శ్రీనికిత మాట్లాడుతూ.. ‘అలిపిరికి అల్లంత దూరంలో “లాంటి మంచి కథలో నన్ను భాగం చేసిన దర్శకుడు ఆనంద్ గారికి, నిర్మాతలు రమేష్, రాజేంద్ర గారికి కృతజ్ఞతలు. ఫణి కళ్యాణ్ గారు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. మా తిరుపతి సాంగ్ పెద్ద హిట్ అయ్యింది. డీవోపీ డిజికె బ్రిలియంట్ విజువల్స్ ఇచ్చారు. కొత్తనటీనటులు కలిసి చేసాం. ఖచ్చితంగా కొత్త అనుభూతిని ఇస్తుంది. అందరికీ కనెక్ట్ అయ్యే కథ ఇది. నవంబర్ 18న అందరూ థియేటర్ లో చూడాలి” అని కోరారు.
దర్శకుడు ఆనంద్ జె మాట్లాడుతూ.. ‘అలిపిరికి అల్లంత దూరంలో’ దర్శకుడిగా నా మొదటి సినిమా. మా నిర్మాతలు ఎక్కడా రాజీపడకుండా నిర్మించారు.మా నిర్మాతలకు కృతజ్ఞతలు. డీవోపీ డిజికె, సంగీతం ఫణి కళ్యాణ్, ఎడిటర్ సత్య గిడుతూరి, కిట్టువిస్సాప్రగాడ, అందరూ బ్రిలియంట్ వర్క్ ఇచ్చారు. మా తిరుపతి సాంగ్ పెద్ద హిట్ అయ్యింది. కొత్త నటీనటులు అందరూ చాలా అంకితభావంతో చేశారు. రావణ్ నిట్టూరు, శ్రీనికిత చాలా హార్డ్ వర్క్ చేశారు. వీరందరికీ మంచి అవకాశాలు రావాలి. నవంబర్ 18న సినిమా విడుదలౌతుంది. ఇందులో పూర్తిగా తిరుపతి నేటివిటీని చూస్తారు. మీ అందరికీ తప్పకుండా సినిమా నచ్చుతుంది” అన్నారు
నిర్మాత రెడ్డి రాజేంద్ర పి మాట్లాడుతూ.. ‘అలిపిరికి అల్లంత దూరంలో’ చిత్రానికి పని చేసిన అందరూ చాలా అంకిత భావంతో పని చేశారు. దర్శకుడు ఆనంద్ ఈ సినిమాకి కర్త కర్మ క్రియగా ముందుకు నడిపారు. డీవోపీ డిజికె, సంగీతం ఫణి కళ్యాణ్, ఎడిటర్ సత్య గిడుతూరి అందరూ అద్భుతంగా పని చేశారు. నటీనటులు అందరూ చాలా అనుభవం వారిలా ఫెర్ ఫార్మ్ చేశారు. 16న భారీగా ప్రీరిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేశాం. అయితే ప్రస్తుతం నెలకొన్న విషాదం సమయంలో వేడుకని రద్దు చేశాం. ‘అలిపిరికి అల్లంత దూరంలో’ అందరికీ కనెక్ట్ అయ్యే సినిమా ఇది. థ్రిల్లర్ తో పాటు ప్యామిలీ ఎలిమెంట్స్ తో డివైన్ టచ్ వున్న సినిమా ‘అలిపిరికి అల్లంత దూరంలో. నవంబర్ 18న తెలుగు రాష్ట్రాలతో పాటు బెంగళూరు, ఓవర్సీస్ లో కూడా విడుదల కాబోతుంది. అందరూ థియేటర్ లో చూసి మనస్పూర్తిగా ఆదరించాలి” అని కోరారు.
నిర్మాత రమేష్ డబ్బుగొట్టు మాట్లాడుతూ.. ‘అలిపిరికి అల్లంత దూరంలో’ సినిమా అంతా తిరుపతిలోనే జరుగుతుంది. తిరుపతి నెటివిటీకి తగ్గట్టు అందరూ కొత్త వారితోనే సినిమా చేశాం. నటీనటులంతా అద్భుతంగా చేశారు. శతావధాని మురళి గారు మేము అడగగానే హరిదాసు పాత్రని ఇందులో చేశారు. అలాగే కథ మొత్తాన్ని పద్యంలో గొప్పగా రాసిచ్చారు. సినిమా అద్భుతంగా వచ్చింది. ప్రేక్షకులని ఖచ్చితంగా ఆకట్టుకుంటుంది” అన్నారు.
నటీనటులు: రావణ్ నిట్టూరు, శ్రీ నికిత, అలంకృత షా, బొమ్మకంటి రవీందర్, అమృత వర్షిణి సోమిశెట్టి, లహరి గుడివాడ
టెక్నికల్ టీం :
దర్శకత్వం: – ఆనంద్ జె
నిర్మాతలు: రమేష్ డబ్బుగొట్టు, రెడ్డి రాజేంద్ర పి
బ్యానర్: కాస్కేడ్ పిక్చర్స్
డీవోపీ: డిజికె
సంగీతం : ఫణి కళ్యాణ్
ఎడిటర్ : సత్య గిడుతూరి
పీఆర్వో : తేజస్వి సజ్జా