Anjali’s web series “Jhansi” season 2 to be streamed soon on Disney’s Plus Hot Star

టాలీవుడ్ ప్రముఖ నటి అంజలి ప్రధాన పాత్రలో నటించిన వెబ్‌ సిరీస్‌ ‘ఝాన్సీ’ ఇటీవల డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లో రిలీజై మంచి ఆదరణ పొందింది. ఈ వెబ్ సిరీస్ లో యాక్షన్ ఓరియెంటెడ్ క్యారెక్టర్ లో అంజలి చేసిన స్టంట్స్ ఆకట్టుకున్నాయి. దర్శకుడు తిరు ఈ వెబ్ సిరీస్ ను డైరెక్ట్ చేశారు. ట్రైబల్ హార్స్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై కృష్ణ నిర్మించారు.

సైకలాజికల్ యాక్షన్ డ్రామా కథతో తెరకెక్కిన ఝాన్సీ వెబ్ సిరీస్ కు ఇప్పుడు సెకండ్ పార్ట్ రాబోతోంది. జనవరిలో డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లో ఝాన్సీ సీజన్ 2 స్ట్రీమింగ్ కు రెడీ అవుతోంది. ఇందులో అబ్ రామ్, ఆదర్శ్ బాలకృష్ణ, సంయుక్త హార్నాడ్, చాందినీ చౌదరి, శరణ్య, రాజ్ అర్జున్, కళ్యాణ్ మాస్టర్, ముమైత్ ఖాన్ ఇతర కీలక పాత్రలు పోషించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here