‘Amigos’ Movie Review it a engaging thriiler

Cinemarangam.Com
సినిమా : “అమిగోస్
రివ్యూ రేటింగ్ : 3/5
విడుదల తేదీ : 10/2/23
బ్యానర్ : మైత్రీ మూవీ మేకర్స్
నిర్మాతలు : నవీన్ యెర్నేని, వై రవిశంకర్
దర్శకుడు: రాజేంద్ర రెడ్డి
నటీనటులు : కళ్యాణ్ రామ్, ఆషికా రంగనాథ్, బ్రహ్మాజీ, సప్తగిరి తదితరులు
సంగీతం : జిబ్రాన్
సినిమాటోగ్రఫీ : .ఎస్. సౌందర్ రాజన్
ఎడిటర్ : తమ్మి రాజు
పి. ఆర్. ఓ : వంశీ కాక


డిఫ‌రెంట్ చిత్రాలు, విలక్ష‌ణ‌మైన పాత్ర‌ల్లో న‌టిస్తూ త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌మైన గుర్తింపు సంపాదించుకున్న నటుడు నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్. “బింబిసార” విజయం తర్వాత త్రిపాత్రిభిన‌యంలో న‌టిస్తూ “ఆమిగోస్” సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రంలో ఆషిక రంగనాథ్ నహీరోయిన్ గా నటించింది. రాజేంద్ర రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై న‌వీన్ ఎర్నేని, వై.ర‌విశంక‌ర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్ప‌టికే విడుద‌లైన ‘అమిగోస్’ మూవీ టీజ‌ర్‌, సాంగ్స్‌కి సూప‌ర్బ్ రెస్పాన్స్ వ‌చ్చాయి.అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ప్ర‌పంచ వ్యాప్తంగా ఫిబ్ర‌వ‌రి 10న గ్రాండ్ లెవ‌ల్లో విడుదల అవుతున్న “ఆమిగోస్” చిత్రం ఎలా ఉందో రివ్యూ లో చూద్దాం పదండి.


సిద్ధార్థ్, (బిజినెస్ మ్యాన్ )మంజునాథ్ (సాఫ్ట్ వేర్) , మైఖేల్ (అండర్ కవర్ డాన్ బిపిన్ )అనే ముగ్గురు డోపల్ గాంగ్‌లు. అంటే రక్త సంబంధం లేకుండా చూసేందుకు అచ్చం ఒకే పోలిలకలతో ఉండే వ్యక్తులు. అయితే వీరిలోని మైఖేల్ దేశానికి విఘాతం కల్పిస్తున్నాడన్న ఇన్ఫర్మేషన్ NIA కు రావడంతో మైఖేల్ ను పట్టుకోవడానికి NIA బృందం ప్రయత్నించగా ఆ బృందానికి దొరక్కుండా మైఖేల్ చుక్కలు చూపిస్తుంటాడు , అయితే మైఖేల్ తనను తాను కాపాడు కోవడానికి అమాయకులైన సిద్దార్త్ , మంజునాథ్ లని వాడుకుంటాడు చివరకు మంజునాథ్, సిద్ధార్థ్ మరియు మైఖేల్ జీవితాలు ఎలా మారాయి ? మరియు NIA మైఖేల్‌ను పట్టుకుందా అనేది తెలుసుకోవాలి అంటే ఆమిగోస్ సినిమా చూడాల్సిందే…

నటీ నటుల పనితీరు
కళ్యాణ్ రామ్ సిద్ధార్థ్ గా, మంజునాథ్‌ గా , మైఖేల్ అలియాస్ బిపిన్ గా ఇలా మూడు పాత్రల్లో చక్కటి వైవిద్యాన్ని ప్రదర్శించాడు. ఈ పాత్రల కోసం తను ఎంత కష్ట పడ్డాడో తెరపై చూస్తుంటే తెలుస్తుంది. ఈ చిత్రంలో మైఖేల్ పాత్ర సినిమాకి ప్రధాన ఆకర్షణ, నెగిటివ్ రోల్ లో చక్కటి నటనను ప్రదర్శించాడు. హీరోయిన్ ఆషికా రంగనాథ్ ఉన్నంతలో బాగా నటించింది. ప్రతి ఫ్రేమ్‌లో చాలా అందంగా కనిపించింది, బ్రహ్మాజీ తన వంతు కృషి చేసాడు.మరియు మిగిలిన నటీనటులు అందరూ కూడా వారి, వారి పాత్రలకు న్యాయం చేశారు.


సాంకేతిక నిపుణుల పనితీరు
రాజేంద్రరెడ్డి ఎంచుకున్న ఐడియా చాలా యూనిక్ గా ఉంది. ఈ సినిమాలో ప్రతి సన్నివేశాన్ని కొత్తగా చూపించే ప్రయత్నం చేశారు.ఈ సినిమా చూసే ప్రేక్షకులు మాత్రం ఇందులో ఉన్న థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ చూసి సర్ప్రైజ్ ఫీల్ అవుతారు. ఫ‌స్టాఫ్ చాలా బావుంది అనుకోగానే సెకండాఫ్ అంతా రేసీ గా బోర్ కొట్టించకుండా సినిమా చూస్తున్న ప్రేక్షకులను ఎంగేజింగ్‌గా చేయడంలో దర్శకుడు పూర్తిగా సక్సెస్ అయ్యాడు అని చెప్పవచ్చు. ఎస్. సౌందర్ రాజన్ సినిమాటోగ్రఫీ బాగుంది, జిబ్రాన్ ఇచ్చిన రిమీక్ సాంగ్ ‘ఎన్నో రాత్రులొస్థాయి గాని’ పాట థియేటర్లో ప్రేక్షకులను కనువిందు చేస్తుంది.అతని బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. అలాగే ఫైట్స్ కూడా డిఫరెంట్ గా ఉన్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్ లు ఖర్చుకు వెనుకాడకుండా ఈ చిత్రాన్ని చాలా చక్కగా నిర్మించారు. వైవిద్యమైన కథలతో కూడుకున్న థ్రిల్లింగ్ సినిమాలు ఇష్టపడే ప్రేక్షకులకు మాత్రం “అమిగోస్” చిత్రం మెప్పిస్తుంది.

Cinemarangam. Com Review Rating.. 3/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here