Allu Arjun New Movie Puspa First Look Launch

మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా సంయుక్త‌ నిర్మాణంలో సుకుమార్ హ్యాట్రిక్ కాంబినేషన్లో,స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్,రష్మిక మందన్న హీరో, హీరోయిన్లు గా రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్  సంగీత  దర్శకత్వంలో రూపొందుతున్న‌ క్రేజీ ప్యాన్ ఇండియా మూవీ ఇటీవ‌లే పూజా కార్య‌క్ర‌మాల‌తో మొద‌లైన సంగ‌తి తెలిసిందే. అల‌వైకుంట‌పురంలో సినిమాతో సంచలన విజయాన్ని అందుకున్న అల్లు అర్జున్ క్రేజీ దర్శకుడు సుకుమార్ తో ఆర్య, ఆర్య 2 చిత్రాల తరువాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ & సుకుమార్ కాంబినేషన్ లో వస్తోన్న సినిమా కావడంతో అభిమానుల్లో సినీ వర్గాల్లో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. 

ఈ సినిమా లో అల్లు అర్జున్ ఎలా ఉండ‌బోతున్నారో అని ఉత్కంఠ‌గా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కి తెరదించుతూ అల్లు అర్జున్ కి సంబంధించిన ఫస్ట్ లుక్ని   అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్బంగా విడుదల చేయ‌డం విశేషం.ఈ మూవీ ఫ‌స్ట్ లుక్  అల్లు అర్జున్ అభిమానుల‌కే కాదు మాస్ మ‌సాల ఫ్యాన్స్ కు ఫుల్ కిక్ ఇచ్చే రేంజ్ లో ఊర మాస్ లుక్ లో అల్లు అర్జున్  కనిపిస్తున్నాడు. శేషాచలం అడవుల నేపథ్యంలో సాగె కథతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి పుష్ప అనే టైటిల్ ఖరారు చేసారు.ఈ చిత్రం గురించి మరిన్ని విశేషాలు చిత్ర యూనిట్ త్వరలో తెలియజేస్తారు.

నటీనటులు :
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ (హీరో)
రష్మిక మందన్న (హీరోయిన్)

సాంకేతిక నిపుణులు :
బ్యానర్: మైత్రి మూవీ మేకర్స్
సహ నిర్మాత – ముత్తంశెట్టి మీడియా
డైరెక్టర్: సుకుమార్
ప్రొడ్యూసర్స్: నవీన్ ఎర్నేని, రవి శంకర్.వై
కెమెరామెన్: మిరోస్లోవ్ కుబ బ్రోజెక్
మ్యూజిక్: దేవి శ్రీ ప్రసాద్
ఎడిటర్: కార్తిక్ శ్రీనివాస్
ఆర్ట్ డైరెక్టర్: ఎస్.రామకృష్ణ , మౌనిక
సి.ఈ. ఓ: చెర్రీ
లైన్ ప్రొడ్యూసర్: బాల సుబ్రమణ్యం కె.వి.వి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here