్‌ఫుల్‌గా చూపించేందుకు సినిమాటోగ్రాఫర్‌ పడ్డ కష్టం తెర మీద కనిపిస్తుంది. ముఖ్యంగా సాంగ్స్‌లో విజువల్స్‌ చూపుతిప్పుకోనివ్వని విధంగా ఉన్నాయి. చార్ట్‌బస్టర్ పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, పిక్చరైజేషన్, బ్రిలియంట్ యాక్షన్ అండ్ డ్యాన్స్ కొరియోగ్రఫీ మరియు డైలాగ్‌లు టెక్నికల్ ఫ్రంట్‌లోని ఆకర్షణలు. బన్నీ చేస్తున్న సినిమా కావటంతో నిర్మతలు అల్లు అరవింద్‌, రాధాకృష్ణలు ఖర్చుకు ఏమాత్రం వెనుకాడకుండా భారీగా ఖర్చు చేశారు.

    Cinema rangam.com..3.5/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here