Amma RajaShekhar‘s Love and Entertainer ‘Hi Five’ Movie Review

Cinemarangam.Com
Review Rating..3/5
సినిమా : హైయ్ – ఫైవ్
బ్యానర్ : రాధ క్యూబ్
ప్రొడ్యూసర్ :రాధా రాజశేఖర్
డైరెక్టర్ : అమ్మా రాజశేఖర్
నటీనటులు : అమ్మా రాజశేఖర్, మన్నారా చోప్రా, ముక్కు అవినాష్, జాస్మిన్, ప్రణాళి, త్రిపాఠి, త్రిష తదితరులు
సంగీతం : ఎస్ థమన్ , JD జాజ్
ఎడిటర్ : హరిఎన్టీఆర్
డి ఓ పి : S.S ముజీర్

రాధ క్యూబ్ పతాకంపై దిక్షిత్ , మనోరా చోప్రా, జాస్మిన్, ఛాయ, ప్రణాళి, త్రిప్తి, త్రిష, జబర్దస్త్ అవినాష్, జబర్దస్త్ సన్నీ, సమీర్ నటీ నటులుగా కొరియోగ్రాఫర్ గా ఎన్నో సినిమాలకు పనిచేసి దర్శకత్వం వైపు అడుగులు వేశారు అమ్మా రాజశేఖర్. ఆయన దర్శకత్వం వహించిన సినిమాలు ఇప్పటివరకు ప్రేక్షకులను ఎంతో అలరించాయి. గోపిచంద్‌ రణం, రవితేజ ఖతర్నాక్‌, నితిన్‌ టక్కరి చిత్రాలకు దర్శకత్వం వహించాడు. అతను బిగ్ బాస్ తెలుగు 4 రియాల్టీ షోలో ఇతర సభ్యులతో పాటు 2020 సెప్టెంబరు 6న పాల్గొన్నాడు.ఈ క్రమంలో మళ్ళీ ఆయన దర్శకత్వం వహించిన సినిమా .`హైయ్‌ ఫైవ్` ఫన్ ఎండ్ గన్ అనేది ట్యాగ్ లైన్.  రాధా రాజశేఖర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. మంచి అంచనాలతో తెరకెక్కిన ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని జులై 22 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకుందో రివ్యూ లో చూద్దాం పదండి

కథ :

సరదాసరదాగా ఉండే ఐదుగురు అమ్మాయిలకు సంభందిచిన కథ ఇది. ఈరోజుల్లో యువత ఎలా ఉంటుంది అనే అంశాల చుట్టూ ఈ కథ తిరుగుతూ ఉంటుంది. ఓ ఐదుగురు అమ్మాయిలు ఎంజాయ్ చేయడం కోసం గోవా వెళతారు. అక్కడ వారికి మంచి ఎంజాయ్ మెంట్ తో పాటు ఓ ప్రాబ్లమ్ కూడా ఎదురవుతుంది. ఆ సమస్య నుంచి వారు ఎలా బయటపడ్డారు. దానికోసం ఎంత ఇబ్బంది పడ్డారు అనేదే ఈ సినిమా కథ. యాక్షన్, రొమాన్స్, థ్రిల్, సస్పెన్సు వంటి ఎన్నో అంశాల మిళితంతో ఈ సినిమా కథ ఉంది.

విశ్లేషణ :

మంచి క్యాచీ టైటిల్ తో తెరకెక్కిన ఈ సినిమా కు అమ్మా రాజశేఖర్ దర్శకత్వం వహించడం ఈ సినిమా కు ప్లస్. కొరియోగ్రాఫర్ గా ఎన్నో అద్భుతమైన సినిమాలు చేసిన ఆయన దర్శకత్వంలోనూ తనకు సాటి ఎవరు లేరని ఈ సినిమా తో మరో సారి నిరూపించుకున్నాడు. అంతకుముందు యాక్షన్ సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. పెద్ద హీరోల తో పనిచేసిన ఈ దర్శకుడు ఇప్పుడు ఈ సినిమా ద్వారా ప్రయోగాత్మక సినిమా చేశాడని చెప్పొచ్చు. ఇక మన్నారాచోప్రా ఈ సినిమా లో నటించడం సినిమాకే హైలైట్. ఆమె అందచందాలు ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. గ్లామర్ హీరోయిన్ గా మంచి పేరున్న ఈమె ఈ సినిమా తో మరోసారి తానేంటో నిరూపించుకుంది. ఏదేమైనా ఆమెకు ఈ సినిమా కూడా ప్లస్ అవుతుంది. ఇక మిగితా నటీనటులు బాగా నటించారు. జాస్మిన్, ప్రణాళి, త్రిపాఠి, త్రిష మోతాదు కి మించి గ్లామర్ షో చేశారు. వారికి మంచి ఫ్యూచర్ ఉంది. నటన విషయంలో ఎవరు తక్కువగా నటించలేదు. జబర్దస్త్ ద్వారా పేరు తెచ్చుకున్న ముక్కు అవినాష్ ఈ సినిమాలో చేసిన పోలీస్ పాత్ర తో అందరిని ఆకట్టుకున్నాడు. ఆయన కామెడీ ఈ సినిమా కి ఎంతో ఉపయోగపడింది. దర్శకుడు అమ్మా రాజశేఖర్ నటుడిగా కూడా మరోసారి తన సత్తా చాటారు. దీంతో ఆయన ఆల్ రౌండర్ అనిపించుకున్నాడు. సినిమాటోగ్రఫీ బాగుంది. గోవా లోని ప్రకృతి అందాలు బాగా చూపించాడు S.S ముజీర్. హరి అందించిన ఎడిటింగ్ సరిగ్గా కుదిరింది. ఎక్కడ సీన్ ల్యాగ్ కాకుండా చూసుకున్నాడు. నిర్మాణ విలువలు కూడా సినిమాకు తగ్గట్టుగా బాగా ఉన్నాయి. థమన్ ,JD జాజ్ సంగీతం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నేపథ్య సంగీతం బాగుంది.

ప్లస్ పాయింట్స్ :

అమ్మా రాజశేఖర్ దర్శకత్వం, నటన

సంగీతం

సినిమాటోగ్రఫీ

తీర్పు :

యువత తప్పకుండ చూడాల్సిన సినిమా. గ్లామర్ సినిమాగా పైకి కనిపించినా ఈ సినిమా లో మంచి మెసేజ్ ఉంది. యాక్షన్, రొమాన్స్, థ్రిల్, సస్పెన్స్ తో కూడిన ఈ సినిమా తప్పకుండా అందరిని అలరిస్తుంది.

రేటింగ్ : 3/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here